Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
కరోనా సమయంలో మీ ప్రియమైన వారికి ఎలా కనెక్ట్ అవ్వాలంటే...
రోనా దెబ్బకు చాలా మంది కలయికలో పాల్గొనడం లేదంట.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరికీ కంటి మీద కునుకు అనేదే లేకుండా చేస్తోంది. ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలన్నీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం దాదాపు 30 వేల వరకు నమోదయ్యాయి. దాదాపు వెయ్యిమందికి పైగా మరణించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు వెయ్యి మార్కును ఎప్పుడో దాటేశాయి.

ఈ కరోనా భూతం నుండి తప్పించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అంతేకాదు దీనిని అత్యంత కఠినంగా అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ రెండోసారి కూడా పొడిగించినా కొన్ని సడలింపులు వచ్చాయి. అయితే చాలా చోట్ల రెడ్ జోన్లు ఉండటంతో మార్కెట్లు అనేక కార్యాలయాలు మూసివేయబడ్డాయి.

దీంతో చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది ఇళ్లలో ఉండి కూడా ఎవ్వరితో సరిగ్గా కలుసుకోలేకపోతున్నారు. అందరూ ఎక్కువగా ఒంటరితనంగా ఉన్నట్లు ఫీలవుతున్నారు.

అయితే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుకె ఆధారిత పరిశోధన ప్రకారం ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవడం అనేది 15 సిగరెట్లు తాగడం కన్నా ప్రమాదకరమైందని చెబుతున్నారు. ఇది చాలా మందికి అత్యంత క్లిష్ట సమయం. ఎందుకంటే, మనషులుగా మనం మన పర్యావరణంతో కలిసిపోయేందుకు చాలా ఇష్టపడతాం. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దీనికి మనం దూరం కావాల్సి వచ్చింది. అలాగే మనుషులకు కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ మనుషుల మధ్య కనెక్టివిటీ కోసం సోషల్ మీడియాను ఉపయోగించి, మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటం ద్వారా మీ జీవితాలను హాయిగా కొనసాగించవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

ఒంటరితనం ప్రమాదకం...
కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇతరులతో రిలేషన్ షిప్ చేయకుండా మెయింటెన్ చేయకుండా, స్వీయ ఒంటరితనంగా ఉంటే అది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ప్రియమైన వ్యక్తి మీ నుండి దూరంగా ఉంటే సంబంధాలను పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. మీరు శారీరకంగా దగ్గర కాకపోతే, మీరు టెక్నాలజీని ఉపయోగించి మీ బంధం బలపడేలా ప్రయత్నించమని చెబుతున్నారు.

దూరంగా ఉండే జంటలే..
కార్నెల్ యూనివర్సిటీ మరియు హాంకాంగ్ సిటీ యూనివర్సిటీలో ఒక అధ్యయనం ప్రకారం కలయికలో ఉంటే సాన్నిహిత్యం పెరుగుతుందట. అయితే ఈ అధ్యయనం ప్రజల యొక్క ఫోన్ కాల్స్ మరియు ఇతర కమ్యూనికేషన్ వివరాలను విశ్లేషించింది. శారీరకంగా ఒకరితో ఒకరు దగ్గరైన వారితో పోలిస్తే, దూరంగా ఉన్న జంటలే ఎక్కువ సన్నిహితంగా ఉన్నారని తెలిపింది. ఇందుకు గల కారణాలను కూడా తెలిపారట.

పరస్పర ప్రయోజనం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రతి కుటుంబంలో చిన్నపిల్లల నుండి పండు ముసలి వారీ వరకు రోజువారీ పరస్పర చర్య నుండి ప్రయోజనం పొందుతారట. అయితే వీరిలో కొందరు పెద్దవారిలో కొన్ని భయాందోళనలు ఉంటాయట. అలాంటి వారికి ఈ పరస్పర చర్య ఈ భయాలను అధిగమించడానికి తోడ్పడుతుందట. మరోవైపు ప్రస్తుత పరిస్థితి గురించి పిల్లలతో మాట్లాడటం మరియు వారికి అవగాహన కల్పించేందుకు కూడా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని ఆ అధ్యయనం చెబుతోంది.

నిస్సహాయంగా ఉన్నప్పుడు..
అయితే కొంత మందికి స్వీయ ఒంటరితనం అనేది చాలా గొప్ప సమయంగా ఉంటుందట. అయితే వీరిలో అంతర్ముఖులు మాత్రమే ఇలా సంతోషపడతారట. బహిర్ముఖులు మాత్రం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారట. ఏదైమైనా ఏదో ఒక సమయంలో చేయలేకపోతున్న పని మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు మీకు అంతర్ముఖంగా ఉండే వారికి టెక్నాలజీ పరంగా కొంత హామీ అవసరమవుతుందట. అదే బహిర్ముఖులకు ఎక్కువ శ్రద్ధ మరియు భరోసా అవసరం పడుతుందట.

వినూత్నంగా ప్రయత్నించండి..
ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని ఆ అధ్యయనం సూచిస్తోంది. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కొత్త మార్గాలను కనుగొనాలట. ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ డ్యాన్స్ క్లాసులలో సమయాన్ని వెచ్చించడం, లైవ్ స్టోరీ సెషన్ లో పాల్గొనడం, వర్చువల్ టూర్లు మరియు మ్యూక్ వంటి వివిధ వినూత్న పద్ధతుల ద్వారా సోషల్ మీడియాలో తమ సన్నిహితులతో సమయాన్ని గడుపుతున్నారట.



Click it and Unblock the Notifications
