Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
నా గర్ల్ ఫ్రెండ్ నాతో సరసాలాడుతూనే మరో అతనితో ఎంజాయ్ చేస్తుంది, ఏం చెయ్యమంటారు?
ఒకవైపు నాతో సరసాలు సాగిస్తూనే మరోవైపు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఔటింగ్ కు వెళ్తుంది. మళ్లీ నా ఎదుట ఏమీ తెలియనట్లుగా నటిస్తుంది. తనని విడిచి నేను అస్సలు ఉండలేను. తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను పూర్తిగా మ
ప్రశ్న : నేను రెండేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ఎంతో ప్రేమిస్తున్నానని చెబుతూ ఉంటుంది. వాస్తవానికి ఆమెకు లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. తను నాతో పాటు ఎమ్మెస్సీ లో జాయిన్ అయ్యింది. ఆమె ఒక్కరే మూడీగా క్లాస్ లో కూర్చొనేవారు. నేను అందరితో కలవిడిగా ఉండేవాన్ని.
తను ఎందుకలా బాధపడుతుందో తెలుసుకోవాలని ఒకసారి ఆమెతో మాట్లాడాను. తనని ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేశాడని చెప్పింది. ఆ బాధలో నుంచి కోలుకోలేకపోతున్నానంది. అప్పటి నుంచి నేను ఆమెతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఆమె బాధలో నుంచి బయటకు రావాలని చాలా ప్రయత్నించాను.

ప్రేమ ఏర్పడింది
ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఒక రోజు నేను తనకు ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. కాకపోతే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా తనని మోసం చేయొద్దని కోరింది. నేను అలా ఎప్పటికీ చెయ్యనని చెప్పాను. కానీ కొన్నాళ్లుగా ఆమె మళ్లీ తన పాత బాయ్ ఫ్రెండ్ ని కలిసి మాట్లాడుతుంది.

నాతో సరసాలు సాగిస్తూనే
ఒకవైపు నాతో సరసాలు సాగిస్తూనే మరోవైపు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఔటింగ్ కు వెళ్తుంది. మళ్లీ నా ఎదుట ఏమీ తెలియనట్లుగా నటిస్తుంది. తనని విడిచి నేను అస్సలు ఉండలేను. తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను పూర్తిగా మరిచిపోవాలంటే ఏం చెయ్యాలి.

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి
సమాధానం : మీ గర్ల్ ఫ్రెండ్ మీతో ఆటలాడుతోంది. ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి మీకు దగ్గరైంది. ఇప్పుడు మళ్లీ అతనితోనే తిరుగుతోందంటున్నారు. ఆ విషయం మీకు చెప్పలేదంటున్నారు. దీని బట్టీ చూస్తే ఆమెపై కాస్త అనుమానపడాల్సిన అవసరం ఉంది.

దూరంగా ఉంటేనే మంచిది
మీరు ఆమెకు దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. తర్వాత చాలా బాధపడతారు. మీరు ఆమెను ఒకసారి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న విషయంపై నిలదీయండి. ఆమె సమాధానం వినండి.

పెళ్లి చేసుకున్నా కూడా
ఆమె ఏమీ తెలియనట్లుగా మీతో నటిస్తే మీరు ఆమెకు దూరం కావడమే మంచిది. లేదంటే భవిష్యత్తులో ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కూడా అతనితో చనువుగా ఉండే అవకాశం ఉంది. దీంతో మీ సంసారంలో కలతలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మీరే బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోండి.



Click it and Unblock the Notifications
