For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే.. ఎలాంటి వ్యక్తులనైనా మీరు సులభంగా అట్రాక్ట్ చేయొచ్చు...

మీకు నచ్చిన వారిని ఆకట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలో చేయాలో ఇప్పుడే తెలుసుకోండి.

|

మనలో చాలా మందికి అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిలు కనిపిస్తే చాలు వారితో ఎలాగైనా పరిచయం చేసుకోవాలని.. ఏదో ఒక వంక బెట్టుకుని మాట్లాడాలని అనుకుంటూ ఉంటాం..

How To Be Mysterious To Attract People in Telugu

ఆ తర్వాత వారిని ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే అలా మీకు నచ్చిన వ్యక్తులను మీరు ఆకర్షించాలంటే.. ముందుగా పరిస్థితులను గమనించాలట. అలాంటి సందర్భాల్లో మాత్రమే మీకు నచ్చిన వ్యక్తులను సులభంగా ఆకర్షించేందుకు అవకాశం దక్కుతుందట.

How To Be Mysterious To Attract People in Telugu

అయితే కొందరు వ్యక్తులు తమకు నచ్చిన వ్యక్తులను ఆకట్టుకునేందుకు రహస్యంగా ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వాటిలో సక్సెస్ సాధించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

Dhanush Divorce:కపుల్స్ మధ్య విడిపోయేంత దూరం పెరిగేందుకు ప్రధాన కారణాలేంటో తెలుసా...Dhanush Divorce:కపుల్స్ మధ్య విడిపోయేంత దూరం పెరిగేందుకు ప్రధాన కారణాలేంటో తెలుసా...

ఎక్కువ టైం చూడొద్దు..

ఎక్కువ టైం చూడొద్దు..

మీ మనసుకు నచ్చిన వ్యక్తి కనిపించినప్పుడు.. వారిని మిమ్మల్ని ఆకర్షించాలంటే.. మీరు మీ కంటి చూపుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడే మీరు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. అయితే మీరు మీకు ఆకర్షించాలనే వ్యక్తుల కళ్లలోకి ఎక్కువ టైం చూడకూడదు. కేవలం చూసీ చూడనట్టు రెండు లేదా మూడు సెకన్ల పాటు మాత్రమే చూస్తే సరిపోతుందట. ఎందుకంటే ఎక్కువసేపు మీరు అదే పనిగా చూస్తే.. మీరెవరో తెలియదు కాబట్టి వారు అనుమాన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

మాట్లాడే ఛాన్సొస్తే..

మాట్లాడే ఛాన్సొస్తే..

కొందరు వ్యక్తులకు తొలిచూపులోనే కలుసుకుని మాట్లాడే ఛాన్స్ వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు వారితో చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. మీరు మాట్లాడే సమయంలో వారిని కింద నుండి పైకి.. పై నుండి కింద వరకు స్కాన్ చేస్తూ మాట్లాడటం వంటివి చేయరాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వారు ఇబ్బందిగా ఫీలవుతారు. మీరు వారిని ఆకట్టుకునేందుకు తెలివిగా మాట్లాడాలి. వీలైతే కొంచెం చమత్కారం జోడించొచ్చు. అయితే అది చిరాకు తెప్పించేలా ఉండకూడదు.

మీ గురించి తెలియాలంటే..

మీ గురించి తెలియాలంటే..

మీరు వారితో మాట్లాడేటప్పుడు మంచి బాడీ లాంగ్వేజ్ మెయింటేయిన్ చేయాలి. ముఖ్యంగా మీరు వారితో మాట్లాడుతున్న సమయంలో మీకు చాలా విషయాలు తెలుసనే ఫీలింగ్ ఎదుటివ్యక్తిలో కలగాలి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ పేపర్ చదవాలి. కొన్ని పుస్తకాలు చదవడం కూడా అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఏకాగ్రత పెంచే విషయాలపై ఫోకస్ పెట్టాలి.

కరోనా కాలంలో ఆ కార్యానికి కండోమ్స్ కోరుకోవట్లేదట...!కరోనా కాలంలో ఆ కార్యానికి కండోమ్స్ కోరుకోవట్లేదట...!

శ్రద్ధ చూపుతున్నారని..

శ్రద్ధ చూపుతున్నారని..

మీకు నచ్చిన వ్యక్తి కదా అని వారు మీకు ఏది చెప్పినా అన్నింటికీ ఓకే చెప్పడం కూడా సబబు కాదు. మీరు కూడా కొన్ని క్వొశ్చన్స్ వేయాలి. అది మిమ్మల్ని రహస్యంగా మరియు అట్రాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. మీరు వారిపై శ్రద్ధ చూపిస్తున్నారని.. తెలిసేందుకు వారికి చాలా విషయాల్లో గౌరవం ఇవ్వండి. ముఖ్యంగా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. అదే సమయంలో మీ పర్సనల్ వివరాలను షేర్ చేసుకోవద్దు. మీరు వారిపై ఆసక్తి చూపుతున్నట్లు మాత్రం తెలిసేలా చేయండి.

కూల్ గా ఉండాలి..

కూల్ గా ఉండాలి..

మీకు నచ్చిన వ్యక్తిని ఆకట్టుకోవడానికి అన్నింటి కంటే ముందుగా మీరు చాలా కూల్ గా ఉండాలి.. మీరు ఎంత కూల్ గా సిచ్యువేషన్ ను హ్యాండిల్ చేస్తారో.. అంత ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అంతేకాదు.. అవసరానికి మించి మాట్లాడటం వంటివి చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు ఎదుటి వ్యక్తులను సులభంగా అట్రాక్ట్ చేయొచ్చు.

బాధ్యతగా ఉండాలి..

బాధ్యతగా ఉండాలి..

మీరు ఎవరైనా నిజంగా నచ్చితే.. మీరు నిత్యం వారి వెంట పడాల్సిన అవసరం లేదు. వారు వెళ్లే ప్రతి ఒక్క ప్లేసుకు వెళ్లడం.. నిత్యం వారినే ఫాలో కావడం వంటివి చేస్తే.. వారు భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ క్రేజీగా కాకుండా సింపుల్ గా ఉండాలి. ఎందుకంటే పనీ పాట వదిలేసి తమ వెనుకే తిరిగేవారిని ఎవ్వరూ ఇష్టపడరు. అందుకే బాధ్యతగా ఉంటూ తమ పని తాము చేసుకునే వారిని ఎవ్వరైనా ఇష్టపడతారు.

కాంప్లిమెంట్స్..

కాంప్లిమెంట్స్..

మీకు నచ్చిన వ్యక్తులకు కాంప్లిమెంట్స్ ఇచ్చే అవకాశం దొరికితే.. అలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అందుకోసం మీరు పెద్ద పెద్ద కవితలు రాయాల్సిన పని లేదు. మీరు మనస్ఫూర్తిగా అభినందనలు చెబితే చాలు.. మీ అభినందనలు వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా ఉండాలి. మీరిచ్చే కాంప్లిమెంట్స్ ఎంత సిన్సియర్ గా ఉండాలి. మీరు వారి వ్యక్తిత్వాన్ని, అందాన్ని, వారిలో గమనించిన లక్షణాలను ప్రశంసిస్తే చాలు.. వారికి మీపై మంచి అభిప్రాయం కలిగేలా చేసేస్తుంది.

FAQ's
  • ఎదుటి వ్యక్తులను ఆకర్షించేందుకు ఎంత సమయం చూడాలి?

    మీకు ఎవరైనా నచ్చితే.. వారిని ఎక్కువసేపు చూడకూడదట. కేవలం రెండు లేదా మూడు సెకన్లు మాత్రమే చూడాలట. ఎందుకంటే వారెవరో తెలియకుండా ఎక్కువ సమయం చూస్తే వారు భయపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

English summary

How To Be Mysterious To Attract People in Telugu

Here we are discussing about the how to be mysterious to attract people in Telugu. Have a look
Story first published:Saturday, January 22, 2022, 14:46 [IST]
Desktop Bottom Promotion