ప్రేమ అభ్యర్ధనగా వచ్చినప్పుడు జరిగిన యదార్థ సంచలన ప్రేమ కథ

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

హిందీ చిత్ర పరిశ్రమ సినిమాల్లో ఎక్కడైనా దాగి ఉండి సమీపించడం అనే విద్యను ఎంతగానో మహిమాన్వితంగా పెద్దదిగా చూపించడం జరిగింది, జరుగుతోంది. మనం తరచూ సినిమాల్లో హీరోలు దాగి ఉండి హీరోయిన్ వద్దకు అనూహ్యంగా వెళ్లి వారిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి ఎన్నో సన్నివేశాలను చిత్రాల్లో చూస్తుంటాం.

అయినప్పటికీ నిజజీవితంలో ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. ఇప్పుడున్న ప్రపంచంలో మగపిల్లలు అందరూ బాగా చదువుకున్న సభ్యతకలిగిన కుటుంబాల నుండి వస్తున్నారు. బస్ స్టాండ్ మరియు సినిమా హాల్ దగ్గర ఉన్న అమ్మాయిలు లేదా మహిళలతో దాగి ఉండి అనూహ్యంగా వెళ్లి వారిని పలకరించడం లేదా వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి పనులు చేయడానికి దూరంగా ఉంటున్నారు.

love story

ఇలా చేయడం అగౌరవపరచడం క్రిందకు వస్తుంది. ఇలా వీటన్నింటికి దూరంగా ఉండాలంటే ఎంతో పట్టుదల ఉండాలి. ఒకవేళ అసభ్యంగా గనుక ప్రవర్తిస్తే అందువల్ల నష్టమే తప్ప ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనివల్ల సమాజంలో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి భయాలు పురుషులను మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా కట్టడి చేస్తున్నాయి.

సినిమాలలో హీరోలందరూ దైవంశ సంభూతులుగా చూపిస్తుంటారు. వారికి ఎన్నో గొప్ప శక్తులు ఉన్నట్లు లేదా శక్తివంతులు అయినట్లు చూపిస్తారు. ఇవాళ సమాజంలో ఉన్న యువత దాగి ఉంది ఉండి అనే విద్యకు కొత్త సొబగులు అద్ది సరికొత్త విధానంలో దానిని అమలుపరుస్తోంది. ఈ రకమైన ప్రవర్తనను సామజిక మాధ్యమాలు లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రముఖంగా అమలుపరుస్తున్నారు. దీనినే డిజిటల్ స్టాకింగ్ అని అంటారు.

అయితే, అందరు ప్రముఖంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, సామజిక మాధ్యమాల ద్వారా అబ్బాయిలు, అమ్మాయిలను పలకరించే తీరు చాలా సందర్భాల్లో నిజమైన ప్రేమ కథలకు దారి తీస్తోంది. అంతేకాకుండా ప్రపంచంలో వారికి ఎదురయ్యే అల్లకల్లోలన్నింటిని దాటుకొని, విపరీతంగా ప్రయత్నించి నిజజీవితంలో ఒక విజయవంతమైన ప్రేమికులుగా ఎదుగుతున్నారు. ఆ ప్రేమ కథలు కూడా విజయ తీరాలకు చేరుతున్నాయి.

ఇప్పుడు మనం జ్యోతి మరియు నిషాంత్ మధ్య చోటు చేసుకున్న ప్రేమ కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రేమ కథలో సామజిక మాధ్యమాలు ఎలాంటి పాత్ర పోషించాయి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

వినయపూర్వకమైన ఆరంభం :

వినయపూర్వకమైన ఆరంభం :

అది 2008 వ సంవత్సరం. ఆ రోజుల్లో ఇంటర్నెట్ సెంటర్లు రోజు రోజుకి విపరీతమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న సమయం. నిషాంత్ మూడవ సెమిస్టర్ పూర్తి అయిన తర్వాత కాలేజీ నుండి ఇంటికి వచ్చాడు. ఆలా వచ్చిన సందర్భంలో ఒక రోజు మధ్యాహ్నం నిషాంత్ అతని స్నేహితులతోక లిసి సామజిక మాధ్యమాల్లో ఒక ఖాతాని తెరవాలి అని అనుకున్నాడు. ఆ రోజుల్లో ఇలా చేయడానికి ఎంతోమంది విపరీతమైన ఆసక్తి చూపించేవారు.

ఒకసారి ఖాతా తెరిచిన తర్వాత చాలామంది చేసే అతి పెద్ద పనులు ఏమిటంటే, తమకు సంబంధించిన చిత్రాలను మరియు సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. ఈ పనులన్నింటిని ఎంతో సులువుగా చకచకా చేసేశారు.

