For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గడిచిన చేదు జ్ఞాపకాలను మరిచి మరొక సంబంధానికి సిద్దంగా ఉన్నారు అనడానికి సంకేతాలు

|

పసిబిడ్డకి జన్మనిచ్చినప్పుడు, ఆ శిశువు బాగోగులు చూసుకోవడానికి సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఆ శిశువు మొదటి అడుగులకు ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. అదేవిధంగా మొదటి అత్త, అమ్మ,మామ వంటి మాటలు వచ్చు క్షణాలు, మొదటిసారి తనచేతులతో తాను ఆహారం స్వీకరించే క్షణాలు అదేవిధంగా తనకు తాను స్నానం చేసే సమయం ఇలా ప్రతి ఒక్క దానికి ఒక నిర్దిష్టమైన కాలపరిమితి, వయసు ఉంటుంది.

జీవితంలో అడుగులు ముందుకు పడేకొలదీ, పాలపళ్ళు శాశ్వత దంతాలుగా మారడం, గడ్డం, మీసం రావడం, కోపతాపాలు, మానసిక సంఘర్షణలు, ఆలోచనా శక్తి పెరుగుదల ఇలాంటి వాటిపై హార్మోన్ల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించే, ఆ వ్యక్తి ఒక నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తాడు.

Signs that you are ready for a relationship

ఇవన్నీ ఒక కోణం కాగా, జీవితంలో అన్నీ ఒకేలా సమయానికి చేతికి అందేవిగా ఉండవు. అలాంటివే సంబంధాలు . ఈ సంబంధాలు మానసిక ఎదుగుదలపై, హార్మోన్ల ప్రభావాలపై అదేవిధంగా మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు. సంబంధాలు ఏర్పడడానికి, దూరం చేసుకోవడానికి ఒక నిర్దిష్టమైన కాలం అంటూ ఉండదు.

అదేవిధంగా ఒక చెడు సాన్నిహిత్యం నుండి బయటకి వచ్చినప్పుడు, మరొకరి సాన్నిహిత్యం కోరుకోవడానికి కూడా ఒక నిర్దిష్టమైన కాలపరిమితి అంటూ లేదు. ఇలాంటివి పూర్తిగా వ్యక్తిగతమై ఉంటాయి మరియు అతను లేదా ఆమె మానసిక పరివర్తన, అవతలి వ్యక్తిని అర్ధం చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది.

కాని ఆలోచన లేని సాన్నిహిత్యాలు పొందడం పిల్లలాట కాదు. ముఖ్యంగా కొద్దిమందిలో ఈ భావోద్వేగ నియంత్రణ అనేది తక్కువగా ఉన్న కారణాన, సరైన అవగాహన లేకుండా సాన్నిహిత్యాలు కొనసాగిస్తూ, చివరికి తమకు తామే తెలియని అగాధంలో కూరుకొనిపోయి దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వారికి స్వీయ ఆత్మగౌరవం పెంచుకోడానికి , మరియు తాము సాన్నిహిత్యాన్ని పొందవచ్చునా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలను ఇక్కడ పొందుపరచబడ్డాయి.

ఈ ఆర్టికల్ మీ భాగస్వామితో ఒక బలమైన సంబంధం చూపడంకోసం మార్గాన్ని సుగమం చేస్తుంది.

1.మీ ఆలోచనలతో ఎకీభవించబడే మనసు ఎదురైతే ....

1.మీ ఆలోచనలతో ఎకీభవించబడే మనసు ఎదురైతే ....

ఒకవేళ మీరు సాన్నిహిత్యం కోరుకునే వారు ప్రేమ గుడ్డిది, ప్రేమ అనేది ఎటువంటి నియమ నిబంధనలకు లోబడి ఉండడం సరికాదు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటే, ఈ ఆలోచన కొందరి విషయాల్లో నిజం అయ్యే అవకాశo లేకపోలేదు. కాని ఎక్కువ శాతం, భాగస్వాములు ఇద్దరు కూడా కాలం పెట్టే పరీక్షలను ఆర్ధికంగా సామాజికంగా ఎదుర్కుంటూ వచ్చిన వారు కావడం చేత ఒకే రకమైన అభిప్రాయాలను కూడా కలిగి ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు. బహుశా వీరు మీకు మంచి భాగస్వామి అయ్యే అవకాశం ఉంది.

