Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ప్రేమ నాతో.. పెళ్లి మాత్రం మరొకరితో.. ఇప్పుడేమో మళ్లీ నేనే కావాలంటూ...
మీ ఎక్స్ మిమ్మల్ని ఇప్పటికీ ఇష్టపడుతున్నారని కనుక్కోవడం ఎలాగో తెలుసుకుందాం.
ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో శక్తి ఉంది. ఇది ఎప్పుడు ఎవరిపై పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకప్పుడు ప్రేమ అంటే జీవితాలను త్యాగం చేసేవారు. ఏళ్లకు ఏళ్లు తాము ప్రేమించిన వ్యక్తుల కోసం ఎంతో ఓపికతో ఎదురుచూసేవారు.

కానీ ఇప్పటితరం వారిలో చాలా మంది తాము ప్రేమించేది ఒకరిని.. పెళ్లి మాత్రం వేరొకరిని చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు..

అయితే పెళ్లి తర్వాత కొందరు తమ మాజీ భాగస్వామిని కలవాలని.. వారితోనే రిలేషన్ బాగుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడే కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో.. ఈ సందర్భంగా వారి ప్రాబ్లమ్సెంటో.. దానికి నిపుణులు ఏమి సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఒకే కంపెనీలో..
హాయ్! నా పేరు రాజేష్(పేరు మార్చాం). నాకు పాతికేళ్లు. నేను రెండేళ్ల క్రితమే ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అయితే తను నా కంటే మూడేళ్లు పెద్దది. మేమిద్దరం హైదరాబాదులో ఉండే ఒకే కంపెనీలో 2 సంత్సరాల పాటు కలిసి పనిచేశాం.

తొలి పరిచయంలో..
తనతో తొలిసారి పరిచయం చాలా విచిత్రంగా అయ్యింది. ఆఫీసులో అమాయకంగా ఉండే నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. తను కూడా తొలిసారి కోపంలో ఉన్నప్పుడు నన్ను కలిసింది. అంతేకాదు తను చెప్పిన పని ఎవరో చేయకపోతే నన్ను బాగా తిట్టింది. అయితే అది నేను కాదని తర్వాత తెలుసుకుని నాకు సారీ చెప్పింది. అలా మా ఇద్దరికి తొలిసారి పరిచయం జరిగింది.

తనకు పడిపోయాను..
అయితే తను పరిచయం కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి కళ్లు కళ్లు కలిశాయి.. తర్వాత మాటలు కలిశాయి.. ఆ తర్వాత అందరిలాగే మేమిద్దరం కూడా వీకెండ్స్ కు పార్టీలకు, పబ్ లకు, సినిమాలకు, పార్కులకు వెళ్లి ఎంజాయ్ చేసేవాళ్లం. అలా మేమిద్దరం ప్రేమలో మునిగిపోయి మా రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేశాం.

సడెన్ గా నాకు..
అయితే సడెన్ గా నాకు పెద్ద కంపెనీ నుండి మంచి ఆఫర్ వస్తే.. నేను యుఎస్ కు వెళ్లాల్సి వచ్చింది. నేను తనతో కొన్నిరోజుల్లో ఇండియాకు తిరిగొచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయాను. అయితే మేమిద్దరం నిత్యం ఫోన్ లో మా రిలేషన్ ను కొనసాగించే వాళ్లం.

బలవంతపు పెళ్లి..
అయితే వాళ్ల అమ్మ,నాన్న మాత్రం తనకు బలవంతంగా ఇంకో వ్యక్తితో పెళ్లి జరిపించేశారు. తనకు ఆ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. అలాగే కాపురం చేస్తుండేది. దీంతో మా ఇద్దరికీ సహజంగానే దూరం పెరిగిపోయింది. దీంతో నేను సుమారు సంవత్సరం పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.

ఇప్పుడిప్పుడే..
తనతో గడిపిన క్షణాల నుండి నెమ్మదిగా బయటపడుతూ.. ఇప్పుడిప్పుడే సాధారణ జీవితం గడుపుతున్నాను. అయితే తను సరిగ్గా లాక్ డౌన్ టైమ్ లో ఫోన్ చేసింది. నేను నిన్ను కాదని.. మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు చాలా ఫీలవుతున్నానని.. మళ్లీ నన్ను కలవాలని చెబుతోంది.

మా ఇంట్లో ఒప్పుకోరు..
తను అలా చెబుతుంటే.. నాకు ఒకే కానీ.. తనకు పెళ్లయ్యిందని.. తను ఇప్పుడు వేరొకరికి భార్య.. అంతేకాదు ఓ బిడ్డకు కూడా తల్లి. కాబట్టి మా ఇంట్లో తనను కలవడానికి అస్సలు ఒప్పుకోరు. ఇంకా తనను పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓకే చెప్పరు. అయితే తనను బాధపెట్టడం నాకిష్టం లేదు. తనకు ఆ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను నో అంటే తను చాలా ఫీలవుతుంది. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. నాకేదైనా సలహా ఇవ్వండి' అని ఓ యువకుడు తన సమస్యను చెప్పుకున్నాడు.

ఫ్యామిలీని ఒప్పించాలి..
ముందుగా మీరు ఆమెను ఎలా ఒప్పిస్తారనే దానికన్నా.. మీ కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఈ రిలేషన్ షిప్ కొనసాగేలా చేయాలని మీరు భావించడం చాలా సులభం. అయితే ఆమె తన పెళ్లి బంధాన్ని విడిచిపెట్టి.. తన బేబీతో కలిసి లేదా ఒంటరిగా బయటికి రాకపోతే మీ ప్రయత్నం, ఆలోచనలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని గుర్తుంచుకోండి.

డెసిషన్ ఈజీ కాదు..
ప్రస్తుతం ఉన్న సమాజంలో పరిస్థితులను బట్టి భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు గానీ.. తను గానీ ఏదైనా బలమైన నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు.

మళ్లీ పెళ్లి గురించి..
ముందు మీ ఇద్దరి మధ్య రెగ్యులర్ లైఫ్ లాగా రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటాయో తెలుసుకోవడం మంచిది. అక్కడ కూడా ఆమెనే ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఆమె మళ్లీ పెళ్లి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో.. మీ నిర్ణయానికి అనుకూలంగా తను అడుగులు వేయడానికి రెడీగా ఉంటే.. అప్పుడు మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడటం, మీ లైఫ్ స్టైల్ లో ఛేంజేస్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు.



Click it and Unblock the Notifications