అభ్యర్ధన :

అభ్యర్ధన :

ఆ తర్వాత ఒకానొక వేసవి మధ్యాహ్నం, అంతర్జాలంలో తన పని చేసుకుంటున్న సమయంలో నిషాంత్ కు జ్యోతి అనే ఖాతాకు సంబంధించిన వివరాలు అతనికి కనిపించింది. ఆ అమ్మాయిలో ఎదో విషయం ఇతనిని విపరీతంగా ఆకర్షించింది.

చాలా మంది అమ్మాయిలు ఎంతో అధునాతనమైన ఫ్యాన్సీ చిత్రాలను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటారు. దానికి ఎన్నో హంగులు జోడిస్తుంటారు. కానీ, జ్యోతి పెట్టుకున్న ఫోటో మాత్రం చాలా సాధారణంగా ఉండి, బాగా నవ్వుతూ ఉంది. ఆమెకు సొట్ట బుగ్గలు ఉన్నాయ్. ఇది చూసిన వెంటనే అతడు ఎంతగానో ఆకర్షించబడ్డాడు. ఆమె ఆలోచనలోనే మునిగిపోయాడు.

కానీ, నిషాంత్ కు ఉన్న వ్యక్తిగత నీటి నియమాల అనుగుణంగా తెలియని వ్యక్తులకు ఆకస్మికంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం విరుద్ధం. అందుచేత మొదట నిషాంత్ జ్యోతికి ఒక మెసేజ్ పెట్టాడు. మీరు గనుక సరే అంటే నేను మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ని పంపిస్తాను అని చెప్పాడు.

అందరిలోకంటే విబ్భిన్నంగా నిలిచే అంశం ఏమిటంటే :

అందరిలోకంటే విబ్భిన్నంగా నిలిచే అంశం ఏమిటంటే :

ఎంతో మంచి నవ్వుతో కూడిన ముఖంతో పాటు మంచి సౌందర్యవతి అయిన జ్యోతికి, ఎంతో మంది డిజిటల్ ప్రపంచంలో అభిమానులు ఉన్నారు మరియు ఆమెను అనుసరిస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలియాని ఒక అబ్బాయి నుండి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం ఆమెను ఆశ్చర్య పరచలేదు మరియు ఆమెకు అది కొత్త కాదు.

అయినప్పటికీ ఒక అబ్బాయి ఎంతో బిడియంతో ముందుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపకుండా, బాధ్యతతో మీ స్నేహితుడిగా ఉంటా అని ఒక మెసేజ్ పంపడం ఆమెను ఆకర్శించింది. దీంతో నిషాంత్ పై ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడటమే కాకుండా, అతడు చేసిన పని ఈమెను ఎంతగానో ఆకట్టుకుంది. అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఒప్పుకుంది.

ప్రేమ వికసించింది :

ప్రేమ వికసించింది :

మొదట సాధారణంగానే మొదలైన వీరి స్నేహం, ఒక బలమైన స్నేహానికి దరి తీసింది. ఈ స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ ఎంతో సమయాన్ని ఒకరినొకరు ప్రేమించుకుంటూ సామజిక మాధ్యమాల్లో గడిపేవారు.

ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము అనే విషయాన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఇదే విషయాన్ని ఒకరికొకరు చెప్పుకున్నారు. రెండు సంవత్సరాలకు పైగా సామజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసుకున్నారు. కానీ, అప్పటి వరకు ఒకరినొకరు అస్సలు కలుసుకోలేదు.

అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు :

అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు :

నిషాంత్ మరియు జ్యోతి వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి, వారి దగ్గరి స్నేహితులకు చెప్పినప్పుడు నిజంగా చెప్పాలంటే, వారు ఎవరు ఈ విషయాన్ని అంత సానుకూలంగా తీసుకోలేదు. ప్రతి ఒక్కరు ఏమని చెప్పేవారంటే, ఆ వ్యక్తి సంబంధం అనే దానిని అడ్డుపెట్టుకొని నిన్ను మోసం చేస్తున్నాడు అని ఇద్దరికీ చెప్పేవారు. అంతేకాకుండా మీ మధ్య ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ మాత్రమే అని చెప్పారు. కానీ, నిషాంత్ మరియు జ్యోతికి తెలుసు వారిద్దరి మధ్య ఉండేది అసలైన ప్రేమ అని. వీరందరూ చెప్పేమాటల్లో ఎటువంటి వాస్తవం లేదని.

చివరికి ఎప్పుడు కలుసుకున్నారంటే :

చివరికి ఎప్పుడు కలుసుకున్నారంటే :

2011 ఏప్రిల్ 13 వ తారీఖున, జ్యోతి మరియు నిషాంత్ ఎట్టకేలకు బెంగళూరు లోని ఒక అధునాతన రెస్టారెంట్ లో కలుసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి మధ్య ఉన్న వాస్తవిక సంబంధ బాంధవ్యంలో ఉన్న అనుమానాలను,మొదటిసారి కలుసుకున్నప్పుడు నివృత్తి చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.

