Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
ప్రస్తుతం అంతా స్మార్ట్ ప్రపంచమే. వెడ్డింగ్ షూట్ కోసం ఒక్కొక్కరు ఒక్కో శైలిని అనుసరిస్తారు. అది జీవితాంతం గుర్తుండిపోవాలని ఆశిస్తుంటారు.
ఇంధ్రదనస్సులో ఏడు రంగులు.. ఈ ప్రపంచంలో ఏడు వింతలు.. సంగీతంలో ఏడు స్వరాలు.. వెంకన్న ఉండేది ఏడు కొండలు.. పెళ్లితో వేసేది ఏడు అడుగులు.. అలాంటి అద్భుతమైన వివాహ ఘట్టాన్ని అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే కొందరు మాత్రమే వాటిని నెరవేర్చుకుంటారు.

ఇటీవల ఓ జంట 33 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఉండగా బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యింది. అయితే తాజాగా మన దేశంలోని ఓ జంట గాల్లో కాకుండా నేలపైనే అద్భుతమైన ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయిపోయాయి. వీటిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ వారు ఏమి చేశారు. ఎందుకని నెటిజన్లు వారిని పొగిడారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

మళయాళీ లవర్స్..
ప్రస్తుతం అంతా స్మార్ట్ ప్రపంచమే. వెడ్డింగ్ షూట్ కోసం ఒక్కొక్కరు ఒక్కో శైలిని అనుసరిస్తారు. అది జీవితాంతం గుర్తుండిపోవాలని ఆశిస్తుంటారు. అలాగే ఆలోచించారు ఈ కేరళ లవర్స్. వీరిని చూసి సామాన్యులు సైతం తాము కూడా ఫాలో అవుతామని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

‘మడ్ లవ్‘
ఇంతకుముందు కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లి బట్టలతోనే నదిలో ఫొటో షూట్ కోసం దిగడం. అక్కడ వధూవరులిద్దరూ నదిలో పడిపోవడం.. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం మనందరికీ తెలిసిందే.. అయితే ఇటీవల అదే కేరళ రాష్ట్రానికి చెందిన జోస్ - అనిషా జంట ‘మడ్ లవ్‘ థీమ్ తో వినూత్నంగా వెడ్డింగ్ ఫొటో షూట్ తీయించుకున్నారు.

లవ్లీ కపుల్..
అందరిలా వెడ్డింగ్ షూట్ చేస్తే కిక్ ఏముంటుంది. అందరి కంటే వెరైటీగా వెడ్డింగ్ ఫొటోషూట్ చేయాలనుకున్న ఆ జంట మోడ్రన్ దుస్తులతోనే బురదలోకి దిగింది..

నారు మళ్ల మధ్యలో..
రైతుల పొలంలోని నారు మళ్ల మధ్యలో బాగా బురదగా ఉన్న ప్రదేశంలో ఆ జంట ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ ప్రేమ పరవశంలో మునిగిపోయారు. ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుంటూ.. కిస్ లు పెట్టుకుంటూ ఫుల్లు ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలను ‘బినూ సీన్స్ ఫొటోగ్రఫీ‘ కంపెనీ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అవి కాస్త బాగా వైరల్ అయిపోయాయి.

ఇదే మొట్టమొదటిది..
ఈ సందర్భంగా ఈ ఫొటో షూట్ ఆ కంపెనీ వారు మాట్లాడుతూ తమ దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తుంటారు. చాలా మంది చాలా రకాల వెరైటీ ఫొటో షూట్ లను అడుగుతుంటారు. అయితే ‘మడ్ లవ్‘ థీమ్ అనే ఫొటో షూట్ తొలిసారి అని చెప్పారు.

నెటిజన్ల ప్రశంసలు..
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. కొందరేమో వారికి శుభాకాంక్షలు చెబుతూ ఫన్నీ మీమ్స్ ను జత చేయగా.. మరి కొందరు మంచి క్రియేటివిటీ అని అభినందించారు. ఇంకా కొందరు నెటిజన్లు అయితే తాము కూడా దీన్ని ఫాలో అవుతామని తమకు ఆ వెడ్డింగ్ ప్లానర్ మొబైల్ నంబర్ కావాలని అడుగుతున్నారు. దాంతో వందలాది మంది షేర్లు చేసుకుంటున్నారు.

తొలుత వద్దన్నారు..
ముందుగా ఇలా ఫొటో షూట్ అని చెబితే వారు వద్దన్నారంటా. అయితే వారిని అతి కష్టం మీద ఒప్పించి మరీ ఈ బురదలో ఫొటోషూట్ ఏర్పాటు చేశారు.



Click it and Unblock the Notifications
