Latest Updates
-
Beer vs Whisky: బీర్ సేఫా? విస్కీ బెటరా? మందుబాబులు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
మంత్రాల చివర్లో వచ్చే.. స్వాహా, నమః వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే.. -
కామసూత్ర రహస్యాలు..శృంగారంలో మీ భాగస్వామికి స్వర్గసుఖాలు పరిచయం చేయండిలా! -
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్! -
మొటిమలు, చుండ్రుకు శాశ్వత పరిష్కారం: వన తులసితో మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం! -
వర్షాకాలం చలిలో వేడివేడిగా చికెన్ కీమా పరాఠా..అబ్బా ఆ రుచే వేరప్పా..చేసుకోండిలా.. -
జులై చివరి వారం.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే.! -
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా..
మాజీ ప్రియుడితో గడిపిన క్షణాలను బయటపెట్టడం సబబేనా?
తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకొని జీవితాంతం గడిపేయం అనేదానికి కాలం చెల్లింది. మహిళలకు స్వేచ్ఛ పెరగడంతో ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నారు. మరో వైపు మగవారు ఎప్పుడ
తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకొని జీవితాంతం గడిపేయం అనేదానికి కాలం చెల్లింది. మహిళలకు స్వేచ్ఛ పెరగడంతో ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నారు. మరో వైపు మగవారు ఎప్పుడూ డేటింగ్‌కు సై అనేస్తున్నారు.
దీనికి తోడు సహ-జీవన సంబంధాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సమాజం కూడా ఇప్పుడు దీన్ని పెద్ద తప్పుగా భావించడంలేదు. ఈ నేపథ్యంలో గతకాలపు జ్ఞాపకాలను రహస్యంగా దాచిపెట్టాలా లేక భాగస్వామికి బహిర్గతం చేయాలా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

సంబంధంలో కొనసాగే జంటలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమన్నది వారి మధ్య మరింత దగ్గరితనాన్ని తీసుకువస్తుంది. ఐతే అన్ని బంధాలు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎల్లకాలం నిలవలేవు. ఏదో ఒక కారణంతో బ్రేకప్ చెప్పే జంటలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి.
కొత్త సంబంధాన్ని వెతుక్కున్నప్పుడు పాతవి చేదు జ్ఞాపకంలా మదిలో నిలిచిపోతాయి. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే కొత్త భాగస్వామితో పాత వారి గురించి చర్చించడం అవసరమా లేదా అన్నదే పాయింటు. అందుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. మాజీకి గౌరవం
కారణమేదైనా బంధాన్ని తెంచుకుంటే ఆ వ్యక్తిని అప్పుడు ప్రేమించారన్నది వాస్తవం. ఈ ఒక్క కారణం చాలు వారి పట్ల గౌరవభావం ఉండడానికి. మీ మధ్య ఉన్న రహస్యాలకు కనీస మర్యాద ఇవ్వాలి. అది చాలు కలకాలం ఉంచుకోవడానికి.

2. ప్రైవసీ ముఖ్యం
ఇద్దరు వ్యక్తులు కలిసున్నంత మాత్రాన వారి వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరించలేం కదా. కొన్ని విషయాలు వ్యక్తిగతమై ఉంటాయి. వాటిని అలాగే ఉంచడం మేలు. మీ భాగస్వామి మీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనే రూల్ ఏమీ లేదు. మీ గత కాలపు చరిత్ర ఇందులో ఒకటి.

3. అది వారిని గాయపర్చవచ్చు
మీ దగ్గరున్న రహస్యాలు మీ భాగస్వామికి తెలిస్తే బాధపడే అవకాశముంది. సాధ్యమైనంత మేరకు చెప్పకపోవడమే మంచిది. గాయపర్చేవైతే అస్సలు వద్దు. కొన్ని విషయాలు చర్చించకపోవడమే మంచిది.

4. చిన్నగా చేసి మాట్లాడే అవకాశం
మీ మాజీ గురించి చిన్నగా చేసి మాట్లాడటం మీకు బాధ కలిగించొచ్చు. గతంలో మాజీ వల్ల మీరు బలైన సందర్భాలుంటే అదే అవకాశంగా ప్రస్తుత మీ భాగస్వామి మిమ్మల్ని కించపరిచి మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి బాధలన్నీ లేకుండా సాధ్యమైనంత వరకు మాజీ గురించి చర్చించకపోవడమే మంచిది.

5. నమ్మకం పోవచ్చు
ఏ సంబంధమైనా నమ్మకంపైనే నడుస్తుంది. మీ భాగస్వామి మీరేదో రహస్యాలను దాచిపెడుతున్నారని భావిస్తే వాళ్లకి అది నచ్చదు. నమ్మకం అనే పునాదిరాయిని మీ భాగస్వామి ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో మీ ప్రస్తుత సంబంధం చెడిపోయే అవకాశాలు ఎక్కువ.

6. తరచూ తప్పులు
మీ మాజీ వల్ల ఎలా వేదనకు గురయ్యారో ప్రస్తుత మీ భాగస్వామికి చెబితే అలాంటి తప్పులు మీ దగ్గర జాగ్రత్తపడకుండా చూసుకుంటారు. ఇది బంధం బలపడటానికి కారణమవ్వగలదు.

7. పూర్తిగా తనకు చెందుతారని చెప్పడం
ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో కొనసాగుతుంటే వాళ్ల దగ్గర దాచాల్సింది ఏమీ ఉండదు. అందుకే మీ గతం గురించి మొత్తం చెప్పడం మంచిది. మీ సీక్రెట్స్ అన్నీ మీ ప్రస్తుత భాగస్వామితో పంచుకుంటే మనసు హాయిగా ఉంటుంది.

8. ఎవ్వరూ పర్‌ఫెక్ట్ కాదు
మీ ప్రస్తుత పార్టనర్‌తో మీరు గతంలో తప్పులు చేశారన్న విషయం చెప్పడంలో పెద్ద నేరమేమీ కాదు. దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పాత సంబంధాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి.
మీ రహస్యాలు తెలియడం వల్ల పెద్దగా నష్టమేమీ లేదు. అదీ ఒకందుకు మంచిదే.



Click it and Unblock the Notifications