ప‌డుకునే విధానాన్ని బ‌ట్టి శృంగార జీవితం ఇలా...

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

మీకు తెలుసా? మీరు ప‌డుకునే విధానాన్ని బ‌ట్టి మీ భాగ‌స్వామితో మీకున్న అనుబంధం గురించి చాలా విష‌యాలు తెలుస్తాయి. మ్యాట్రెస్ అడ్వ‌యిజ‌ర్ అనే ఒక ఆన్‌లైన్ సంస్థ ప‌రుపుల నాణ్య‌తపై స‌ర్వేలు చేస్తుంటుంది. ఒక సారి వాళ్లు ప్ర‌జ‌ల నిద్రించే అల‌వాట్ల‌పైన ఒక స‌ర్వే చేసింది. ఇందులో దాదాపు 1000 మంది పాలుపంచుకున్నారు.

అంద‌రూ 18 నుంచి 73ఏళ్ల మ‌ధ్య‌లోనివారే. వారి నిద్ర అల‌వాట్లు మొత్తంగా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చినా ఒక అంశం మాత్రం చాలా ఆశ్చ‌ర్యం క‌లిగించింది. భాగ‌స్వామితో సెక్స్‌లో సంతృప్తి క‌లిగించేందుకు ఏ భంగిమ‌లో నిద్రిస్తే ఎక్కువ‌గా ఉప‌యోగ‌డ‌ప‌డుతుంద‌నే విష‌యంపైన స‌ర్వే జ‌రిగింది. ఆ విశేషాలేమిటో చూద్దాం...

What your sleeping positions reveal about your sex life

1. ఎదురెదురుగా...

ఎదురెదురుగా మొహాల‌ను చూస్తూ ప‌డుకునేవారు సెక్స్‌లో అద్భుతమైన అనుభ‌వాన్ని పొందుతున్నార‌ట‌. ఒక‌రిపై మ‌రొక‌రు కాళ్లు వేసి ప‌డుకోవ‌డం వ‌ల్ల మ‌రింత శృంగార అనుభ‌వాన్ని పొంద‌గ‌లుగుతున్నారట‌. దీనికి మొద‌టి ర్యాంకు రావ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌దు ఎందుకంటే భాగ‌స్వామి క‌ళ్ల‌లోకి చూస్తూ చేయ‌డం మ‌రింత మ‌జానిస్తుంద‌ట‌.

What your sleeping positions reveal about your sex life

2. వెన‌క‌వైపు హ‌త్తుకొని...

వెన‌క వైపు హ‌త్తుకొని ప‌డుకోవ‌డం వ‌ల్ల శృంగార భావ‌న‌లు పెరుగుతాయ‌ట‌. ఇలా ప‌డుకోవ‌డం వ‌ల్ల ఒక‌రితో మ‌రొక‌రికి క‌లిసేందుకు చాలా సులువ‌వుతుంది అని చెప్పారు.

What your sleeping positions reveal about your sex life

3. గుండెల‌కు హ‌త్తుకొని...

ఈ నిద్రించే భంగిమ‌లో మ‌గ‌వాడి ఛాతీపై ఆడ‌వారు త‌ల ఉంచుతారు. మ‌గ‌వాడు త‌న చేతుల‌ను అమ్మాయి మెడ‌పై ఉంచుతాడు. ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ ఫీలింగ్ క‌లుగుతుంది. ప్రియుడి గుండెచ‌ప్పుడు ప్రియురాలు స్ప‌ష్టంగా విన‌గ‌లుగుతుంది. ఇలాంటి భంగిమ‌లో ప‌డుకునేవారు చాలా రొమాంటిక్ ప్రేమ‌లో మునిగితేలుతార‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.

What your sleeping positions reveal about your sex life

4. వేలాడుకున్న‌ట్టు..

ఎప్పుడైనా మీ భాగ‌స్వామితో వేలాడుకున్న‌ట్టు ప‌డుకున్నారా? చాలా మంది క‌నీసం ఒక్క‌సారైనా ఇలా ట్రై చేసి ఉంటారు. ఇది చాలా క్యూట్‌గా అనిపిస్తుంద‌ట‌. దీనికి 3.5 రేటింగ్ ఇచ్చారు. సెక్స్ కు ఇది చాలా అనుకూల‌మైన భంగిమ అని చాలా మంది స‌ర్వేలో పాల్గొన్న‌వారు అన్నారు. ఇది అంత‌గా రొమాంటిక్ విధానం కాక‌పోయినా కొత్త‌గా ట్రై చేయాల‌నుకుంటే ప్ర‌య‌త్నించొచ్చు అంటున్నారు నిపుణులు.

English summary

What your sleeping positions reveal about your sex life

Did you know your sleeping position can reveal a lot about your relationship with your partner? Interestingly, Mattress Advisor, an online group that reviews mattresses, carried out a survey related to people’s sleeping habits and their relationship
Story first published: Thursday, February 22, 2018, 15:35 [IST]