For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ ప్రేయసి, వేరొక వ్యక్తి మోజులో పడిందనడానికి ఇవే సంకేతాలు

  |

  ప్రేమనేది ఉద్వేగభరితమైన అద్భుత భావన, అత్యధిక మంది ప్రేమికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే - మోసపోవడం. ప్రేమ అనేది మానవుని ఆత్మలో అంతర్లీనమై ఉంటుంది. అందుకే "మాటలకన్నా - చేతలే ఎక్కువగా మాట్లాడతాయన్న" నిజానికి అసలైన అర్థమేమంటే, ప్రేమలో పడటం కన్నా - ప్రేమలో ఎక్కువ కాలం ఉండటమనేది చాలా గొప్ప విషయం !

  అమ్మాయిలు అబ్బాయిల కన్నా చాలా ఎక్కువగా నటిస్తూంటారు, అబ్బాయి మోసం చేస్తున్నాడా ? లేదా ? అని చాలా ఈజీగా కనిపెట్టవచ్చు కానీ, ఒక అమ్మాయి మోసం చేస్తుందా ? లేదా ? అనేది అంత త్వరగా కనిపెట్టలేము. అమ్మాయిలు ఎలాంటి విషయాన్నైనా దాచి, చాలా తెలివిగా మోసం చేయగలరు.

  signs you are not the only guy shes talking to

  ప్రేమ విషయంలో అబ్బాయిలు అమ్మాయిల్లగా చాలా సింపుల్గా ఉండలేరు, ముఖ్యంగా అబ్బాయిలు కాల్స్ చేసినప్పుడు అమ్మాయిలు ఫోన్ తీయకపోయినా (లేదా) కొన్ని రోజులుగా కనపడకపోయినా అబ్బాయిలు డౌటు పడుతూనే ఉంటారు. ఒక అమ్మాయిని అనుమానించాలంటే దానికి చాలా విశ్లేషణ అవసరమవుతుంది. కానీ తన ప్రేయసి తనని మోసం చేస్తుందా ? లేదా ? అని ఒక అబ్బాయి ఎలా తెలుసుకోవడం ?

  మీ ప్రేయసి, వేరొక వ్యక్తిని కోరుకుంటున్నట్లుగా తెలియజేసే సంకేతాలను ఇప్పుడు చూద్దాం !

  1. ఇద్దరి మధ్య సఖ్యత లోపించటం :-

  1. ఇద్దరి మధ్య సఖ్యత లోపించటం :-

  మీ ప్రేయసి రోజు మొత్తంలో తను చేసిన పనుల గురించి గానీ, పనులతో ఆ రోజు ఎలా ముగిసిందో అని గానీ, గత కొన్ని రోజులుగా ఆమె చేస్తూన్న పనులు వంటి విషయాల గూర్చి మీతో పంచుకోవడం (షేర్ చేసుకోవడం) మానేస్తే గనక, ఆమె మీ బంధం నుంచి విడిపించుకొని బయటపడాలనేందుకు అవన్నీ స్పష్టమైన సంకేతాలుగా చెప్పవచ్చు.

  అమ్మాయి దృష్టిలో ఇప్పటివరకు మీకున్న ప్రత్యేక స్థానంలో, వేరొక వ్యక్తి వచ్చే అవకాశం ఉండవచ్చు. అలా ఆ వ్యక్తితోనే ఆమె తన భావాలను పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు కూడా. ఆమె మీ ఎమోషన్స్ గురించి మిమ్మల్ని అడగడానికి ఇబ్బంది పడకపోతే, ఆమె అదేవిధంగా మరొక వ్యక్తిని అడిగే అవకాశాలకు అది ఒక సానుకూల సంకేతంగా చెప్పవచ్చు.

