For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమ వివాహాల్లో అది లోపిస్తుంది...

By Sujeeth Kumar
|

పెద్ద‌లు కుద‌ర్చిన వివాహాలు అనాదిగా మ‌న సంప్ర‌దాయంలో వంద‌ల ఏళ్లుగా భాగ‌మ‌య్యాయి. సంప్ర‌దాయ పెళ్లిళ్ల‌పైన న‌మ్మ‌కం ఇంకా చెరిగిపోలేద‌నే చెప్పాలి. ప్రేమ వివాహాలు కూడా పెద్ద‌లు కుదిర్చిన వాటిలా మ‌ల్చుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది.

త‌మ జీవిత భాగ‌స్వాముల‌ను అనుకోకుండా క‌ల‌వ‌క‌పోయినా త‌ల్లిదండ్రులే ఏరికోరి స‌రైన జోడిని ఎంపిక చేయ‌డం అదృష్ట‌మే. అంత‌ర్జాల వివాహ ప‌రిచ‌య వేదిక‌ల హ‌వా న‌డుస్తున్న ఈ కాలంలో ప్రేమ పెళ్లి కంటే పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్లే న‌య‌మంటారా? ఈ ప్ర‌శ్ననే మేము కొన్ని వివాహ‌మైన జంట‌ల‌ను అడిగి తెలుసుకున్నాం. వాళ్లు చెప్పిన స‌మాధానాలివిగో....

పెద్ద‌లు కుద‌ర్చిన వివాహాల్లో అదుంటుంది...

పెద్ద‌లు కుద‌ర్చిన వివాహాల్లో అదుంటుంది...

నా పెళ్లి కాక ముందు కొంద‌రు మ‌గ స్నేహితుల‌తో స్నేహం చేశాను, క‌లిసి తిరిగాను. వాళ్లలో కొంద‌రు న‌చ్చారు. ఐతే పెళ్ల‌య్యాక వాట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టేశాను. ఇప్పుడు మా సంసారం ఆనందంగా సాగిపోతుంది. ఏడాది కాలంగా హాయిగా ఉంటున్నాం. సన్నిహితుల ద్వారా తెలుసుకొని మా పెళ్లిని కుద‌ర్చారు మా త‌ల్లిదండ్రులు. ఇలా వివాహం కుదర్చేట‌ప్పుడు అటు ఏడు త‌రాలు ఇటు ఏడు త‌రాలు చూస్తారు. సంప్ర‌దాయాలు క‌లుస్తాయి. జీవితం ప‌ట్ల తార్కిత్వంతో మెల‌గ‌గ‌లిగే అవ‌కాశం ల‌భిస్తుంది. అదే ప్రేమ‌లో ఉంటే కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ త‌ర్వాత మ‌నస్ప‌ర్థాలు వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.

ఎలాంటి వ్య‌క్తి అన్న‌దే ముఖ్యం

ఎలాంటి వ్య‌క్తి అన్న‌దే ముఖ్యం

అది ప్రేమ వివాహామైనా, పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్ల‌యినా కొన్నేళ్ల త‌ర్వాత ఒకే వేదికను అలంక‌రిస్తాయి. కొన్నాళ్లు స‌ర్దుకుపోవ‌డాలు అవీ ఉంటాయి. ఆ త‌ర్వాత జీవిత భాగ‌స్వామి బాగా అర్థం అవుతారు. సంతోష‌క‌ర‌మైన వైవాహిక జీవితం అలా సాగిపోతుంటుంది. వివాహం ఎలాంటిద‌న్న‌ది ముఖ్యం కాదు చేసుకోబోయే వారు ఎలాంటి వార‌న్న దానిపైనే వైవాహిక జీవితం ఆధార‌ప‌డి ఉంటుంది.

వాటిని బ‌హిష్క‌రించాలి

వాటిని బ‌హిష్క‌రించాలి

విన‌డానికి కాస్త క‌టువుగా ఉన్నా స‌రే పెద్ద‌లు కుదిర్చిన వివాహాల‌ను బ‌హిష్క‌రించాల‌ని నా న‌మ్మ‌కం. ఒక వ్య‌క్తి పూర్తిగా పెళ్లికి సిద్ధ‌మైన‌ప్పుడే వివాహం జ‌రిపించాలే త‌ప్ప బ‌ల‌వంతంగా మూడు ముళ్లు వేయిస్తానంటే ఎలా? అది 25 కావొచ్చు, 35 అవ్వొచ్చు 45 ఏళ్లు వ‌చ్చినా ప‌ర్వాలేదు. స‌రైన వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డ్డాకే అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి.

