For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా లాక్ డౌన్ : కలయిక మరియు హస్తప్రయోగంపై కీలక సూచనలు చేసిన దేశమేదో తెలుసా...

కలయికలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉందని భావించిన ఆ దేశ ప్రభుత్వం అందుకోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

|

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చాలా మందికి కావాల్సినంత ఖాళీ సమయం దొరుకుతోంది. ముఖ్యంగా యువత అంతా స్మార్ట్ ఫోన్లలో నిత్యం వాటినే చూస్తున్నారని కొన్ని సర్వే సంస్థలు ఇటీవలే వెల్లడించాయి. అందులోనూ మన భారతీయులు 95 శాతం పెరిగారని చెబుతోంది.

Corona Alert: Ireland Government Advises Practising Safe Sex and Masturbation

ఇంటర్నెట్ వినియోగం కూడా భారీగా పెరిగిందట. అయితే చాలా మంది భార్యభర్తలు కూడా రాత్రి, పగలు అనేదే తేడా లేకుండా కలయికలో పాల్గొంటున్నారు. దీంతో చాలా మంది భార్యభర్తల బంధం మరింత బలపడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

Corona Alert: Ireland Government Advises Practising Safe Sex and Masturbation

అంతేకాదు ఆలుమగల మధ్య ఎలాంటి దాపరికాన్ని అయినా ఇది దూరం చేస్తుంది. అంతేకాదు దంపతుల మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. దీని వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్య మంచి అవగాహన కూడా పెరుగుతుంది.

Corona Alert: Ireland Government Advises Practising Safe Sex and Masturbation

అంతేకాదు ఆరోగ్య పరంగా కూడా ఇద్దరికీ అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కలయికలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అనసవరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Corona Alert: Ireland Government Advises Practising Safe Sex and Masturbation

ఈ సందర్భంగా తమ దేశ ప్రజల రక్షణ కోసం కలయిక మరియు హస్తప్రయోగానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఐర్లాండ్ ప్రభుత్వం. వాటితో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

<strong>కపుల్స్ కు గొప్ప వరంగా మారిన కరోనా లాక్ డౌన్..! వాటిని విపరీతంగా వాడేస్తున్నారట...!</strong>కపుల్స్ కు గొప్ప వరంగా మారిన కరోనా లాక్ డౌన్..! వాటిని విపరీతంగా వాడేస్తున్నారట...!

సురక్షితంగా ఉంటేనే ఆనందం..

సురక్షితంగా ఉంటేనే ఆనందం..

కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరిన నేపథ్యంలో ప్రతి దేశం తమ ప్రజల రక్షణ కోసం అనేక రకాల మార్గదర్శకాలను విడుదల చేసింది. అయినా కూడా కరోనా పాజిటివ్ కేసుల గ్రాఫ్ రోజురోజుకు పైకి దూసుకుపోతోంది. అయితే కలయిక వల్ల ఈ అంటు వ్యాధి సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఐర్లాండ్ ప్రభుత్వం భావించింది. అందుకే కలయిక మరియు హస్త ప్రయోగం విషయంలో ప్రత్యేక సూచనలను చేసింది. వీటిని పాటిస్తే మీరంతా సురక్షితంగా ఉండొచ్చని.. మంచి ఆనందాన్ని పొందవచ్చని చెబుతోంది.

కరోనా లక్షణాలు లేనప్పుడే...

కరోనా లక్షణాలు లేనప్పుడే...

ప్రస్తుతం కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే తమ భాగస్వామితో కలయికలో పాల్గొనాలని భావిస్తున్నారో... ముందుగా వారిలో కోవిద్-19 లక్షణాలు ఉన్నాయో లేదా నిర్ధారించుకోవాలని సూచించింది. అలాంటి సమయంలో శారీరక సంబంధాలను పెట్టుకోవాలని సూచించింది. అయితే కలయికలో పాల్గొనే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ముద్దులను పెట్టుకోవద్దని సూచించింది. ముఖ్యంగా పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని తెలిపింది.

ఆన్ లైన్ రొమాన్స్..

ఆన్ లైన్ రొమాన్స్..

కరోనా వైరస్ లాక్ డౌన్ ఉన్న సమయంలో ఐర్లాండ్ ప్రభుత్వం శారీరక సంబంధాలకు విరామం ఇవ్వడం మంచిదని కూడా సూచించింది. అందుకు బదులుగా మీరు ఆన్ లైన్ సెక్స్ లేదా లైవ్ సెక్స్ ద్వారా మీరు ఆనందంగా గడపవచ్చని ప్రకటించింది. వీటితో పాటు సెక్స్ టింగ్ మరియు చాట్ రూమ్ ఎంపికలను ఎంచుకోవాని ప్రజలను కోరింది.

ఆ సమయంలో..

ఆ సమయంలో..

ఐర్లాండ్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో ఇది చాలా ముఖ్యమైనది. చాలా మంది హస్తప్రయోగం సమయంలో మీ చేతులను లేదా సెక్స్ టాయ్స్ ను పూర్తిగా ఉపయోగిస్తే ఎలాంటి ఇన్ ఫెక్షన్ అనేదే జరగదని సూచించింది. హస్తప్రయోగానికి ముందు మరియు తర్వాత 20 నిమిషాలు మంచి నీరు మరియు సబ్బుతో చేతులు కచ్చితంగా కడుక్కోవాలని సూచించింది.

మన దేశంలో..

మన దేశంలో..

అయితే ఇలాంటి జాగ్రత్తల విషయంలో మన దేశంలో ముఖ్యంగా నగరాలలో నివసించే వారు ఇప్పటికే వీటిని పాటిస్తున్నారు. ఇటీవలే డుంజో యాప్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మన భారతీయులు ఎక్కువగా కండోమ్స్, సెక్స్ టాయ్స్, ఐపిల్స్ ఆర్డర్ చేసినట్లు ప్రకటించింది.

English summary

Corona Alert: Ireland Government Advises Practising Safe Sex and Masturbation

Ireland has issued guidelines on safe sex during the coronavirus pandemic.Read on
Story first published:Monday, April 20, 2020, 14:17 [IST]
Desktop Bottom Promotion