  2. పాస్వర్డ్లు మార్చడం :-

  2. పాస్వర్డ్లు మార్చడం :-

  ఇది వినడానికి చాలా చిన్న విషయంగా ఉంటుంది కానీ, ఆమె మీకు తెలిసిన ఫోన్ పాస్వర్డ్లను & ఇతర పాస్వర్డ్లను మార్చినట్లయితే, మీ పట్ల ఆమె తన వైఖరిని మార్చుకుంటుందని తెలియచెప్పే ఒక స్పష్టమైన సంకేతం కావచ్చు. ఆమె అలా ఎందుకు చేసిందో మీకు సరైన కారణాన్ని గాని వివరించకపోతే, ఆమె వేరొక వ్యక్తి గురించి మీ దగ్గర విషయాన్ని దాస్తుందని తెలియజేసే సంకేతమని చెప్పవచ్చు. అంతకుమించి పాస్వర్డ్ మార్చడానికి మరొక కారణం వుండదు కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి.

  3. సామాజిక అంశాలలో ఆక్టివ్గా లేకపోవటం :-

  3. సామాజిక అంశాలలో ఆక్టివ్గా లేకపోవటం :-

  సామాజిక మాధ్యమాలలో మీ ప్రేయసి పోస్ట్ చేసే మెమోస్లో & పోస్ట్లలో & తన ఫోటోలకు క్రమం తప్పకుండా మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ, సడెన్గా మిమ్మల్ని ట్యాగ్ చేయటం మానివేస్తే గనక, ఆమె వేరొక వ్యక్తి వైపు చూసే అవకాశం ఉండవచ్చు.

  అలా ఆమె మరొక వ్యక్తిని ఆకట్టుకోవాలంటే, మీకు బ్రేకప్ చెప్పేలా ఆమె ప్రవర్తన ఉంటుంది. ఈ కారణంచేతనే, సామాజిక మాధ్యమాలలో ఆమె మీతో కనిపించకుండా పోతుంది. అందుకు గల కారణం ఆమె కుటుంబము (లేదా) వేరొక కారణమేదైన అయ్యుండొచ్చు, కానీ ఇది కూడా ఒక స్పష్టమైన సంకేతమని మీరు భావించాలి. కాబట్టి ఇలా జరగడానికి బాగా ఆలస్యం కాకముందే, సామాజిక అంశాలలో ఆమె మీతో ఎందుకు ఆక్టివ్గా ఉండటంలేదో అనే విషయం గూర్చి మీరు ఆమెను ప్రశ్నించండి.

  4. వీకెండ్ ప్లాన్స్ను మార్చడం:

  4. వీకెండ్ ప్లాన్స్ను మార్చడం:

  మీ ప్రేయసి వీకెండ్ ప్లాన్స్ను మీతో కాకుండా, ఆమె స్నేహితులతో (లేదా) కొత్త వ్యక్తితో గనుక ప్లాన్ చేసి వెళ్లిపోతుంటే, మీ కోర్టులో మరొక ఆటగాడు గోల్ చేసే అవకాశం ఉందని అర్ధం.

  మీ ప్రేయసి, మీతో వారాంతాన్ని గడపకుండా మీకు అబద్ధాలను చెబుతూ, ఆమె మరొకరితో కలిసి బయటకు వెళుతుందంటే - ఆమె మరొక వ్యక్తికి దగ్గర అయ్యే అవకాశాలన్నాయని మీకు తెలియజేసే చాలా బలమైన సూచన. ఒకవేళ ఆమె మీకు నిజం చెప్పి వేరొకరితో బయటకు వెళ్తే అది సరైనదే కావచ్చు, కానీ అబద్ధం చెప్పి (లేదా) మీ కళ్లుగప్పి వేరొకరితో ఆమె ఎక్కువ సమయాన్ని కేటాయించినప్పుడు అది చాలా తీవ్రమైన విషయంగా మీరు భావించాలి.

  5. పోలికలు :-

  5. పోలికలు :-

  మీ ప్రేయసి నిన్నటి వరకూ మీరు గురించి ప్రతీ విషయాన్ని ఇష్టపడేవారిగా ఉంటూ, సడెన్గా మీలో కొన్ని విషయాల గురించి ప్రతికూల భావజాలాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టి, మిమ్మల్ని ఎవరో తెలియని వేరొక వ్యక్తితో పోల్చడం మొదలైనప్పుడు, ఈ విషయాన్ని మీరు నిజంగా తీవ్రంగా తీసుకోవాలి అని తెలియజేసే చాలా బలమైన సంకేతము.