2.మీరు మళ్ళీ ఒక ఫెయిల్యూర్ గా మిగలవద్దు

2.మీరు మళ్ళీ ఒక ఫెయిల్యూర్ గా మిగలవద్దు

ఒక్కోసారి మీ పాత జ్ఞాపకాల నుండి బయటకు రాలేక, వారినే గుర్తు చేసుకుంటూ లేక మోసపోయినందుకు మీలో మీరే పశ్చాత్తాపాన్ని ఎదుర్కొంటూ మానసిక కలవరానికి లోనై సామాజిక పరిస్థితులపై కోపాన్ని పెంచుకున్నటువంటి వారైతే మీరు మరొక సంబంధానికి సిద్దంగా లేరు అనే అర్ధం. కాని నిజమైన ప్రేమ అనేది కూడా భూమి మీద ఉంది అని భావించిన రోజున, మీకు మీరుగా సంబంధాన్ని మానసికంగా ఆహ్వానిoచగలుగుతారు. అనేక మంది ప్రేమికులు ఇలాంటి డిప్రెషన్ స్థాయిలను ఎదుర్కొనలేక పిరికితనంతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా తనకై ఉన్న వారిని గుర్తించక దూరం చేసుకోవడం తప్ప, చివరికి ఇంకేదీ సాధించలేరు అన్నది మాత్రం సత్యం. ఆ చెదలు పట్టిన భూతకాలాన్ని వదిలివేసిన రోజే భవిష్యత్తు అందంగా కనిపిస్తుంది.

3.మీరు వారికోసం ఎదురుచూడడం లేదు

3.మీరు వారికోసం ఎదురుచూడడం లేదు

ఇప్పుడు వెతుకులాట అనేది అనేక రూపాలని సంతరించుకుని ఉంది. చివరికి తమ స్నేహితులని ఒక వ్యక్తితో సంబంధానికి సహాయం చెయ్యమని అడగడం దగ్గర నుండి, డేటింగ్ అప్లికేషన్స్ లో ప్రోఫైల్స్ పెట్టి తెలియని వారితో సాన్నిహిత్యం చేసేలా పరుగులు తీయడం వరకు ఇలాంటివి కన్పిస్తున్నాయి. ఇలాంటివి వందల్లో ఒకటో రెండో సక్సెస్ అయితే, ఎక్కువ శాతం చెడు పరిణామాలకే దారితీస్తాయి. ప్రేమ అనేది అర్ధం చేసుకునే మనసుని బట్టి ఉంటుంది. ప్రేమని వేగవంతం చేసే ప్రక్రియ నిజ జీవిత లో ఏదీ లేదు. ఒక పరిపక్వత కలిగిన మనిషి సైతం భాగస్వామిని అంచనా వేయుటకు చాలా సమయం తీసుకోవలసి ఉంటుంది.

మీకు నిజంగా ఆ పరిపక్వత వచ్చిన రోజు సంబంధానికి సిద్దంగా ఉన్నారు అని అర్ధం. అంతేకాని డేటింగ్ యాప్స్ ని, స్నేహితులని వాడుకోవడం అనే ప్రక్రియ, పరిపక్వత అనే పదాన్నే మీ జీవిత డిక్షనరీనుండి తొలగిస్తుంది.

4.మీ అనుభూతి మీ సమాధానం అవ్వాలి

4.మీ అనుభూతి మీ సమాధానం అవ్వాలి

మీ భాగస్వామి విషయంలో అన్నిటా సమర్ధులై ఉన్నారు అని నిర్ధారించుకోవడం మొదట చేయవలసిన విధి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి నిజమైన ప్రేమ అనేది మానసికంగా ఒకరినొకరు అర్ధం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా భాగస్వామి పట్ల ఉండలేని పక్షంలో ఆ సంబంధం మంచిది కానే కాదు. నిన్ను నువ్వు ఏరోజైతే ప్రేమిస్తావో, ఆరోజే నువ్వు నీ వారిని కూడా ప్రేమించగలుగుతావు. కావున మీతో మీరు ప్రేమలో పడేంతవరకు వేరే ప్రేమని ఆలోచించవద్దు. అది ఇద్దరికీ మంచిది కాదు.