అనుకున్నంత చెడ్డ‌వేమీ కావు

అనుకున్నంత చెడ్డ‌వేమీ కావు

పెద్ద‌లు కుద‌ర్చిన వివాహాల్లో అన్నీ మొద‌టినుంచీ ప్రారంభిస్తాం. ప్ర‌తి రోజూ ఆశ్చ‌ర్య‌క‌ర ఆనందాలే. కొన్ని కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిందే. ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు అబ్బాయిలు ఒక‌లా ఉంటే పెళ్ల‌య్యాక చాలా ప‌ద్ధ‌తిగా మారిపోతున్నారంటూ చాలా మంది చెబుతుంటారు.

విధి రాత ..

విధి రాత ..

వ్య‌క్తిగ‌తంగా నా ప్ర‌కారం అంతా విధి రాత‌. కొన్ని జంట‌లు ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఒక‌ర్నొక‌రు కొన్ని ఏళ్ల‌పాటు మోసం చేసుకున్నారు. మ‌రో వైపు పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్ల‌యిన స‌రే చ‌క్క‌గా సంసార జీవితాల‌ను ఈదుతున్న జంట‌ల‌ను చూశాను. సంబంధాలు ఎటు దారితీస్తాయో ఎవ్వ‌రం వూహించ‌లేం. అది ప్రేమ పెళ్లి కావొచ్చు, పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి కావొచ్చు అంతా విధిరాత మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

పెళ్లి త‌ర్వాత ప్రేమ దొరికింది..

పెళ్లి త‌ర్వాత ప్రేమ దొరికింది..

నాది పెద్ద‌లు కుద‌ర్చిన వివాహం. మేము కాస్త స‌మ‌యం తీసుకుని ప్రేమ‌లో ప‌డ్డాం. మొద‌ట అప‌రిచితుల్లానే ఉండేవాళ్లం. మెల్లిగా ఒక‌ర్నొక‌రం అర్థం చేసుకొని కొన్ని స‌ర్దుబాట్ల‌తో వైవాహిక జీవితాన్ని చ‌క్క‌గా గ‌డిపేస్తున్నాం. మా మ‌ధ్య అప్పుడ‌ప్పుడు చిన్న చిన్న పొర‌పొచ్చాలు వ‌చ్చినా అవ‌న్నీ కొంచెం సేప‌ట్లో మ‌టుమాయ‌మై ఎప్ప‌టిలాగే ఆనందంగా ఉంటున్నాం.

ప్రేమ పెళ్లి కుప్ప‌కూలింది...

ప్రేమ పెళ్లి కుప్ప‌కూలింది...

ఏడేళ్ల పాటు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగాక త‌న‌ను పెళ్లి చేసుకున్నాను. గాఢ‌మైన ప్రేమ‌లో మేము మునిగిపోయిన‌ట్టు భ్ర‌మ ప‌డ్డాం. మా జీవితంలో ఎలాంటి క‌ష్టాలు రావ‌నుకున్నాం. అయితే మూడేళ్లకే మా మ‌ధ్య చీలిక‌లు ఏర్ప‌డ్డాయి. విడాకులు తీసుకొని ఎవ‌రి దారిలో వారు విడిపోయాం. మా త‌ల్లిదండ్రులు అప్పుడే చెప్పారు.. మేమిద్ద‌రం ఒక‌రికొక‌రం స‌రైన జోడీ కాద‌ని వాళ్ల మాట అప్పుడు పెడ‌చెవిన పెట్టాను. ఇప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ల మాట విని ఉంటే బాగుండేద‌ని.

English summary

Arranged marriage vs. love marriage

Arranged marriages have been a part of our culture since centuries and our faith in the institution of traditional marriage remains unchanged. Love can also be arranged, at least it stands true for people who didn’t find their soulmates accidentally but were introduced to them by their parents.
Story first published: Wednesday, July 25, 2018, 15:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more