For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెండ్స్ గా ఉండే వారు ప్రేమికులుగా మారే సందర్భాలివే...!

మీ ఫ్రెండ్ షిప్ ప్రేమగా ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంది. ఇలాంటి మధురమైన ప్రేమ అనుభూతిని పొందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అలాంటి ప్రేమ ఎప్పుడు పుడుతుందో.. ఎక్కడ పుడుతుందో.. ఎవ్వరికీ తెలియదు.

How to Turn Friendship Into Love in Telugu

కొందరికి తొలి చూపులోనే ప్రేమ పుడితే.. మరి కొందరికి ఆలస్యంగా పుడుతుంది. అయితే ఒక స్త్రీ, పురుషుడి మధ్య ప్రేమ స్నేహం ద్వారా కూడా స్టార్టవుతుంది. అందుకే చాలా మంది ప్రేమకు తొలి మెట్టు స్నేహం అంటూ ఉంటారు.

How to Turn Friendship Into Love in Telugu

ఎందుకంటే ఫ్రెండ్ షిప్ లో ఉండే బాయ్స్ అండ్ గర్ల్స్ తమను తాము బాగా అర్థం చేసుకుంటారు. వారు స్నేహంలో ఉన్నప్పుడు వారి అభిప్రాయాలు, ఆలోచనలు, అభిరుచులు ఒకటైతే చాలు అది ప్రేమ వరకు సాగుతుంది. ఆ తర్వాత పరిణయం దాకా అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా ఫ్రెండ్ షిప్ నుండి ప్రేమకు రూట్ ను ఎలా వేసుకుంటారు? ఎలాంటి సందర్భాల్లో స్నేహం నుండి ప్రేమకు దారి తీస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కారులో నా గర్ల్ ఫ్రెండ్ తో ఆ కార్యంలో ఉండగా.. అప్పుడే అమ్మనాన్న ఎంట్రీ...కారులో నా గర్ల్ ఫ్రెండ్ తో ఆ కార్యంలో ఉండగా.. అప్పుడే అమ్మనాన్న ఎంట్రీ...

ఒకేలా ఉంటే..

ఒకేలా ఉంటే..

ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్నప్పుడు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి నమ్మకం ఉంటుంది. దీంతో వారు అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తాము ఉన్నామనే భరోసా ఇస్తుంటారు. అలాంటి ఫ్రెండ్ షిప్ లో ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒకేలా ఉంటే అది ప్రేమగా మారేందుకు అవకాశం ఉంటుంది.

అయోమయంలో

అయోమయంలో

అయితే కొందరు ఫ్రెండ్ షిప్ లో ఉన్నప్పుడు వారి మధ్య ప్రేమ చిగురిస్తే.. ఆ విషయం గురించి వారు చాలా మంది అయోమయంలో పడిపోతారు. తమ ప్రేమ గురించి ప్రేయసికి లేదా ప్రియుడికి చెప్పేందుకు చాలా సందేహిస్తారు. దీంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్పా లేదా లవ్ అనే విషయంలో అయోమయానికి గురవుతారు.

మీరిద్దరే వెళితే..

మీరిద్దరే వెళితే..

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. అందులో అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఉంటారు. అప్పుడప్పుడు అందరూ కలిసి ఏదైనా టూర్ కు వెళ్లడం లేదా ఏదైనా ఇతర వేడుకలు, కార్యక్రమాలకు కలిసి వెళ్తుంటారు. అయితే అలాంటి సమయంలో మీరు వారితో కాకుండా కేవలం మీరిద్దరూ మాత్రమే అలా కలిసి వెళితే అది ప్రేమ సంకేతంగా చెప్పొచ్చు.

మీ పార్ట్నర్ పడకగదిలో ఇలా చేస్తున్నారా? అయితే మీతో రతిక్రీడలో రెచ్చిపోతున్నట్టే...!మీ పార్ట్నర్ పడకగదిలో ఇలా చేస్తున్నారా? అయితే మీతో రతిక్రీడలో రెచ్చిపోతున్నట్టే...!

అనునిత్యం వారి ఆలోచనలు..

అనునిత్యం వారి ఆలోచనలు..

ఫ్రెండ్ షిప్ నుండి లవ్ ట్రాక్ లో వెళ్లాక.. అనునిత్యం వారి గురించే ఆలోచనలు వస్తుంటాయి. అందుకే ఎలాంటి సందర్భం లేకపోయినా తమ ప్రియుడిని లేదా ప్రియురాలిని కలవాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా పార్కుకి వెళ్లినప్పుడు అక్కడ ప్రేమ పావురాలను చూసినప్పుడు మీరు సిగ్గు పడటం ప్రారంభిస్తే.. మీ మధ్య కూడా ప్రేమ ఉన్నట్లుగా భావిస్తారు.

ఎదుటి వ్యక్తి మనసులో..

ఎదుటి వ్యక్తి మనసులో..

ఫ్రెండ్ షిప్ లో నుండి లవ్ ట్రాక్ లోకి మారాడానికి చాలా మంది సంకోచిస్తారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మనసులో ఏముందోనని.. తమ ప్రేమ విషయం చెబితే.. వారి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఎక్కడ చెడిపోతుందో అని భయపడతారు. అందుకే తమ మదిలో ప్రేమ విషయం గురించి చెప్పడానికి తెగ మదనపడిపోతూ ఉంటారు. అయితే ఒక్కసారి ధైర్యం చేసి ఆ విషయం చెప్పాక.. చాలా హ్యాపీగా ఫీలవుతారు. తమ ప్రియుడు లేదా ప్రియురాలి నుండి ప్రేమకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభిస్తే వారి ఆనందానికి అవధులు అనేవే ఉండవు.

ప్రేమను తెలిపేందుకు..

ప్రేమను తెలిపేందుకు..

మీరు ఇప్పటిదాకా మంచి ఫ్రెండ్ షిప్ లో ఉన్నారు కాబట్టి.. వారికి ఎలాంటి విషయాలు నచ్చుతాయి.. ఎలాంటి విషయాలు నచ్చవు అనేది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి వారు మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు మీరు మీ మనసులోని మాటను చెబితే వారు మీ ప్రేమను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమ బంధంగా మారిపోతుంది.

English summary

How to Turn Friendship Into Love in Telugu

Here we are talking about the how to turn friendship into love in Telugu. Have a look
Story first published:Tuesday, November 9, 2021, 13:26 [IST]
Desktop Bottom Promotion