For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశి పురుషులు ఆ విషయంలో చాలా స్మార్ట్ ... మీ రాశి కూడా ఈ లిస్ట్ లో ఉందేమో చూసెయ్యండి...!

|

మాములుగా ఏదైనా విషయం గురించి గాసిప్స్ చేయాలంటే అందులో ముందు మహిళలే ఎక్కువగా ఉంటారు. అయితే కాలంలో మార్పుల కారణంగా.. కొందరు పురుషులకు కూడా ఇలాంటి నైపుణ్యం పెరిగినట్లు స్పష్టమైంది.

ముఖ్యంగా శృంగార సంబంధిత విషయాల్లో చాలా మంది మగవారు గోరంత విషయాన్ని కొండంతగా మార్చి చెబుతుంటారట. ఇక వారి లవ్ స్టోరీల గురించి చెప్పేటప్పుడు వారికి అసలు హద్దులు అనేవే ఉండవట.

కొందరు మగవారు శృంగార ఫాంటసీల గురించి తమ ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చి మరీ తమ గురించి కథలు కథలుగా చెబుతూ.. తమ విషయాలను అందరితో షేర్ చేసుకుంటారట. సాధారణ సమయాల్లో బయటకు చెప్పకూడని విషయాలను కూడా అందరితో ప్రస్తావించడం వంటివి చేస్తుంటారట.

ఇక అమ్మాయిలతో అయితే వారికెవరైనా నచ్చితే చాలు వారి మనసును గెలుచునేంత వరకు లేదా వారిని ఆకట్టుకునేందుకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అస్సలు పట్టించుకోరట. ఇంతకీ అలాంటి పురుషులను ఎలా కనిపెట్టాలి... ఏయే పురుషులకు అలాంటి లక్షణాలు ఉంటాయో కనిపెట్టేందుకు మీకు జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతోంది. దీని ప్రకారం ఈ రాశి చక్రాల పురుషులంతా ఇలాంటి విషయాల్లో చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తారంట. ఇంకెందుకు ఆలస్యం ఆ రాశి చక్రాల మగవారెవరో చూసెయ్యండి మరి...

వీడు మాములోడు కాదండోయ్... ఏకంగా 150 మందిని తల్లుల్ని చేసేశాడు...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి పురుషులు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. వీరు కొత్త వ్యక్తులను కలవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ఇతరులు ఏమి ఇష్టపడుతున్నారో.. వారి చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. శృంగార సంబంధాల విషయంలో వీరు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. ఎందుకంటే వీరికి తమ భాగస్వాములను ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలుసు. అంతేకాదు వీరు ఎవరినైనా ఇష్టపడితే, వారి కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఇష్టపడతారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి పురుషులు మంచి మాటకారులు. వీరు ఇతరుల మనసులోకి చొచ్చుకెళ్లేందుకు సహజంగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను ఆకట్టుకునేందుకు కొన్ని చమత్కారమైన మాటలను మాటలను మాట్లాడతారు. ఇక శృంగారం వంటి వ్యవహారాల్లో వీరు దూకుడుగా వ్యవహరించకపోయినప్పటికీ, వీరు ఆ విషయంలో చాలా ఆసక్తితో ఉంటారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశిచక్రం పురుషులు ఏ విషయంలో చాలా శ్రద్ధ గలవారు. వీరికి ఏ పనిని ఎలా ముగించాలో బాగా తెలుసు. వీరు అపారమైన విశ్వాసం మరియు ఆత్మగౌరవంతో జీవిస్తారు. ఇక శృంగార విషయానికొస్తే వీరు చాలా ఆసక్తికరంగా వ్యవహరిస్తారు. తమ కోసమే ఇతరులు బలవంతం చేసేలా ప్రవర్తిస్తారు. ఇందు కోసం వీరు ఎదుటి వారితో ముందుగా ముచ్చట్లు ప్రారంభిస్తారు. అయితే వీరు చెప్పే మాటల్లో నిజాలు ఉండచ్చు. ఉండకపోవచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి పురుషులు ధైర్య, సాహసాలు గలవారు. వీరు కొత్త ప్రదేశాలు మరియు దూర ప్రయాణాలు చేయడం వంటి వాటిని ఇష్టపడతారు. ఇక శృంగార కథల విషయానికొస్తే.. వీరు శృంగారంలోనూ సాహసం చేయడాన్ని బాగా ఇష్టపడతారు. వీరు ఇతరులతో మాట్లాడే మాటల్లో కొంతవరకు నిజం ఉండొచ్చు. వీరి మాటల్లో నాటకీయత ఎక్కువగా ఉంటుంది.

ఈ రాశి స్త్రీలు బ్యాడ్ బాయ్స్ తోనే బాగా ఎంజాయ్ చేస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి పురుషులకు మేధస్సు ఎక్కువగా ఉంటుంది. వీరు వాస్తవాలను ఆధారంగా చేసుకుని మాట్లాడతారు. అందుకే వీరి మాటలు ఇతరులకు ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తాయి. ఎందుకంటే వీరు చాలా లోతుగా మరియు ఆలోచించదగిన మాటలనే మాట్లాడతారు. ఈ రాశికి చెందిన పురుషులు చాలా స్వతంత్రంగా మరియు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. అందువల్ల వీరి కథలు చాలా వరకు స్వయం సిద్ధంగా కనిపిస్తాయి. అందుకే వీరు ఆ విషయంలో కూడా చాలా స్పీడుగా వ్యవహరిస్తారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశికి చెందిన పురుషులు సంబంధాల విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తారు. అయితే వీరు అధిక ఉత్సాహంతో ఆ కార్యంలో పాల్గొనడం వల్ల కొన్నిసార్లు హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీరు తమ మనసును ఎవరితోనైనా పోగొట్టుకునే అవకాశం వచ్చినప్పుడు, ఎలాంటి అహంకారం మరియు పక్షపాతం లేకుండా, వారు ఉత్తమమైన కథలను వివరిస్తారు. వారికి కావాల్సింది సాధించుకుంటారు.

English summary

Men of these zodiac signs love to flaunt their romantic prowess

Here we are talking about the Men of these zodiac signs love to flaunt their romantic prowess. Read on.
Story first published: Saturday, October 17, 2020, 14:17 [IST]