For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు తమ ఫీలింగ్స్ ను ఎందుకు రహస్యంగా ఉంచుతారో తెలుసా..

పురుషులు భావోద్వేగాలను వ్యక్తపరచడానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.

|

ఈ నృష్టిలో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ భావోద్వేగాలు సర్వసాధారణం. కానీ అది వ్యక్తపరిచే విధానం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అదే అమ్మాయిలు అయితే తమ భావాలను వెంటనే వ్యక్తం చేస్తారు. కానీ అబ్బాయిలు మాత్రం అలా చేయలేరు. ఎందుకంటే తమ భావాలను వ్యక్తపరచడం అనేది వారి బాల్యంలోనే వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇది అలవాటు అవుతుంది.

Reasons Why Men Hide Their Feelings

ఇంతకీ అమ్మాయిలు ఎందుకు వెంటనే తమ ఫీలింగ్స్ ను బటయపెట్టేస్తారు? పురుషులు ఎందుకు దాచుకుంటారో తెలుసా? దీని వల్ల చాలా మంది పురుషులు తమ ప్రియమైన వారితో సన్నిహిత సంబంధాన్ని కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సో ఈరోజు స్టోరీలో చాలా మంది పురుషులు తమ భావాలను దాచడానికి గల మానసిక కారణాలను తెలుసుకుందాం.

భావాలను అర్థం చేసుకోలేరు..

భావాలను అర్థం చేసుకోలేరు..

ప్రేమ విషయంలో పురుషులది ఎప్పటికీ చాలా క్లిష్టమైన పరిస్థితి. పురుషులకు ఏదైనా అర్థం కానప్పుడు వారు ఆ విషయం నుండి తప్పుకోవాలనే ఆలోచన లేదా దాచాలనే ఆలోచన సహజంగానే పురుషులకు వస్తుంది. అబ్బాయిలు తమ అనుభూతిని గ్రహించలేనప్పుడు వారి భావాలను దాచడం ప్రారంభిస్తారు. కానీ ఇలాంటి సమయాల్లో ఎక్కువగా అమ్మాయిల నుండి అబ్బాయిలు విడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారు తమ భావాలను అర్థం చేసుకోలేరు.

భావోద్వేగాలకు భయపడటం..

భావోద్వేగాలకు భయపడటం..

పురుషులు తమ భావాలను దాచడానికి మరొక కారణం వారు తమ భావోద్వేగాలకు భయపడటం. ఒక మనిషి తన భావాలను అర్థం చేసుకుంటాడు. కానీ వాటిని వ్యక్తపరచటానికి భయపడతాడు. మీ శరీరం మరియు మనస్సు ప్రేమలో పడటం ప్రారంభించినప్పుడు మరియు మీరు ఒకరి పట్ల భావాలను పెంచుకోవడం ప్రారంభించినప్పుడు, మీరు దేనినీ ప్రభావితం చేయలేరు. మనస్తత్వవేత్తలు మనిషి ఎంత ధైర్యంగా ఉన్నా, తన ప్రేయసికి తన భావాలను వ్యక్తం చేసినప్పుడు భయపడగలడు.

ఎక్కువ సమయం..

ఎక్కువ సమయం..

పురుషులు భావోద్వేగాలను వ్యక్తపరచడానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అదే ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు తమ భావోద్వేగాలను వ్యక్తపరచడంలో పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువ సమయం తీసుకుంటారు. అందుకే చాలా మంది స్త్రీలు ప్రేమ విషయంలో ఎక్కువ స్పీడుగా ఉంటారు. అది ఎంతలా అంటే వారు ప్రేమలో ఉన్నారు అని వారికి వంద శాతం తెలుస్తుంది. అదే అబ్బాయి విషయానికి వస్తే 50 శాతం మాత్రమే తెలుసుకుంటాడు.

శక్తిని కోల్పోవడానికి ఇష్టపడకపోవడం..

శక్తిని కోల్పోవడానికి ఇష్టపడకపోవడం..

పురుషులు తమ భావాలను వ్యక్తపరచకపోవటానికి కారణం వారు తమ శక్తిని కోల్పోవటానికి ఇష్టపడకపోవడమే. భావోద్వేగాలను వ్యక్తపరచడం తమను బలహీనపరుస్తుందని పురుషులు భావిస్తారు. వారు ఇష్టపడే వారి ముందు బలహీనంగా ఉన్నట్లు నటించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే ఒక స్త్రీ తన భావాలను వ్యక్తపరిచినప్పుడు మరియు ఆమె స్వరూపం మారదని వారు నమ్ముతారు. అంతే కాకుండా ఇలా తమ భావాలను వ్యక్తపరచడం వల్ల తమ శక్తి ఏమి కోల్పోమని వారికి బాగా తెలుసు.

ప్రారంభంలో మాత్రం..

ప్రారంభంలో మాత్రం..

పురుషులు ఎవరినైనా ఆట పట్టించేటపుడు లేదా ఎవరితో అయినా సరదాగా గడిపే సమయంలో మాత్రం తమ భావాలను అస్సలు దాచుకోరు. అలాగే ఎవరితో అయినా ప్రేమలో ఉన్నప్పుడు లేదా రిలేషన్ షిప్ లో ఉన్న ప్రారంభ దశలో పురుషులు ఎక్కువగా మాట్లాడతారు. ఆ సమయంలో మాత్రం అచ్చం అమ్మాయిలలాగే అబ్బాయిలు కూడా తమ మనసులో ఉన్నదాన్ని బయటకి చెబుతారు. కానీ వారు ప్రేమలో కాలం గడిచేకొద్దీ తమ భావాలను దాచడం ప్రారంభిస్తారు.

పరిస్థితి మారుతుందని..

పరిస్థితి మారుతుందని..

పురుషులు తమ భావోద్వేగాలను బయటికి వ్యక్తపరిస్తే తర్వాత పరిస్థితి మారుతుందని వారు ముందే ఊహించగలుగుతారు. అలాగే దాని వల్ల తమ పట్ల వ్యతిరేక భావన వస్తుందేమోనని భయపడతారు. కానీ ఈ విషయంలో అమ్మాయిల పరిస్థితి రివర్స్ లో ఉంటుంది. ఒక మహిళ తన భావాలను వ్యక్తం చేస్తే స్త్రీకి అధికారం లభిస్తుంది. ఈ కారణాల వల్లే అబ్బాయిలు తమ ఫీలింగ్సు ను బయటపెట్టకుండా దాచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు.

English summary

Reasons Why Men Hide Their Feelings

Here are the surprising reasons why men hide their feelings. Read on.
Desktop Bottom Promotion