For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిచెన్ లోనే రొమాన్స్ చేసుకునేవాళ్లం, మా నాన్న చెప్పిన వాడితో పెళ్లి జరిగి ఉంటే #mystory211

అది కార్తీక మాసం కావడంతో అక్క రోజూ ఏదో ఒక ఆలయానికి వెళ్లేది. దాంతో రోజూ నేనే లంచ్ బాక్స్ రెడీ చేసేదాన్ని. సుశాంత్ దాన్ని తీసుకెళ్లడానికి వచ్చేవాడు. కొన్నాళ్లకు మా పరిచయం ప్రేమగా మారింది. కిచెన్ ప్రేమ.

|

నా పేరు సుమ. మాది ఖమ్మం. మాది మధ్యతరగతి కుటుంబం. మా వాళ్లకు డబ్బులు లేకున్నా కుల పిచ్చి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికొచ్చారంటే చాలు మా నాయనమ్మ... వాళ్లు ఏంటోళ్లే అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. మా నాన్నకు కూడా అలాంటి పట్టింపులు చాలానే ఉన్నాయి.

ఇంటికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలని నాకు కోరిక ఉండేది. మొత్తానికి ఐసెట్ మంచి ర్యాంకు రావడంతో ఎంబీఏ సీటు వచ్చింది. ఎంబీఏ చదవడం కోసం హైదరాబాద్ కు వచ్చాను. మొదట్లో హాస్టల్ లో ఉండేదాన్ని. అక్కడ ఫుడ్ బాగోలేక మా అక్క వాళ్లింటికి వాళ్ల ఇంటికి షిఫ్ట్ అయ్యాను. ఆమె మా పెద్దమ్మ కూతురు. పేరు సువర్ణ.

బావ బంధువు వాళ్లింటికి వచ్చేవాడు

బావ బంధువు వాళ్లింటికి వచ్చేవాడు

సువర్ణ అక్కది ప్రేమ వివాహం. అబ్బాయిది వేరే క్యాస్ట్. మొదట్లో వాళ్లింట్లో వారు ఆమెను కుటుంబానికి దూరంగా పెట్టారు. తర్వాతా మళ్లీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. సువర్ణ అక్క భర్తను నేను బావా అని పిలిచేదాన్ని. ఆ బావ వాళ్లకు సంబంధించిన ఒక బంధువు రోజూ వాళ్లింటికి వచ్చేవాడు. అలా అతను నాకు పరిచయం అయ్యాడు.

అతని పేరు సుశాంత్.

రోజూ ఉదయం ఇంటికొచ్చి

రోజూ ఉదయం ఇంటికొచ్చి

సుశాంత్ కూడా బావ ఆఫీసులోనే పని చేసేవాడు. బావా ఉదయమే వెళ్లిపోయేవాడు. సుశాంత్ కాస్త లేట్ గా వెళ్లేవాడు. అయితే రోజూ ఉదయం ఇంటికొచ్చి బావ కోసం క్యారియర్ తీసుకుని వెళ్లేవాడు. రోజూ అక్క సుశాంత్ తో బావకు లంచ్ బాక్స్ ఇచ్చి పంపేది.

అక్క టెంపుల్ కు వెళ్లినప్పుడు సుశాంత్ వచ్చాడు

అక్క టెంపుల్ కు వెళ్లినప్పుడు సుశాంత్ వచ్చాడు

ఒక రోజు అక్క ఉదయమే లేచి టెంపుల్ వెళ్లింది. సుశాంత్ వచ్చేసరికి క్యారియర్ బాక్స్ రెడీ చేసి పెట్టమంది. అతను వస్తే ఇచ్చి పంపమంది. అతను ఇంటికి వచ్చాడు. అప్పటికీ ఇంకా నేను రైస్ వండలేదు. కాసేపు వెయిట్ చెయ్యమన్నాను. సరే అన్నాడు. నేను కిచెన్ లో పడుతున్న కష్టాలు చూసి వచ్చి సాయం చేశాడు.