ఆ క్షణం ఆ జంట మధ్య ఉన్న ప్రేమ మరియు అనుబంధం మరింత బలపడింది. దీనిని మరో ఎత్తుకు తీసుకెళ్లాలని భావించారు.

కుటుంబం అసంతృప్తిని వ్యక్తపరిచింది :

కుటుంబం అసంతృప్తిని వ్యక్తపరిచింది :

వారిద్దరి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాన్ని వారి దగ్గరి స్నేహితులే అంగీకరించలేకపోయారు. ఇటువంటి సమయంలో ఈ ప్రేమను కుటుంబం నుండి అంగీకారం రావాలి అనే ఆశ అత్యాశ అవుతుంది. వీరిద్దరి కుటుంబాలు వీరి మధ్య ఉన్న ప్రేమ పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచాయి. అంతేకాకుండా జ్యోతి మరియు నిషాంత్ పెళ్లి చేసుకోవడం అనే విషయాన్ని ఇరు కుటుంబాలు పూర్తిగా తిరస్కరించాయి.

దారిలో కొత్త సమస్యలు :

దారిలో కొత్త సమస్యలు :

జ్యోతి తల్లిదండ్రులు ఈ మొత్తం విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయం తెలిసి ఆమెకు పెళ్ళిచేయడానికి పెళ్లి కొడుకుని వెతకటం ప్రారంభించారు. నెలలోపే అనికేత్ అనే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఇతడు బెంగళూరు లోని ప్రముఖ కంపెనీ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

అన్నింటిని అధిగమించారు :

అన్నింటిని అధిగమించారు :

అనూహ్యంగా చోటుచేసుకుంటున్న ఈ సంఘటనలన్నీ ఆ జంటను ఒత్తిడిలోకి నెట్టివేశాయి. వారి ప్రేమను విజయవంతం చేసుకొనే అవకాశాలు క్రమంగా కుంచించుకుపోయాయి. జ్యోతిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తే, అది ఇప్పుడే జరగాలని లేదంటే అది ఎప్పటికీ జరగదని గ్రహించాడు నిషాంత్. తన జీవితాంతం ప్రేమించే వ్యక్తిని ఎక్కడ కోల్పోతానో అనే భయంతో, నిషాంత్ ఎంతో దైర్యం తెచ్చుకొని అమ్మాయితో కలిసి ఇంటి నుండి పారిపోయాడు.

చట్టపరమైన వ్యవహారాలన్నింటిని తేల్చారు :

చట్టపరమైన వ్యవహారాలన్నింటిని తేల్చారు :

ఇంటి నుండి తప్పించుకున్న తర్వాత, ఈ జంట హిందూ వివాహ చట్టం ప్రకారం కోర్ట్ లో వివాహం చేసుకుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో వీరిద్దరూ పెద్దవారు కావడంతో, వీరిద్దరి కుటుంబాలు వీరిద్దరిని వేరు చేయడానికి గాని లేదా కలవనివ్వకుండా ఉండేలా చేయడానికి గాని చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి.

భయపెట్టే వివాహ జీవిత ప్రయాణం ఎలా సాగిందంటే :

భయపెట్టే వివాహ జీవిత ప్రయాణం ఎలా సాగిందంటే :

ఆ రోజు ఇది జరిగిన తర్వాత, ఇప్పటికి 5 సంవత్సరాలు అయ్యింది. వీరిద్దరూ ముంబైలో ఒక అపార్ట్మెంట్ లో జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. వీరికి ఒకకొడుకు జన్మించాడు. అతడి పేరు ఆర్యన్. ఒకసారి కొడుకు అర్ధం చేసుకొనే వయస్సుకు వచ్చిన తర్వాత తమ కుటుంబ జీవితంలో, సామజిక మాధ్యమం ఎలా ప్రముఖ పాత్ర పోషించింది అనే విషయాన్ని చెప్పడానికి వీరు ఎంతో ఆతురతగా ఉన్నారు. అప్పటి వరకు లేదా ఆ తర్వాత గాని ఖచ్చితంగా ఈ చిన్న మంచి చూడముచ్చటైన కుటుంబంలో ఉన్న వివాహ ఆనందానికి సంబంధించిన కథ గురించి ఆ కొడుకు ఖచ్చితంగా తెలుసుకుంటాడు. కానీ, అంతకు ముందే మీరందరు ఈ విషయాన్ని తెలుసుకున్నారు.

English summary

Love Story Which Came As A Request

Most of us ladies love using makeup. But on an off day when we don't feel like using any makeup, we would love to have the option of looking great even without using any makeup. So, we will tell you how to always look good without using makeup.
Story first published: Tuesday, January 30, 2018, 13:30 [IST]
Subscribe Newsletter