For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల మానసిక ప్రవర్తన అసహజ మార్పులకు గల కారణాలు ఏమిటి?

|

స్పష్టమైన కారణం అనేది ఏదీ లేకుండానే మీ భాగస్వామి ప్రవర్తనలో వస్తున్న మార్పు గురించి చింతిస్తున్నారా? మీరు ప్రేమలో పడిన వ్యక్తికి ఏమి జరిగిందో అని ఆలోచిస్తున్నారా? సహజ విధానంలోని అతని ప్రస్ఫుటమైన మార్పు మీకు చాలా బాధగా అనిపిస్తూ ఉందా? మార్పు వెనుక కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈవ్యాసం మీ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలదు.

ఒక్కోసారి పురుషులు తీవ్రమైన భాధకు గురై, మానసికంగా క్రుంగినట్లు కనిపిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి అర్ధంకాక మహిళలు నరకవేదన అనుభవిస్తూ ఉంటారు. పరిసరాల అసహజ మార్పులు, సన్నిహిత సంబంధాలు, స్నేహితులు, బంధువులు, ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితుల ప్రతికూల ప్ర్రభావాలు అనేకం ఇటువంటి పరిస్థితులకు కారణభూతమవుతూ ఉంటాయి. ప్రేమ, పెళ్లి, కోరికలు మొదలైనవి అనేకం నిఘూడ గుప్తంగా కూడా ఉంటాయి. తద్వారా మానసిక క్రుంగుబాటు, ప్రవర్తనలో మార్పు, కోపం, అసహజ ప్రవర్తన మొదలైనవి అనేకo కనిపిస్తూ ఉంటాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఎడల పరిష్కారం సులువుగా లభిస్తుంది కూడా.

ఎందుకు పురుషులలో ఈ మార్పు:

పురుషులు రాత్రికిరాత్రే మారిపోయే లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. దీనికి పైన చెప్పిన అనేక కారణాలు ప్రధానం కావొచ్చు. ఈ కారణాలను ఇతరులు అర్థం చేసుకోవడం అనేది అంత సులువైన వ్యవహారం కాదు. కానీ వివరాలు తెలుసుకున్న ఎడల, అర్థం చేసుకుని పరిష్కార మార్గాల వైపు దృష్టి సారించవచ్చు.

ఇక్కడ జీవిత భాగస్వామి తెలుసుకోవాలి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి .

1. భావోద్వేగం

1. భావోద్వేగం

మహిళలు ఎప్పుడూ భావోద్వేగాలకు ప్రదాన కేంద్రంగా ఉంటారు అని అంటారు. అదేపనిగా వారిపైన ఈ భావాలను రుద్దడం వలనో, లేక నిజంగానో తెలీదు కానీ కొన్ని పరిస్థితులు కాలానుగుణoగా, నాటకీయంగా ఊహకు అందనంతగా మారడం వలన వీరు భావోద్వేగాలకు గురవడం జరుగుతూ ఉంటుంది. కానీ పురుషులు కూడా భావోద్వేగాలకు గురవుతుంటారని మరువవద్దు. భాద కలిగితే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. కానీ పురుషుల విషయంలో ఈ భావోద్వేగాలు ఒక్కోసారి ప్రమాదకర పరిస్థితులకు కూడా దారితీస్తుంటాయి. ఈ పరిస్థితులు వయసుని బట్టి కూడా మారుతుంటాయి.

ఎమోషన్ అనేది అనేక మార్గాల్లో, మరియు ఏ సమయంలోనైనా ఒక వ్యక్తిని పూర్తిగా మార్చేయగలదు. ఈ మార్పులు ఆలోచనా స్థాయిలు, మారుతున్న పరిస్తితుల ఆధారంగా ప్రభావితం చేస్తాయి. ఒక మానసిక కల్లోలానికి కారణం అవుతుంది.

2. ఒంటరితనం

2. ఒంటరితనం

ప్రతి మనిషి వారి జీవితంలో అనేక భావోద్వేగ దశలను దాటవలసి వస్తుంది అలాంటి దశలలో ఒంటరితనం కూడా ఒకటి. కొంతమంది చుట్టుపక్కల పరిస్థితుల కారణంగా ఒంటరిగా ఉండుటకు ఇష్టపడుతారు. పురుషుల విషయంలో, ఈ పరిస్థితి సర్వసాధారణంగా ఉంటుంది. పురుషులు సాధారణంగా స్త్రీల కంటే తక్కువగా సమాజంతో కలివిడితనాన్ని కలిగి ఉంటారు. చాలామంది పురుషులు ఇతరులతో విషయాలు చర్చించుకునే కన్నా, అంతరాత్మతోనే చర్చలు జరుపుతుoటారు. వీరిని ఇంట్రావర్ట్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ అలవాటే సగం ఒంటరితనానికి కారణం. మరియు కొన్ని మానసిక, సామాజిక పరిస్థితుల వలన కలిగే డిప్రెషన్ ఒంటరితనానికి దారితీస్తుంది. సరైన సమయంలో కనుగోనలేని పక్షంలో కొన్ని పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు.