నా మనస్సుకు మరింత దగ్గరయ్యాడు

నా మనస్సుకు మరింత దగ్గరయ్యాడు

సుశాంత్ చాలా బాగుంటాడు. మంచి కుర్రాడు. అతనితో మాట్లాడాలని నేను ఎన్నో రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి ఆ రోజు అతను నాకు హెల్ప్ చేస్తుంటే చాలా సంతోషం వేసింది. ఇద్దరం మాటలు కలిపాం. తన మాటలు నాకు ఎంతో నచ్చాయి. అలా ఆ రోజు సుశాంత్ నా మనస్సుకు మరింత దగ్గరయ్యాడు.

కిచెన్ లో రొమాన్స్ చేసుకునే వరకు

కిచెన్ లో రొమాన్స్ చేసుకునే వరకు

అది కార్తీక మాసం కావడంతో అక్క రోజూ ఏదో ఒక ఆలయానికి వెళ్లేది. దాంతో రోజూ నేనే లంచ్ బాక్స్ రెడీ చేసేదాన్ని. సుశాంత్ దాన్ని తీసుకెళ్లడానికి వచ్చేవాడు. కొన్నాళ్లకు మా పరిచయం ప్రేమగా మారింది. కిచెన్ లో రొమాన్స్ చేసుకునే వరకు వెళ్లింది మా లవ్. సాయంత్రంనన్ను కాలేజీ నుంచి పికప్ చేసుకోవడానికి కూడా సుశాంత్ వచ్చేవాడు.

ప్రేమలో మునిగితేలిపోయాం

ప్రేమలో మునిగితేలిపోయాం

ఇద్దరం ప్రేమలో మునిగితేలిపోయాం. ఈ మ్యాటర్ మొదట అక్క, బావలకు తెలిసింది. వాళ్లు మీ ఇద్దరికీ నచ్చితే పెళ్లి చేసుకోండని సలహా ఇచ్చారు. తర్వాత మా ఇంట్లో వాళ్లకు మా విషయం తెలిసింది. మా నాన్న నన్ను అక్కవాలింట్లో నుంచి హాస్టల్ కు షిప్ట్ చేశాడు. కొన్నాళ్ల పాటు సుశాంత్ ను అస్సలు కలవడకుండా చేశారు.

నన్ను పెళ్లి చేసుకోవడానికి భయపడ్డాడు

నన్ను పెళ్లి చేసుకోవడానికి భయపడ్డాడు

ఎంబీఏ సెకెండియర్ లో నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. తను చూసిన అబ్బాయితో నా పెళ్లి అని మా నాన్న తేల్చేశారు. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. సుశాంత్ ను బెదిరించడంతో అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి భయపడ్డాడు. ఒక రోజు సుశాంత్ కు ఫోన్ చేసి.. నిన్నే నమ్మి... నువ్వు ప్రాణంగా బతుకుతున్న నాకు అన్యాయం చేయొద్దు అని ఏడ్చాను.

బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు

బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు

మరుసటి రోజే సుశాంత్ హాస్టల్ వద్దకు వచ్చాడు. బ్యాగ్ సర్దుకో అన్నాడు. సర్దుకున్నాను. బైక్ పై ఎక్కించుకుని డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. అప్పటికే మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు అక్కడ చేశారు. కొందరు ఫ్రెండ్స్ సమక్షంలో మా పెళ్లి జరిగింది. మా నాన్న రచ్చరచ్చ చేశాడు. మా ఇద్దరినీ విడదీయడానికి ఏవేవో ప్లాన్స్ వేశాడు. అవేమీ ఫలించలేదు.

నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది

నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది

సుశాంత్ తో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న చూసిన అబ్బాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెను రోజూ టార్చర్ పెట్టడంతో ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. నేను మా నాన్న చూసిన సంబంధం చేసుకుని ఉండి ఉంటే ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో. ఈ టెక్నాలజీ యుగంలోనూ ఇప్పటికీ కులం అంటూ పాకులాడుతూ ఉండడం సరికాదని నా అభిప్రాయం.

English summary

My husband is a very loving and caring person

My husband is a very loving and caring person
Desktop Bottom Promotion