Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఒక అమ్మాయిని ఇష్టపడిన సమయంలో అబ్బాయిలు చేసే చిలిపి పనులేంటో తెలుసా...
పురుషులు ఎప్పుడూ తాము ఇష్టపడే మహిళల గురించి బాగా గర్వపడతారు. వారు కోరుకున్న అమ్మాయికి ఆ విషయం గురించి గొప్పగా చెప్పుకుంటారు.
ఒక అమ్మాయిని అబ్బాయి నిజంగా ప్రేమిస్తే చచ్చేదాకా తనతోనే జీవితం అనుకుంటాడు. అయితే తన ప్రేమను.. అమ్మాయిని తాను ఎంతగా ఇష్టపడుతున్నాడో చెప్పడానికి మాత్రం అనేక ఇబ్బందులు పడతాడు.

తన అభిమాన అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి వారి దృష్టిని ఆకర్షించడానికి అతను చేసే కొన్ని కొంటె పనుల వల్ల చాలా సార్లు అమ్మాయి దగ్గర అడ్డంగా దొరికిపోతుంటాడు. దీంతో వారి ప్రేమకు అవి వ్యతిరేకంగా మారతాయి. ఈ సందర్భంగా అబ్బాయిలు అమ్మాయిల వద్ద ప్రేమతో చేసే చిలిపి పనులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చూడండి...

పాత సంబంధాల గురించి...
పురుషులు ఎప్పుడూ తాము ఇష్టపడే మహిళల గురించి బాగా గర్వపడతారు. వారు కోరుకున్న అమ్మాయికి ఆ విషయం గురించి గొప్పగా చెప్పుకుంటారు. వారు ఇలా చేయటానికి కారణం, తమ అభిమాన అమ్మాయిని ఎలా అయిన సాధించగలమన్న సామర్థ్యం ఉందని అనుకుంటారు.అందుకే పాత సంబంధాల గురించి ఓపెన్ గా చెబుతుంటారు.

దాని వల్ల అమ్మాయిలో నిరాశ..
తాను అభిమానించే అమ్మాయితో మాట్లాడేటప్పుడు పురుషులు వారితో కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడలేరు. తమలో తాము మాట్లాడుకుంటున్నట్టు ప్రవర్తిస్తారు. అది అమ్మాయిలను బాగా నిరాశపరుస్తుంది. వారు తమ గురించి తాము చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్నిసార్లు స్వయంగా వారిలో వారే మాట్లాడుకుంటారు.

పురుషత్వాన్ని చూపే ప్రయత్నం..
పురుషులలో చాలా మంది అమ్మాయిల దగ్గర తమ మగతనాన్ని చూపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. అందుకే వారు తమ మగతనాన్ని వ్యక్తీకరించడానికి మరియు సెక్సీగా కనిపించేందుకు చాలా ప్రయత్నిస్తారు. కానీ ఇది మహిళలకు అంతగా నచ్చకపోవచ్చు.

శారీరక సాన్నిహిత్యం
చాలా మంది అబ్బాయిలు తమ అభిమాన మహిళతో శారీరక సాన్నిహిత్యం కోరుకుంటారు. కాబట్టి వారు అమ్మాయిని చూసినప్పుడు, వారు ఆకర్షణ యొక్క చిన్న సంకేతాలను ప్రదర్శించడం ప్రారంభిస్తారు. ఆడవారిలో కీలకమైన ప్లేసులను తాకడం, వారిని అందులో నిమగ్నం చేయడం వంటి తెలివితక్కువ విషయాల పట్ల దిగజారిపోతారు.

అనవసరమైన మాటలు..
తమ అభిమాన మహిళ సమీపంలో ఉన్నప్పుడు చాలా మంది అబ్బాయిలు రెండు పనులు చేస్తారు. వారి గురించి సెల్ప్ డబ్బా కొడుతూనే ఉంటారు. లేదా అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటారు. అయితే అసందర్భ మరియు అల్పమైన విషయాల గురించి మాట్లాడితే మంచిగా ఉంటుంది. అది కూడా అమ్మాయిల ఆందోళన తగ్గే వరకు ఇలాగే చేయాలి.

ఒకటికి రెండుసార్లు..
తమ అభిమాన అమ్మాయితో మాట్లాడే ముందు, వారు ఏమి చెప్పాలో అనే దానిపై తర్జనభర్జన పడతారు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. స్త్రీని చూసినప్పుడు పురుషులు ఇబ్బంది పడటానికి ఇది ఒక ప్రధాన కారణం. సరైన మాటలను మాట్లాడటానికి వారిని ముచ్చట్లలో దింపడానికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అయితే అక్కడ కూడా చాలా పొరపాట్లు చేస్తారు.

టాలెంట్ చూపేందుకు..
కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల మనసులను గెలవడానికి సులభమైన మార్గం వారి టాలెంటును చూపడమే అని భావిస్తారు. కానీ వాస్తవానికి అమ్మాయిల దృష్టిలో అదంతా ఏమి పని చేయదు. ఇలాంటి మహిళలకు ఇంకా తప్పుడు భావన కలిగిస్తుంది.

ఎప్పటికీ ఆకర్షించదు..
అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు అబ్బాయిలు కొద్దిగా అసురక్షితంగా భావించడం సాధారణమే. కానీ కొంతమంది పురుషులకు ఈ భావన చాలా సాధారణంగా అనిపించవచ్చు. తాము ఎల్లప్పుడూ ఏదో ఒక తప్పు చేసిన వారి మాదిరిగా ఫీలవుతుంటే, అలాంటి వారిని అమ్మాయి ఎప్పటికీ ఆకర్షించదు.



Click it and Unblock the Notifications
