For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహేతర సంబంధం వల్ల ఎంతమందికి కరోనా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

|

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ కలకలం పెరుగుతూనే పోతోంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వేలాది మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు.

మన దేశంలో కూడా ఈ కరోనా భూతం వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు మన దేశంలో 40 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఈ కరోనా వైరస్ దెబ్బకు దాదాపు వెయ్యి మంది బలయ్యారు.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ రోజురోజుకు పంజా విసురుతోంది. తెలంగాణలో పరిస్థితి ఓ మాదిరిగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం దారుణంగా ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది.

ఆ జిల్లాలో ప్రస్తుతం 400కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదొక్కటే అనుకుంటే దీనికి పోటీగా గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో కూడా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ సడలింపుల పేరిట ఏపీలో వైన్ షాపులు ఓపెన్ చేయడంతో మద్యం ప్రియులు మాస్కులు లేకుండా.. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కిలోమేటర్ల క్యూలైన్లలో నిలబడి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమవుతున్నారు.

మద్యం ప్రియులు క్యూ లైన్లలో అడ్డూ అదుపు లేకుండా.. కనీస దూరం పాటించకుండా.. మందు బాటిలే ముఖ్యమని, ఆ తర్వాతే తమకు ఏదైనా అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే తాజాగా ఓ అక్రమ సంబంధం అనేక మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చేలా చేసింది. ఇవి ఎక్కువగా తెలంగాణ, ఢిల్లీ వంటి ముఖ్యమైన నగరాల్లో వెలుగు చూస్తుండటం ఆందోళనకరం. ఇంతకీ ఈ విషయం ఎలా బయటపడింది... ఈ కరోనా బారిన ఎంత మంది పడ్డారో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కొత్త కేసులపై ఆరా తీస్తే..

కొత్త కేసులపై ఆరా తీస్తే..

ఇటీవల తెలంగాణలోని ఓ టౌన్ లో అకస్మాత్తుగా కొత్త కేసులు పెరిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వీరికి కరోనా ఎలా సోకిందా అని ఆరా తీస్తే వారు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముందుగా మెడికల్ షాపు యజమానికి..

ముందుగా మెడికల్ షాపు యజమానికి..

కరోనా సోకిన వ్యక్తి ముందుగా మెడికల్ షాపు యజమాని వద్దకు వెళ్లి మందులు తీసుకోవడంతో.. మొదట ఆ మందుల యజమానికి కరోనా వైరస్ సోకింది.

తర్వాత కిరాణ షాపులో..

తర్వాత కిరాణ షాపులో..

అయితే ఆ మెడికల్ షాపు యజమాని.. ఓ కిరాణ షాప్ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. దీంతో ఆమెకు కూడా కరోనా వైరస్ సోకిందట. ఆ తర్వాత ఆమె ఓ చేపలు అమ్మే మహిళతో ముచ్చట్లు కలిపిందట. దీంతో ఆ చేపలు అమ్మే మహిళకు కూడా కరోనా పాకిందట.

ఆ మహిళ అష్టాచెమ్మా..

ఆ మహిళ అష్టాచెమ్మా..

అయితే ఆ చేపలు అమ్మే ఆ మహిళ వారి ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వారితో కలిసి అష్టా చెమ్మా ఆడిందట. దీంతో వారికి.. వారి నుండి కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకిందట.

ఇలా చాలా మందికి...

ఇలా చాలా మందికి...

ఇలా వారందరికీ తెలియకుండానే కరోనా వైరస్ అక్కడ ఉంటే చుట్టు పక్కల ఉండే వారందరికీ సోకిందట. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత వారందరినీ గుర్తించి, ఆసుప్రతికి తరలించారట.

ఢిల్లీలో కూడా...

ఢిల్లీలో కూడా...

తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఢిల్లీ నగరంలో ఓ యువకుడికి కరోనా వైరస్ సోకింది. అయితే ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్లు చెక్ చేస్తే తనకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసిందట.

వారితో శారీరకంగా..

వారితో శారీరకంగా..

వారిద్దరితోనూ ఆ బాయ్ ఫ్రెండ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తేలిందట. తీరా వారిని పిలిపించి వారికి కరోనా పరీక్షలు చేయగా వారికి కూడా పాజిటివ్ వచ్చిందట. అయితే ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే ఆ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కి కూడా మరో ఇద్దరితో రిలేషన్ షిప్ ఉందట.

ఆశ్చర్యపోయిన అధికారులు..

ఆశ్చర్యపోయిన అధికారులు..

వీరి వివాహేతర సంబంధాల గురించి తెలుసుకున్న అధికారులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే వారందరి గురించి ఆరా తీసి కరోనా పరీక్షలు చేయనున్నారట.

కాంటాక్టు లిస్టును..

కాంటాక్టు లిస్టును..

ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ప్రస్తుతం తమ ఫోన్ లోని కాంటాక్టు నెంబర్లను డిలీట్ చేసేస్తున్నారట. ఎందుకంటే కరోనా వైరస్ పుణ్యమా అని, తమ వివాహేతర సంబంధాలు ఎక్కడ బయటపడతాయో అని ఇలా చేస్తున్నారట.

English summary

Corona effect on illegal affairs

Here we talking about corona effect on illegal affairs. Read on
Story first published: Tuesday, May 5, 2020, 17:25 [IST]