Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
కరోనా ఎఫెక్ట్ : రాబోయే రోజుల్లో కండోమ్స్ కొరత తప్పదట...!
కండోమ్ ల వినియోగం భారీగా పెరిగిందని ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు ఎంతలా పెరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 40 లక్షల మంది వరకు ఈ మహమ్మారి బారిన పడ్డారు. సుమారు 2 లక్షల మంది వరకు మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

అయితే మన దేశంలో కూడా ప్రస్తుతం సుమారు 50 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మన దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉందని కేంద్రం చెబుతోంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే మొదటి లాక్ డౌన్ తర్వాత, రెండు, మూడు లాక్ డౌన్లలో చాలా ప్రభుత్వాలు కొన్ని సడలింపులు చేశాయి. ఇదే అదనుగా భావించిన చాలా మంది కండోమ్స్ ను ఒక నిత్యావసర వస్తువుగా మార్చేసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని నిత్యం విపరీతంగా వాడటం మొదలెట్టారట. దీంతో కండోమ్స్ అమ్మకాలు చాలా పెరిగాయి.

అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ ప్రభావం కండోమ్ కంపెనీలపై కూడా తీవ్రంగా పడిందట. అకస్మాత్తుగా కండోమ్స్ ఉత్పత్తికి సమస్యలు ఏర్పడ్డాయట. దీంతో భవిష్యత్తులో కండోమ్స్ కొరత ఉండొచ్చని చెబుతున్నారు కంపెనీల ప్రతినిధులు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం...

లాక్ డౌన్ మినహాయింపులు..
ప్రస్తుతం చాలా చోట్ల రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చారు. అయితే ఈ సమయంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల కోసం మాత్రమే ప్రజలకు అనుమతి ఉంది. అయితే తాజాగా మద్యం షాపులకు కూడా అనుమతి లభించింది.

తెలుగు రాష్ట్రాల్లో..
లాక్ డౌన్ మినహాయింపు కారణంగా మద్యం బాటిళ్లు ఎంతలా అమ్ముడుపోతున్నాయో అందరికీ తెలిసిందే. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్క రోజులోనే 40 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ నిల్వలు ఉండటంతో చాలా మందికి ఎలాంటి సమస్యలు ఉండటం లేదు.

రొమాన్స్ వీరులు..
ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన చాలా మంది కేవలం రొమాన్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారేమో అని చాలా మందికి సందేహం వస్తోంది. అయితే ఇప్పటికే చాలా మంది తమ భాగస్వాములతో కలయికల్లో పాల్గొంటున్నారు.

కండోమ్ ల కొరత..
అయితే వీరు లాక్ డౌన్ తర్వాత కండోమ్స్ ను ఒక నిత్యావసర సరుకులా విపరీతంగా కొనుగోలు చేశారట. వీరి వాడకం చూస్తుంటే భవిష్యత్తులో కండోమ్స్ దొరికే పరిస్థితి కష్టమేనంటున్నారు కంపెనీ యజమానులు.

కండోమ్స్ పైనా కరోనా ప్రభావం..
అకస్మాత్తుగా కండోమ్స్ కంపెనీల ప్రతినిధులు ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేశారంటే.. కరోనా లాక్ డౌన్ కారణంగా వాటిని ఉత్పత్తి చేసే పరిస్థితులు కష్టంగా మారిపోయాయట.

భారీగా తగ్గిన ఉత్పత్తి..
ఇప్పటివరకు కండోమ్స్ ల ఉత్పత్తిలో మలేషియా అగ్రస్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం ఆ దేశంతో పాటు చాలా దేశాలలో లాక్ డౌన్ ఉండటంతో కండోమ్ ల ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందట.

భవిష్యత్తులో ఇబ్బందులు..
రాబోయే రోజుల్లో కండోమ్స్ కొరత తప్పదని కారెక్స్ సంస్థ యజమాని గో మియా కియాట్ ఏఎఫ్పీ వార్తా సంస్థతో అన్నారు. ప్రస్తుతం పాపులార్ గా ఉన్న ఐదు బ్రాండ్ల కండోమ్స్ లో ఒకటి కారెక్స్ సంస్థ నుండి తయారవుతోంది.

సగమే సరఫరా..
ఇప్పటికే ఈ విషయంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిందట. ఇప్పటివరకు దీని అనుబంధ సంస్థ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీకి అవసరమైన కండోమ్స్ లో కేవలం సగమే సరఫరా చేసిందట. దీన్ని బట్టి చూస్తుంటే..భవిష్యత్తులో కండోమ్స్ కొరత కచ్చితంగా ఉంటుందట.



Click it and Unblock the Notifications