Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
అపరిచితులతో శృంగారం చేస్తున్నట్లు కలల వస్తే... వాటి మీనింగ్ ఏంటో తెలుసా...!
అపరిచితులతో శృంగారం చేస్తున్నట్లు కలలు వస్తే.. వాటి అర్థాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మనలో యవ్వనంలో ఉండే వారిలో ఎక్కువ మందికి అలాంటి కలలే వస్తుంటాయి. అందులోనూ మదిని పులకించేవి కొన్ని కలలైతే.. మరికొన్ని మాంచి రొమాంటిక్ డ్రీమ్స్. అయితే అకస్మాత్తుగా మెలకువ వచ్చేదాకా మనకు అది కల అన్న విషయమే తెలీదు. అంతాలా మనం అందులో లీనమైపోయి ఉంటాం.

అయితే ఒక్కసారి మెలకువ వచ్చినప్పుడు, ఆ కల ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కలలు మనలో చాలా మందికి మాంచి కిక్కు ఎక్కిస్తాయి. అయితే ఇదంతా చాలా సర్వసాధారణం అని చెబుతున్నారు నిపుణులు.

అయితే పెళ్లయిన వారిలో ఎక్కువమందికి తమ భాగస్వామితో కాకుండా ఇతర వ్యక్తులతో శృంగార సంబంధం ఉన్నట్టు కలలు వస్తుంటాయి. ఇవి చూసి భయపడొద్దని, దాని అర్థం మీరు మీ భాగస్వామిని మోసం చేస్తున్నట్టు కాదని చెబుతున్నారు సైకాలజిస్టులు.

అలాగే మీ యజమానితో, మీ సహోద్యోగితో, మీకు తరచుగా బయట కనబడే వ్యక్తితో శృంగారం చేస్తున్నట్టుగా కలలు రావడంలో కూడా ప్రత్యేకత ఏమీ లేదని చెబుతున్నారు.

అయితే ఇలాంటి కలలు వస్తే ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

విచిత్రమైన శృంగార కలలు..
మనలో చాలా మందికి విచిత్రమైన శృంగార కలలు వస్తుంటాయి. అందులో చాలా మందికి కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా మీరు ఇతరులను లేదా ఇతరులు మిమ్మల్ని తాళ్లతో కట్టేసి, కొడుతూ శృంగారం చేస్తున్నట్టుగా కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలకు అర్థం మిమ్మల్ని చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు అదుపులో పెట్టేవారనో లేదా మీరు ఇతరులను అదుపులో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారని అర్థం కావచ్చు.

ఓరల్ సెక్స్..
మనలో కొంత మంది ఓరల్ సెక్స్ అంటే అస్యహించుకుంటారు. అయితే కలలో ఓరల్ సెక్స్ గురించి కలలు వస్తే.. మీరు అసహ్యకరమైన వాతావరణంలో పెరిగారని, కానీ మీకు రహస్యంగా మాత్రం దానిపై కోరిక ఉందని ఈ కల అర్థం.

స్కూల్, కాలేజీలో శృంగారం..
మీరు స్కూల్ లేదా కాలేజీలో విద్యార్థులతో లేదా టీచర్లతో శృంగారం చేస్తున్నట్టు కలలు వస్తే.. మీ తండ్రి అంటే మీకు చాలా ఇష్టం. కానీ మీ తండ్రి మీపై కావాల్సినంత శ్రద్ధ మీపై పెట్టలేదు అని, ఇప్పుడు మీరు మీ కంటే పైనున్న వారి అటెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారని ఈ కలకు అర్థం.

తెలియని వ్యక్తులతో..
మీకు కలలో తెలియని వ్యక్తులతో శృంగారం చేస్తున్నట్టు కలలు వస్తే.. మీలో సెక్స్ కోరికలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని, కానీ నిజ జీవితంలో మీరు ఆ స్థాయిలో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. అయితే మీరు ఈ కలల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామితో ఓపెన్ గా వీటి గురించి మాట్లాడుకుని మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు.

మీ మాజీ భాగస్వామితో శృంగారం..
చాలా మందికి ఇలాంటి కలలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ స్మార్ట్ యుగంలో చాలా మంది విడిపోవడం.. బ్రేకప్ చెప్పుకోవడం సాధారణమే. అయితే మీరు విడిపోయి ఎంత కాలమైనా.. వారితో రిలేషన్ లో ఉన్నట్టు కలలు వస్తే.. మీరు కొత్త భాగస్వామితో సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.

బాత్ రూమ్ లో..
చాలా మందికి ఇలాంటి కలలు వస్తుంటాయి. ఇవి చాలా సాధారణమే. మీరు బాత్ రూములో బట్టలు లేకుండా ఉన్నట్టు ఊహించుకోవడం బాగానే ఉంటుంది. ఇలాంటి కలలొచ్చినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అర్థం. ఇలాంటి సమయంలో మీకు, మీ భాగస్వామికి ఇలాంటివి ఇష్టమైతే మీరు నిజ జీవితంలో కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు.
రానా-మిహీకా వెడ్డింగ్: సెలబ్రెటీలకు పెళ్లిలో ఉన్న ఫీలింగ్ వచ్చేందుకు ఏ టెక్నాలజీ వాడారో తెలుసా...
https://telugu.boldsky.com/relationship/marriage-and-beyond/rana-mihika-wedding-do-you-know-which-technology-is-used-by-celebrities-to-watch-this-wedding-024180.html

బూతు మాటలతో శృంగారం..
కొందరికి వచ్చే కలల్లో ఎక్కువగా బూతు పదాలు వినిపిస్తుంటాయి. ఈ కలకు అర్థమేమిటంటే.. ఎవరైతే అది మంచి.. ఇది చెడు అని గీతలు గీసుకుని పెరిగి ఉంటారో.. అందులో నుండి బయటికి రావడానికి చేసే ప్రయత్నమే ఈ కల అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఈ కలల్ని ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మరచిపోవచ్చు. అయితే ఇలాంటి కలలు వచ్చినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేయాలి.

భావోద్వేగ కలలు..
మీకు వచ్చే కలల్లో భావోద్వేగ శృంగారానికి సంబంధించిన కలలు వస్తుంటే, మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం. అయితే ఇలాంటి కలల్లో మీ అనుభవన్నంతా.. మీ ఫీలింగ్సుకు ప్రాధన్యాత ఇవ్వండి.

మీరెలా ఫీల్ అయ్యారు..
శృంగార కలలు అనేవి అందరికీ ఒకేలా రావు. అందరికీ ఒకే విషయం చెప్పవు. అందుకే ఈ కలలను పరిశీలించే సమయంలో కలలో కనిపించిన వ్యక్తుల కంటే కల ఏమి చెబుతుందో చూడమని చెబుతున్నారు నిపుణులు. మంచి శృంగారంలో ఉన్నప్పుడు మీరెలా ఫీల్ అయ్యారనే దానికే మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంట. అప్పుడు మీరు అర్థం అయ్యేది ఏమిటంటే, ఆ ఫీలింగ్ మీ నిజ జీవితంలో లేదని, దాని కోసం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఎంజాయ్ చేయండి..
శృంగార కలలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం అవి మీకు ఏమి చెబుతున్నాయో అర్థం చేసుకోండి. మీరు ఎంతవరకు వీలైతే.. అంతవరకూ వాటిని ఎంజాయ్ చేయండి. కానీ ఈ కలలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే, మానసిక నిపుణుల సహాయం తీసుకోవడానికి మీరు ఏ మాత్రం వెనుకాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం కూడా చేయొద్దు.



Click it and Unblock the Notifications