For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కార్యాన్ని ఆస్వాదించాలంటే.. అది పక్కన పెట్టాల్సిందే...!

|

యవ్వనంలో ఉండే ప్రతి ఒక్కరికీ శృంగారం అనేది ఒక అందమైన అనుభూతి. కపుల్స్ ను ఆనంద సాగరంలో ముంచేసే ఓ అద్భుతమైన ఫీలింగ్. అయితే పెళ్లైన కొత్తలో ఆ కార్యంలో పాల్గొనేందుకు చాలా మంది సిగ్గు పడుతూ ఉంటారు.

తొలిసారి రొమాన్స్ చేసేటప్పుడు కూడా ఆడవారు లేదా మగాళ్లు కొంత భయపడటం లేదా మోహమాటపడటం వంటివి చేస్తూ ఉంటారు. దీంతో ఆ కార్యాన్ని ఆనందంగా ఆస్వాదించలేకపోతారు.

దీంతో మీ ఇద్దరికీ లైంగిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరికొంతమంది అయితే అసలు శృంగారం గురించి బయటికి అస్సలు మాట్లాడరు. అంతేకాదు తమ కోరికలు, ఇష్టాలను కనీసం బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడరు. దీనంతటికీ ప్రధాన కారణం సిగ్గేనని పలు అధ్యయనాల్లో తేలింది.

దీని వల్ల ఆ కార్యాన్ని ఆస్వాదించడానికి అడ్డుగా మారే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా శృంగారంలో ఎంజాయ్ చేసేందుకు సిగ్గు వంటి వాటిని ఎలా అధిగమించాలో.. నిపుణులు ఎలాంటి సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

'తన భర్త తాగితే మన్మథుడిలా మారిపోతాడంట.. ఇతర స్త్రీలతోనూ...'

బాగా ఇష్టపడతారట..

బాగా ఇష్టపడతారట..

ఈ సమాజంలో పొగడ్తలు అంటే ఇష్టపడని ఎవరుంటారు చెప్పండి. ఆడవారైనా.. మగవారినైనా పొగిడితే బాగా ఉబ్బితబ్బిబ్బవుతారు. అదే విధంగా ఫ్లర్టింగ్ కూడా రిలేషన్ షిప్ లో మంచిదేనట. కానీ చాలా మంది దీన్ని తప్పుగా భావిస్తారు. కానీ దీని వల్ల మంచి ఎనర్జీ వస్తుందట. చాలా మంది పురుషులు, స్త్రీలు ఫ్లర్టింగును బాగా ఇష్టపడతారట.

రొమాంటిక్ నోట్..

రొమాంటిక్ నోట్..

రొమాన్స్ చేసే సమయంలో పడకగదిలో మీకు ఎలాంటి పనులంటే ఇష్టం.. ఎలాంటి యాంగిల్స్ అంటే ఇష్టమో ఫ్లర్టింగ్ ద్వారా మీ పార్ట్ నర్ కు తెలియజేయాలట. అయితే కేవలం బెడ్ రూమ్ లోనే కాకుండా.. మీరు ఈ విషయం గురించి ఎక్కడైనా.. ఎలాగైనా చెప్పొచ్చట. ముఖ్యంగా కబుర్లతో ఇలాంటి వాటిని స్టార్ట్ చేయొచ్చట. మీరు ఇన్ డైరెక్టుగా లేదంటే డబుల్ మీనింగ్ డైలాగులతో కూడా ఆ కార్యాన్ని ఆస్వాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సెక్సీ డ్రస్..

సెక్సీ డ్రస్..

మీకు ఆ కార్యంలో పాల్గొనాలని మూడ్ వస్తుంటే.. మీరు ఆ విషయాన్ని మీ పార్ట్ నర్ కు చెప్పడానికి సిగ్గు పడుతున్నారా? అయితే మీరు మీ పార్ట్ నర్ దగ్గర సెక్సీ డ్రస్ వేసుకుని నిలబడండి చాలు. మీ మనసులో ఉన్న కోరికల గురించి తనకు ఇట్టే అర్థమవుతుంది. ఆ తర్వాత వద్దన్నా మీ వెనకాలే వచ్చేస్తారు. మీరు కోరుకున్న విధంగా ప్రవర్తిస్తారు.

ప్రతి ఒక్కరూ ఇలాంటి వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటారట...!

మూడ్ మార్చడానికి..

మూడ్ మార్చడానికి..

ప్రస్తుత బిజీ ప్రపంచంలో మీ పార్ట్ నర్ ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి ఒత్తిడిలో ఉంటే మీరు, తను ఆ కార్యంలో ఎంజాయ్ చేయలేరు. అలాంటి సమయంలో ముందుగా మీరు వారి మూడ్ ను మార్చేందుకు ప్రయత్నించాలి. వారి ఒత్తిడిని తగ్గించేందుకు మీ పడకగదిని అందంగా అలంకరించాలి. మీ బెడ్ రూమ్ లో మంచి సువాసన వచ్చేలా మంచి స్ప్రేలను వెదజల్లాలి. అప్పుడు మీ పార్ట్ నర్ కి ఆటోమేటిక్ గా రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుంది.

నేరుగా అడగలేరు..

నేరుగా అడగలేరు..

ఆడవారి విషయానికొస్తే... చాలా మంది స్త్రీలు తమ కోరికలను నేరుగా బయటపెట్టలేరు. ఆ కార్యం గురించి ఎక్కువగా సిగ్గు పడుతూ ఉంటారు. అయితే అమ్మాయిలు తమకు కావాల్సిన విషయాలను భాగస్వామిని అడగడంలో ఎలాంటి తప్పు లేదన్న విషయాన్ని గుర్తించాలి. మీ పార్ట్ నర్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ మీరు ఆ కార్యంలో పాల్గొనడానికి.. మీకు కావాల్సింది అడగడంలో ఎలాంటి తప్పు లేదని నిపుణులు సూచిస్తున్నారు.

బహుమతులు ఇస్తే..

బహుమతులు ఇస్తే..

పెళ్లైన కొత్తలో లేదా ప్రేమించుకునే రోజుల్లో మీ భాగస్వామికి తరచూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటే.. వారు ఆశ్చర్యపోవడమే కాదు.. సిగ్గు పడటాన్ని కూడా మరచిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా తనతో ఫోన్లో టచ్ లో ఉండండి. ముఖ్యంగా పీరియడ్స్ వచ్చినప్పుడు తనకు కాస్త విశ్రాంతి ఇవ్వండి. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకోండి.

English summary

How to Stop Being Shy in a Relationship in Telugu

Here we are talking about the how to stop being shy in a relationship in Telugu. Have a look
Story first published: Friday, June 11, 2021, 13:00 [IST]