3. పరిణితి

3. పరిణితి

పురుషులు మరియు పరిపక్వత తూకం సరిపోయేలా ఉండాలని ఒక భావన. మరియు ఒక పురుషుడు, భాగస్వామికన్నా ఎక్కువ పరిపక్వత చెంది ఉండాలని తరాలుగా వస్తున్న మాట. కానీ కొన్నిసార్లు, పరిపక్వత మనుషులతో సంబంధం లేకుండా వింతపోకడలను చూపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందువరకు సంతోషంగా ఉన్న వ్యక్తి అత్యంత భారాన్ని తలపైన కలిగి ఉన్న ప్రవర్తనని కనపరుస్తుంటాడు. ఇది అపరిపక్వతకు ప్రధాన ఉదాహరణ. మానసిక అధ్యయనాల ప్రకారం, వయసు మీరుతున్న ఎడల శరీరంలోని టెస్టోస్టీరాన్ హార్మోన్ తగ్గుదలకు గురవడం కారణంగా ఇలాంటి పరిస్థితులు దాపురిస్తుంటాయి. అవసరాన్ని బట్టి వైద్యుని సంప్రదించడం మంచిది.

4. వివాహo

4. వివాహo

మహిళలు వారి అందమైన పెళ్లి గౌనులో నడవడానికి, క్రమంగా ఒక కుటుంబం ప్రారంభించుటకు ఉత్సుకత కలిగి ఉంటారు. కానీ, పురుషులు జీవితంలో జరిగే అనూహ్య మార్పులను వెంటనే ఆస్వాదించలేరు. పురుషులు స్వేచ్చా జీవిగా ఉండాలని కోరుకుంటాడు. మరియు ఒత్తిడిలేని జీవనశైలి వీరి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. తద్వారా వివాహoతో అదనపు భాద్యతలు ఏర్పడినట్లుగా భావించడం వలన, ఒత్తిడి అనేది ప్రధానంగా ఉంటుంది. క్రమంగా డిప్రెషన్ లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అనేక మంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 30 వయసుకన్నా ముందు వివాహం చేసుకున్న వారిలో ఈ డిప్రెషన్ సమస్యలను ఎక్కువగా చూస్తున్నట్లు ఒక అంచనా.

5. తండ్రిగా భాద్యతలు

5. తండ్రిగా భాద్యతలు

తల్లిదండ్రులుగా మారడం అనేది మనుషుల ప్రవర్తనను పూర్తిగా మార్చివేయగలదు. ఒక మనిషి తండ్రి కాగానే, రాత్రికిరాత్రే పరిస్థితులన్నీ తారుమారవుతుంటాయి. అప్పటిదాకా తననుతాను యువకుడిలా భావించే వ్యక్తి, ఒక్కసారిగా భాద్యతలు నెత్తిన పడి పెద్దరికం ఆలోచనలు చేస్తాడు. తద్వారా ఆందోళనలతో కూడుకున్న ఆలోచనల్లో భవిష్యత్ ప్రణాళిక అతనికి అగమ్యగోచరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అతని వ్యక్తిగత ప్రాధాన్యతలు మారడం వంటివి అతనిలో ఒక ప్రస్ఫుటమైన మార్పుకు ప్రధాన కారణం.

6. అనుభవం

6. అనుభవం

పురుషులు వారు దైనందిక జీవనంలో అనుభవిస్తున్న మారుతున్న పరిస్థితుల కారణంగా కూడా మారుతారు. వీరి మనసుపై అత్యధికంగా ప్రభావాన్ని చూపే మంచి లేదా చెడు ప్రభావిత అంశాలు కూడా ఈమార్పునకు కారణం. ఈ మార్పులు గమనించడానికి కూడా సులువుగా ఉంటాయి.

7. ప్రేమ

7. ప్రేమ

ఇది పురుషులలో మార్పు తెచ్చే మరొక ముఖ్యమైన అంశం. పురుషులలో ప్రేమ అనేది అనేక భావోద్వేగాలకు ప్రధాన కారణం అవుతుంది మరియు ప్రేమ అంటేనే అనేక సానుకూల, ప్రతికూల పరిస్థితులకు ప్రధాన రహదారి. ప్రేమ పురుషుల నూతన జీవితానికి కీలకంగా ఉంటుంది. వీరిలో కొందరికి ప్రేమ ఉత్తమ ఫలితాలను ఇస్తే, కొందరికి గుణపాఠాలుగా ఉంటాయి. క్రమంగా వీరి చర్యలు వీరి ఆలోచనా విధానాలను త్వరగానే కుటుంబ సభ్యులు తెలుసుకునే వీలుంటుంది. పరిస్థితిని బట్టి, సరైన గైడెన్స్ ఇచ్చేలా కుటుంబ సభ్యులు పూనుకోవాలి.

ఈ ఏడు అంశాలు పురుషుల ప్రవర్తన అసహజ మార్పులకు ప్రధాన కారణాలు. ఈ పరిస్థితులు మనిషిని ఉన్నతంగా ఉంచగలవు లేదా పూర్తిగా పాతాళానికి తొక్కేయగలవు. మనిషిమనిషికీ ఈ మార్పులు భిన్నంగా ఉంటాయి. కావున, జాగరూతులై వ్యవహరించవలసి ఉంటుంది.

English summary

WHY DO MEN CHANGE? REASONS THAT MAKE THESE CHANGES SUDDENLY

It is another factor that makes men change. Love changes feelings about people brings in more emotions and makes you experience a lot of emotions. Love is the key to a new life for men. They mold themselves to be in love at times, making it obvious for people to observe that they are in love. Read the article to understand all the reasons.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more