  అలా మీ కన్నా భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి వైపుగా, మీ ప్రేయసి ఆకర్షితురాలు కాకముందే మీరు సరైన ప్రణాళికతో దూసుకుపోతూ - మీ ప్రత్యర్థి ఎవరో తెలుసుకోండి.

  6. మీతో హ్యాపీగా లేకపోవటం :-

  6. మీతో హ్యాపీగా లేకపోవటం :-

  మీ ప్రేయసి మీతో తరచుగా హ్యాపీగా & సన్నిహితంగా మెల్లగకపోతే, ఆమెను అనుమానించాల్సిందేదో ఉందని అర్థం. ఆమె వేరొక వ్యక్తితో ఆకర్షితురాలయినప్పుడు, మీరు ఆమెను స్పర్శించినా & సన్నిహితంగా మెలిగిన, ఆమె మీపట్ల చికాకును ప్రదర్శిస్తుంది.

  అందుకు కారణం, ఆమె వేరొకరితో సన్నిహితంగా మెలగడానికి ఇష్టపడింది. ఆమె మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకొనకపోతే, ఆమె ఇంకెవరినో కౌగిలించుకోగల అవకాశాలను కలిగి ఉన్నాదని అర్ధం.

  7. ఎల్లప్పుడూ అబద్ధాలను చెబుతూ ఉంటే :-

  7. ఎల్లప్పుడూ అబద్ధాలను చెబుతూ ఉంటే :-

  మీ ప్రేయసి, మరొకరిని చూస్తుందని మేము మీకు కచ్చితంగా చెప్పే ఒక ప్రధానమైన సంకేతం ఇది. మీకు ఎవరో తెలియని స్నేహితుడితో ఆమె ఆకస్మికంగా ప్రయాణాలు చేయటం, తన ఫోన్ కాల్స్ గురించి అబద్దాలు చెప్పటం, తన ఫోటో గ్యాలరీని దాచడం, మెసేజ్లను లాక్ చేయడం, మిమ్మల్ని కలవకుండా ఉండటం కోసం సాకులు చెప్పడం, మీకు తగినంత సమయాన్ని కేటాయించకపోవడం, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆమె మీతో ఎందుకు సన్నిహితంగా మెలగటం లేదో అన్న విషయాన్ని గురించి మీరు ఆమె స్నేహితుల ద్వారా తెలుసుకోవచ్చు. అలా మీ మధ్య వచ్చిన మూడో వ్యక్తి గూర్చి మీరు తెలుసుకోవచ్చు.

  8. మిమ్మల్ని మోసం చేస్తున్నట్లయితే

  8. మిమ్మల్ని మోసం చేస్తున్నట్లయితే

  ఇప్పటివరకు మనము చర్చించిన విషయాలలో కొన్ని యాదృచ్ఛికమైనవి కావచ్చు. అలా అని మీరు వాటిని ఎల్లప్పుడూ పట్టించుకోకుండా ఉండటమనేది సరైనది కాదు.

  మీ ప్రేమ బంధంలో, మీ ప్రేయసి మిమ్మల్ని మోసం చేస్తున్నట్లుగా గానీ మీరు గుర్తించినట్లయితే, దానికి సంబంధించిన మరిన్ని సాక్ష్యాలను మీరు సేకరించి ఉంచుకోవటం వల్ల, మీరు ఆమెను గట్టిగా ప్రశ్నించ గల అవకాశాలను కలిగి ఉంటారు. అలా కాకుండా, మీకు మీరే ఒక కొత్త కథను అల్లి ఆమెను నిందిస్తూ ఉండటం కన్నా, మీ కళ్ళముందు మెదులుతున్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించి - తగిన సాక్ష్యాలను, సమాచారాలను సేకరించిన తరువాత ఆపై మీ వాదనను వినిపించండి.

  English summary

  Signs That Your Woman Is Seeing Another Man

  Women are more impulsive than men and it is very easy to find out if a man is cheating or not but very difficult to find out if a woman is cheating or not. Women are really smart in hiding things and can cheat also with grace.
  Story first published: Wednesday, June 6, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more