Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
అతనితో అఫైర్ నిజమేనన్నసానియా మీర్జా... అయితే అవన్నీ గుర్తు లేవట...!
మన దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి. టెన్నిస్ లో ఈమె చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. అయితే ఈ క్రీడాకారిణి ఆటల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల్లోనే ఎక్కువగా నిలిచింది.
హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్ లో మన దేశానికి మెడల్ తెచ్చిన మొట్టమొదటి మహిళ. టెన్నిస్ లో మన సానియా మీర్జా ప్రపంచంలోని అగ్రస్థాయి టెన్నిస్ దిగ్గజాలందరితో కలిసి పోటీలో పాల్గొంది. దీని వల్ల మన దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి. టెన్నిస్ లో ఈమె చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. అయితే ఈ క్రీడాకారిణి ఆటల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల్లోనే ఎక్కువగా నిలిచింది. తొలుత మన దాయాది దేశ క్రీడాకారుడైన షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

అయితే ఈ క్రీడాకారిణి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అది కూడా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినది.

ఆమె పెళ్లికాక ముందు ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో అఫైర్ ఉన్నట్లు తానే స్వయంగా చెప్పిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఓ బాలీవుడ్ స్టార్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆ విషయం గురించి ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. అదేంటో మీరే చూడండి.

ప్రేమ వ్యవహారాలు..
బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల మాదిరిగానే అందంగా ఉండే ఈ సానియా మీర్జా తాను గతంలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపినట్లు తెగ రుమార్లు వినిపించాయి.

ఆ హీరో ఎవరంటే..
బాలీవుడ్ హీరోల్లో మంచి పాపులారిటీ ఉన్న వారిలో షాహిద్ కపూర్ ఒకరు. అతని హ్యాండ్సమ్ గా కనిపించడంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే అతని వలలో అనేక మంది అమ్మాయిలు చిక్కుకున్నట్లు పుకార్లు కూడా వినిపిస్తుంటాయి. అయితే అదే వలలో మన హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా చిక్కుకున్నట్లు అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.

అతనితో ఆఫైర్..
ఇదే విషయాన్ని తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మీర్జాను అడగగా ఆమె ఆ అఫైర్ గురించి నిజమే అన్నట్లు సమాధానమిస్తూ... అంతలోనే ఈ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అప్పటి సంగతులు ప్రస్తుతం ఏమీ గుర్తులేవని దాట వేసింది.

షాహిద్ ప్రేమాయణం..
అయితే షాహిద్ కపూర్, కరీనా కపూర్ ప్రేమ వ్యవహరం గురించి బాలీవుడ్ తో పాటు భారతదేశంలోని సినీ అభిమానులందరికీ బాగానే తెలుసు. అంతేకాదు ఈ గురుడు విద్య బాలన్ తో కూడా కొంతకాలం ఎఫైర్ సాగించినట్లు అనేక వార్తలు వినిపించాయి. వీరిద్దరితో బ్రేకప్ తర్వతే సానియా మీర్జాతో పరిచయం ఏర్పడిందట.

తక్కువ కాలమే ప్రేమ...
అలా షాహిద్ తో పరిచయం ఏర్పడిన కొద్దిరోజులకే అది ప్రేమగా మారిపోయినట్లు అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే వీరి ప్రేమ అతి తక్కువ కాలమే ఉన్నట్లు తెలుస్తోంది.

షాహిద్ తో విడిపోయాక...
సానియా మీర్జా షాహిద్ కపూర్ విడిపోయిన తర్వాత మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అది కూడా రద్దు అయ్యింది. ఆ తర్వాతే పాకిస్థాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను ప్రేమించి వివాహం చేసుకుందట సానియా మీర్జా.

షాహిద్ వివాహం..
మరో వైపు షాహిద్ కపూర్ కూడా తనకు ఎంతమందితో ఎఫైర్లు ఉన్నప్పటికీ, చివరికి 2015లో మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. షాహిద్ బాలీవుడ్ అందాల భామలైన ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, సోనాక్షి సిన్హా, నర్గీస్ ఫక్రి వంటి హీరోయిన్లందరితో కొంతకాలం డేటింగ్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది.

మళ్లీ టెన్నిస్ అలరించేందుకు...
ఈ సంగతులన్నీ పక్కనబెడితే సానియా మీర్జా తన టెన్నిస్ గేమ్ లో మళ్లీ పునరాగమనం చేయనుందట. ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చి బరువు బాగా పెరగడంతో, ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉందట. ఇందు కోసం చాలా ఎక్కువ శ్రమిస్తోందట. దీంట్లో భాగంగానే మూడు నెలల్లో 20 కిలోల వరకు బరువు తగ్గిందట.



Click it and Unblock the Notifications