5.మొట్టమొదట మీరు ధైర్యస్తులై ఉన్నారో లేదో నిర్ధారణకు రండి

5.మొట్టమొదట మీరు ధైర్యస్తులై ఉన్నారో లేదో నిర్ధారణకు రండి

మనుషులందరూ ఎవరికి వారు, వారికి తగ్గ రీతిలో అభద్రతా భావాలు కలిగి ఉంటారు అనడం అంగీకరించాల్సిన నిజం. ఇది ఒక్కోసారి మంచే చేస్తుంది, భావోద్వేగ నియంత్రణలో మీకు సహాయం చేస్తుంది. కాని అభద్రతా పెరిగే కొలదీ మీరు అనుకున్న పనిని చెయ్యలేని స్థితికి వస్తారు. కావున ముందు నిర్భయంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఏ విషయానికైతే ఎక్కువ ఆలోచిస్తారో, దానికి సమాధానాలు చూడండి. చివరగా మీరు నిర్భయాన్ని సాధించిన రోజున మీరు సంబంధానికి సిద్దంగా ఉండగలరని అర్ధం. మీరు సంబంధం కోసం భావోద్వేగ నియంత్రణ లేకుండా, అభద్రతా భావంతో ప్రయత్నిస్తే ఒక్కోసారి అవి చెడు ఫలితాలని ఇచ్చే అవకాశo కూడా ఉంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, మీరు ఈ అభద్రతా భావాన్ని వదలకుండా సంబంధాన్ని కొనసాగించినా, ఆ ప్రభావం త్వరలోనే మీ మద్య గొడవలకి తావిస్తుంది అనడం వాస్తవం.

6.మీ మనసు, మానసిక ఆందోళనలతో నిండి లేదు అని నిర్ధారణకు రండి

6.మీ మనసు, మానసిక ఆందోళనలతో నిండి లేదు అని నిర్ధారణకు రండి

మనసుని ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించలేము అనేది జగమెరిగిన సత్యం. కొన్ని జ్ఞాపకాలు ఎన్నటికీ మరుపుకు రావు, దీనికి ఎప్పటికైనా కాలమే సమాధానం చూపుతుంది. అయితే మీ గత సంబంధ జ్ఞాపకాలు మీ ప్రస్తుత సంబంధాలను దెబ్బతీయవు అని నిర్ధారణకు రావలసి ఉంటుంది. మీరు రోజులో అత్యధికభాగం ఆ చేదు జ్ఞాపకాలతో గడుపుతూ ఉంటే, అది మీ వాస్తవిక సంబంధాలను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు. కావున ఒక సంబంధాన్ని మెరుగుపరచుకోవాలి అని భావిస్తున్నవారైతే ఆ చేదు జ్ఞాపకాలను మరుగున పడవేసేవిధంగా మీ ఆలోచనలు తయారవ్వాలి. అప్పుడే మీరు మీ భాగస్వామితో సంతోషమైన సంబంధాన్ని కొనసాగించగలరు. ఆ ఆలోచనలతోనే బ్రతకాలి అనుకోవడం ఎప్పటికీ సరైనది కాదు.

7.మీ ఆలోచనలను ఎక్కడ ప్రారంభించాలో మీకే తెలుసు

7.మీ ఆలోచనలను ఎక్కడ ప్రారంభించాలో మీకే తెలుసు

మీ ఆలోచనలలో మార్పును తీసుకురావడంలో మీకు మీరు సహాయం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు గుర్తించిన రోజు మీ మానసిక ఎదుగుదల ప్రారంభంఅవుతుంది. మీకు ఇష్టమైన ఆహారం తీసుకోవడం, నచ్చిన వ్యక్తులతో సమయాన్ని వెచ్చించడం, ఇష్టమైన సినిమాలకి వెళ్ళడం , సంగీతాన్ని వినడం , పుస్తక పఠనం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడం , ప్రకృతిని ఆస్వాదించడం వంటి చర్యల ద్వారా మీ మనసులో చేదు జ్ఞాపకాలను నెమ్మదిగా తగ్గించి మానసిక సంతోషo పెంచుకోగలుగుతారు. ఈ విధంగా మానసిక సంతోషాన్ని కలిగిన వారే సంబంధాలను సైతం మెరుగుపరచుకొనగలరు. మీరే సంతోషంగా లేని పక్షంలో మీకోసం ఎవరూ ఏమీ చేయలేరు.

8.మీ పెదాలకి కూడా నవ్వు ఉంది అని మీరు గుర్తించాలి

8.మీ పెదాలకి కూడా నవ్వు ఉంది అని మీరు గుర్తించాలి

పెదాలపై నవ్వు అనేది మొట్టమొదటగా కలిగి ఉండవలసిన లక్షణం, ఇది సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీ నవ్వు ద్వారా మీ యందు సానుకూల దృక్పధం పెరిగి ప్రజలు ఆకర్షణకు లోనయి మీవద్దకు చేరే అవకాశం ఉంది. మీరు ఈ సానుకూల దృక్పధాన్ని ఇవ్వడం ద్వారా మీరు భాగస్వామితో సంబంధాన్ని సంతోషంగా కొనసాగించుటకు సిద్దంగా ఉన్నారు అనేది వారికి తెలియబరుస్తుంది. మీ నవ్వు వారికి ఒక హామీ వంటిది.

English summary

Signs that you are ready for a relationship

There are certain signs that show you are ready for relationship. If you feel fearless, if you find yourself smiling a lot, etc., can be signs that you are ready for a relationship.
Story first published:Monday, March 12, 2018, 18:11 [IST]
Desktop Bottom Promotion