Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
కరోనా సమయంలో రతి క్రీడలో పాల్గొనే ముందు... ఈ విషయాలను అస్సలు మరచిపోకండి...!
వన్ నైట్ స్టాండ్ నేపథ్యంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా భూతం ప్రపంచాన్ని తలకిందులు చేస్తే.. లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా మార్పులొచ్చాయి. చాలా మంది ప్రతిదానికి ఆన్ లైన్ పై ఆధారపడుతున్నారు. గుండుసూది నుండి గుమ్మడికాయ దాకా.. స్మార్ట్ ఫోన్ నుండి ల్యాప్ టాప్, ఇతర గ్యాడ్జెట్స్ వరకు అన్నింటినీ ఆన్ లైనులోనే ఆర్డర్ చేస్తున్నారు.

ఇక లాక్ డౌన్ పుణ్యమా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడంటే అన్ లాక్ మొదలైంది.. కానీ లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అయితే లాక్ డౌన్ సమయంలో మనమంతా ఓటీటీ, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి వాటిని చూశాం..

ఇంకా ఎన్నిరోజులనీ వాటినే చూస్తూ కాలం గడుపుతాం చెప్పండి. చాలా మంది యువతకు ఇప్పటికే ఫుల్ బోర్ కొడుతోంది. ముఖ్యంగా లైంగిక కోరికలను తీర్చుకోవాలనే వారు ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు చెప్పండి.

అయితే ఇలాంటి సమయంలోనే మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితో అయినా డేటింగుకు వెళ్తున్నా.. లేదా వన్ నైట్ స్టాండ్ వంటివి చేయాలనుకుంటే మాత్రం ఈ నియమ నిబంధనలను కచ్చితంగా ఫాలో అవ్వండి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు.

ఎవరితో చురుగ్గా..
మీరు ఎంపిక చేసుకున్న భాగస్వామి గురించి బాగా తెలుసుకోండి. తనకు వైరస్ సమస్యల మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. తను ఎక్కువగా ఎవరితో చురుకుగా పాల్గొంటారనే విషయాలను కనుక్కోవాలి. ఇదంతా తెలుసుకుంటే మీకు వారితో లైంగిక సంబంధం సురక్షితమా కాదా అనే విషయాలను తెలుసుకోవచ్చు.

పరిమితుల్లో ఉండండి..
మీరు కలిగి ఉన్న లైంగిక భాగస్వాముల సంఖ్యను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ముఖ్యంగా చాలా పరిమిత సంఖ్యలో ఇలాంటి పనులు చేయాలి. మీరు ఓపెన్ గా మాట్లాడే వ్యక్తులను మాత్రమే ఎక్కువగా కలుసుకోండి.

కొత్త వారితో..
ఈ కరోనా మహమ్మారి వంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వారితో సంబంధాలు పెట్టుకోకండి. ఎందుకంటే మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి అది పాజిటివ్ ఉన్నా.. అది ఇద్దరికీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మైండ్ లో ఉంచుకోండి.

ఈ ప్రశ్నలను అడగండి..
మీరు లైంగిక సంబంధం కొనసాగించే వ్యక్తిని ఈ ప్రశ్నలను కచ్చితంగా అడగండి. మీ భాగస్వామి స్థితి మరియు ప్రమాద కారకాల గురించి అడగండి. వారు మాస్కు తప్పనిసరిగా వాడుతున్నారా? వైరస్ టెస్టు చేయించుకున్నారా? శానిటైజర్ యూజ్ చేస్తున్నారా? సోషల్ డిస్టేన్స్ పాటిస్తున్నారో లేదో అడిగి తెలుసుకోండి.

శుభ్రత పాటించండి..
కరోనా ఆందోళన మధ్య మీరు డేటింగుకు వెళ్లడం లేదా ఎవరితో అయినా లైంగిక సంబంధంలో పాల్గొనడం వంటివి చేయాలనుకుంటే, వారి గురించి పూర్తి వివరాలను తెలుసుకుని, ఒక నిర్ధారణకు రండి. ముఖ్యంగా వారితో పాల్గొనే ప్రదేశాల్లో.. స్థానాల్లో శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు కరోనా వంటి మహమ్మారి వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications