Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
కోపం, బాధ, ఆక్రోశం.. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటేనే బంధం బాగుండేది
దాంపత్య బంధంలో కోపం, బాధ, దుఃఖం, భయం లాంటి భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. కోపం, బాధ, ప్రేమ, ఆవేశం, ఆనందం, ఆశ్చర్యం, భయం ఇవన్నీ భావోద్వేగాలు. సందర్భాన్ని బట్టి మనం ఫీలయ్యే దానిని బట్టి ఈ ఎమోషన్స్ వస్తుంటాయి. అయితే ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకున్నప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య బంధంలో ఉన్న వాళ్లు ఎమోషన్స్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని చెబుతారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. కోపమైనా, బాధ అయినా, ఆవేశమైనా, ప్రేమ అయినా అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం తెలిసిన వారే దాంపత్య బంధంలో కలకాలం సంతోషంగా ఉండగలరని చెబుతారు నిపుణులు.

ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కీలకం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు వాటిని ప్రభావవంతంగా వాడుకోవడం. ఏ సమయంలో ఎంత వరకు భావోద్వేగాన్ని ప్రదర్శించాలో తెలుసుకోవడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే దానిని భాగస్వామిపై చూపించడం వల్ల వారు బాధపడొచ్చు. ఆవేశంలో అనే మాటలు మనస్సుకు గాయం చేస్తాయి. అది బంధాన్ని బీటలు వారుస్తుంది.
దాంపత్య బంధంలో కోపం, బాధ, దుఃఖం, భయం లాంటి భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పర్యావసానాలు అంచనా వేయడం
భావోద్వేగాలు ప్రతి మనిషిలో ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకున్న వారే జీవితంలో విజయం సాధిస్తారు. ఏ ఎమోషన్ అయినా ప్రదర్శించే ముందు దాని పర్యావసానాలు ఎలా ఉంటాయో అంచనా వేయగలగాలి. అవి మీకు చెడు చేస్తే అలాంటి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపు చేయడం కష్టంగా ఉండొచ్చు. కానీ అసాధ్యం కాదు.

2. భావోద్వేగాలను విశ్లేషించుకోవాలి
మీ భావోద్వేగానికి కారణం ఏమిటో అర్థం చేసువాలి. దాని గురించి అంతగా ఎందుకు ఎమోషన్ అవుతున్నారో తెలుసుకోవాలి. మీ ప్రవర్తన ఎలా ఉండుబోతుందో అంచనా వేసి దాని వల్ల మీరు గిల్టీగా ఫీలవుతారా అనేది గుర్తించాలి.

3. ఎలాంటి భాష వాడుతున్నారో గుర్తించండి
కోపాన్ని నియంత్రించుకోవడం దాని గురించి చెప్పుకున్నంత సులభం కాదు. కోపం లాంటి భావోద్వేగంతో పాటు మాటలు కూడా మారుతాయి. ఆవేశంలో ఏవేవో అనేస్తుంటాం. ఆ ఆవేశం తగ్గిన తర్వాత అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, అలాంటి భాష వాడాల్సింది కాదు అనుకుని బాధపడతారు చాలా మంది. అందుకే ఎలాంటి భాష వాడుతున్నారో గమనించుకోవాలి.

4. సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి
ఎమోషనల్‌గా ఉన్నప్పుడు అరుస్తుంటారు చాలా మంది. వితండవాదానికి దిగుతారు. వాటి వల్ల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మీ ఫీలింగ్స్‌ను చెప్పడానికి మంచి భాషను ఎంచుకోవాలి. అది కూడా మృదువుగా ఉండేలా చూసుకోవాలి.

5. కోపం వస్తే దూరంగా వెళ్లండి
కోపంలో ఆవేశంలో అనరాని మాటలు అనడానికి బదులు దూరంగా వెళ్లండి. ఒకసారి మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోలేం. నోటి నుండి వచ్చిన మాటలు ఎదుటివారి మనస్సుకు తీవ్ర గాయాన్ని చేస్తాయి. కోపంలో ఉన్నప్పుడు అక్కడ ఉండటం కంటే దూరంగా వెళ్లడం మంచిది.

6. క్షమించండి, క్షమించమని అడగండి
బాధను భరించలేక చాలా మంది కోపంగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన వల్ల ఎదుటివారు బాధపడితే క్షమించమని అడగండి. అలాగే మీ భాగస్వామి మీ బాధకు కారణమై వారు మిమ్మల్ని సారీ అడిగితే స్వాగతించండి.



Click it and Unblock the Notifications