Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
వైరల్ వీడియో : లాక్ డౌన్ వేళ లవర్స్ ను పరుగులు పెట్టించిన డ్రోన్ కెమెరా... మీరు ఓ లుక్కేయండి...
తమిళనాడులోని ఓ జంట మాత్రం ఎవ్వరికీ తెలీకుండా ఓ పల్లెటూల్లో చెట్ల కింద రొమాన్స్ చేసుకుందామని ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్టుగానే బైక్ పై అందరినీ తప్పించుకుని చెట్ల కిందకు చేరుకున్నారు.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఎన్నో దేశాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఈ కరోనా భూతం సోకిన వారి కంటే మిగతా వారినే చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధి సోకిన వారు తాము ఎలాగైనా బతకాలని క్వారంటైన్ లో పోరాటాలు చేస్తుంటే.. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలంతా కడుపు నిండా తిండి కోసం అలమటిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వివాహేతర సంబంధాలు కొనసాగించే వారిని, ప్రేమికులను కూడా ఈ కరోనా తెగ ఇబ్బంది పెడుతోంది.
అయితే ప్రేమికులు.. ఇతరులు ఈ కరోనా లాక్ డౌన్ వేళ ఇలాంటి వారికి ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా చాలు ఎంజాయ్ చేసేద్దామని తహతహలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ ప్రేమ జంట పోలీసుల కళ్లు గప్పి ఓ గ్రామంలోని చెట్ల కింద రొమాన్స్ చేసుకునేందుకు బైక్ పై బయలుదేరింది. అయితే పోలీసులు తెలివిగా డ్రోన్ కెమెరాను వారు ఉన్న చోటకు పంపారు.

అకస్మాత్తుగా దాన్ని షాకైన్ ఆ ప్రేమికులు ఒక్కసారిగా ముసుగులు వేసుకుని పరుగో పరుగు ప్రారంభించారు. తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుని బైక్ పై పరారయ్యారు. ఆ తర్వాత వారిని పోలీసులు పట్టుకున్నారా? లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అది ఆపుకోలేక అడ్డంగా బుక్..
ప్రస్తుతం కలియుగం కాస్త కరోనా కాలంగా మారిపోయింది. బతికుంటే బలుసాకు అయిన తిని బతకొచ్చు. అయితే కొందరు మాత్రం తమ కోరికలను ఆపుకోలేక పోలీసుల డ్రోన్ కెమెరాలకు అడ్డంగా బుక్కవుతన్నారు.

విరహ వేదనతో..
ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే.. వివాహేతర సంబంధంలో ఉన్న వారు మాత్రం విరహవేదనతో రగిలిపోతున్నారు. తమ భాగస్వామిని ఎలాగోలా కలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యం కావడం లేదు. అయితే

చెట్టు కింద రొమాన్స్..
అయితే తమిళనాడులోని ఓ ప్రేమ జంట మాత్రం పోలీసుల కళ్లు గప్పి ఎలాగోలా తప్పించుకున్నారు. ఓ గ్రామంలోని శివారు ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ అప్పుడే చెట్ల కింద కూర్చోని ముచ్చట్లు మొదలుపెట్టారు. అయితే వారి బ్యాడ్ టైమ్ వారిని డ్రోన్ కెమెరా రూపంలో వెంటాడింది.

అది చూడగానే..
ఆ ప్రేమికులిద్దరూ ఏకాంతంగా ముచ్చటించుకున్న వేళ.. అకస్మాత్తుగా వారి కళ్ల ముందు డ్రోన్ కెమెరా ప్రత్యక్షమైంది. అది చూడగానే వారిద్దరికీ ప్రాణం పోయినంత పనైంది. అంతే వెంటనే తమ ముఖాలకు ముసుగులు వేసుకుని, అక్కడి నుండి పరుగు పరుగున బైక్ ఎక్కి పారిపోయారు.

సోషల్ మీడియాలో..
ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచేందుకు పోలీసులు ముఖ్యంగా తమిళనాడు పోలీసులు భారీ సంఖ్యలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాల కూడా పెట్టేశారు. ఇది చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.

నెటిజన్ల ట్రోల్స్..
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తున్నారు. ‘తనివి తీరా తాపం తీర్చుకుందామనుకుంటే.. కెమెరాతో పట్టుకుని పోలీసులు వారి కోరికను తీర్చినట్టున్నారు‘ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘లాక్ డౌన్ వేళ లవ్ కష్టమే గురు‘ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు తమిళనాడు పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
