For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వార్థపూరిత వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా...

|

మనలో ప్రతి ఒక్కరిలో స్వార్థపూరిత ఆలోచనలు ఉంటాయి. మనతో ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో.. వెంటనే మనల్ని వదిలేసి వెళ్తుంటారు. ఆ తర్వాత ఎక్కడైనా కలిస్తే తామెవరో మాట్లాడకుండా నటిస్తారు..

అంతేకాదు.. తమను ఇంతకుముందెన్నడు చూడలేదన్నట్టు నటిస్తుంటారు. మరి కొందరైతే మనతో అవసరం తీరిపోతే.. మనతో మాట్లాడే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. ఇంకా కొందరు మనతో అవసరం ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటారు.. కొందరికి ఆదాయం పెరిగేకొద్దీ తమ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి.

వారిలో ఒకరి దుష్ట స్వభావం బయటపడి వారి స్వార్థం అందరికీ తెలిసిపోతుంది. మీరు ఒక స్వార్థపరుడిని ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు, అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది స్వార్థపరులు మొండి పట్టుదలగలవారు మరియు వారు కోరుకున్న దాని గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. వారు మీ జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు.

వారి అంచనాలకు అనుగుణంగా జీవించనందుకు మిమ్మల్ని చాలా బాధపెడతారు. వారితో మీరు కలిసి ఉండేందుకు చాలా కష్టపంగా మారుతుంది.. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలంటే వారిని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా మీరు ఏదైనా రిలేషన్లో అడుగుపెట్టేముందు స్వార్థపరుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. లేదంటే అంతే సంగతలు.. ఇంతకీ స్వార్థపరుల ప్రవర్తన ఎలా ఉంటుంది.. వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కొత్త ఏడాదిలో ఈ రొమాంటిక్ రిజల్యూషన్స్ మీ లైఫ్ ను మార్చేయొచ్చు...

వాగ్దానాలు పట్టించుకోరు..

వాగ్దానాలు పట్టించుకోరు..

చాలా మంది స్వార్థపరుల్లో ఇలాంటి లక్షణం కచ్చితంగా ఉంటుంది. ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచిస్తారో.. వారు తమ వాగ్దానాలను ఎప్పటికీ నిలబెట్టుకోరు. కొన్ని సందర్భాల్లో అడగకుండానే వరాల జల్లు కురిపిస్తారు. తప్పుడు వాగ్దానాలు కూడా చేస్తారు. ఇదంతా తమ పని పూర్తి చేయించుకోవడం కోసమే. ఆ సమయంలో వాగ్దానాలు నెరవేర్చడం కష్టమని వారికి కూడా అనిపించొచ్చు. అయితే మిమ్మల్ని బాగా బతిమాలి అయినా సరే వారి పని పూర్తి చేసుకుంటారు.. ఆ తర్వాత ఆఖరి క్షణంలో మిమ్మల్ని ఏదో ఒక సాకు వాగ్దానం నెరవేర్చకుండా తప్పించుకుంటారు.

తేలికగా తప్పించుకుంటారు..

తేలికగా తప్పించుకుంటారు..

స్వార్థపరుల ప్రధాన లక్షణాలలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వారు తమకు ప్రయోజనం కలిగించినప్పుడు వారు చెప్పిన దాని నుండి వెంటనే వెనక్కి తగ్గుతారు. చివరికి వారు చెప్పేది మరియు చేసేది పూర్తిగా భిన్నమైనది మరియు విరుద్ధంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

సపోర్ట్ చేయరు..

సపోర్ట్ చేయరు..

వారికి మీ సహాయం అవసరమైనప్పుడు, అస్సలు పట్టించుకోరు.. అదే వారికి మీ సహాయం అవసరమైతే మాత్రం.. మీ చుట్టూ తిరుగూతే.. మీరు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకునే వరకు వెంటబడతారు. అయితే మీకు సహాయం అవసరమైనప్పుడు, మీకు సహాయం చేయాలనే ఉద్దేశ్యం వారికి లేనందున వారు అదృశ్యమవుతారు. వారు మీ కోసం రాకుండా కల్లిబొల్లి కబుర్లు చెబుతుంటారు.

పెళ్లికి ముందే మీ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకోండి...!

సొంత ప్రయోజనాలే..

సొంత ప్రయోజనాలే..

స్వార్థపరులకు ఎల్లప్పుడూ సొంత ప్రయోజనాలే ముఖ్యం. వీరు మానసిక లేదా భావోద్వేగ సంబంధాల గురించి ఎప్పటికీ పట్టించుకోరు. వారు కొంత ప్రయోజనం చూసే వరకు వారు బలమైన బంధాన్ని ఏర్పరచుకోలేరు. ఒక వ్యక్తిలో వారు వెతుకుతున్నది వారి నుండి పొందగలరు. అప్పుడే, వారు సంబంధం లేదా స్నేహంలో పురోగమిస్తారు.

గొప్పలు చెప్పుకుంటూ..

గొప్పలు చెప్పుకుంటూ..

స్వార్థపరులు గొప్పగా చెప్పుకోవడాన్ని బాగా ఇష్టపడతారు. వారు విలాసవంతమైనవారు, అహంకారాన్ని ఇష్టపడేవారు మరియు దృష్టిని ఆకర్షించేవారు. వారు పార్టీ లేదా గదిలోకి ప్రవేశించినప్పుడల్లా, వారి దృష్టి అంతా తమపై ఉండాలని కోరుకుంటారు. ప్రపంచ దృష్టిని తమ నుండి ఇతరులపైకి మళ్లించడానికి వారు ఏదైనా చేస్తారు. ఇది మంచి వ్యక్తికి సంకేతం కాదు. మరింత అసూయగా ఉంటుంది.

అసూయ పడుతూ..

అసూయ పడుతూ..

తమ కంటే మెరుగ్గా రాణిస్తున్న వారిని చూసి చాలా అసూయపడతారు. వారిని ఎప్పుడెప్పుడు దొంగ దెబ్బ కొడదామా అని ఆలోచిస్తూ ఉంటారు. స్వార్థపరులు తమ కంటే మెరుగైన వారితో మరింత మొరటుగా ఉంటారు. కానీ వారు కష్టపడి పనిచేయడానికి లేదా బాధ్యతలను స్వీకరించడానికి ఏమీ చేయరు. వారు ఇతరులను మందలిస్తారు.

చూశారు కదా.. స్వార్థపరుల లక్షణాలు ఎంత దారుణంగా ఉంటాయో.. కాబట్టి మీరు కూడా ఎవరితో అయినా రిలేషన్ షిప్ కావాలని కోరుకుంటూ ఉంటుంటే.. వారిలో ఈ లక్షనాలు ఉన్నాయో లేదో గమనించండి.. ఆ తర్వాతే ముందడుగు వేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి.

English summary

Personality Traits of Selfish People in Telugu

Here are the personality traits of selfish people in Telugu. Have a look
Story first published: Tuesday, January 18, 2022, 14:22 [IST]