Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
Hug Day 2023:ప్రతి కౌగిలిలోనూ ఓ ప్రత్యేకత ఉంటుందట...అవేంటో ఇప్పుడే చూసేద్దామా...
వాలెంటైన్స్ వీక్ 2023లో ఆరో రోజు హగ్ డే గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాలెంటైన్ వీక్ లో అన్నింటికంటే ముఖ్యమైన రోజుగా 'Hug Day'ను చెబుతుంటారు. వాలెంటైన్స్ డేకు సరిగ్గా రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 12వ తేదీన ఈ 'హగ్ డే' జరుపుకుంటారు. కౌగిలి(Hug) ఆ పేరులోనే ఏదో తెలియని పులకింత వస్తుంది.

ఈరోజున కనీసం ఒక హగ్ అయినా చేసుకోవడం అనేది వాలెంటైన్ వీక్ లో భాగంగా వస్తున్న సంప్రదాయం. ఒక కౌగిలింత అనేది మనిషిలో భిన్నమైన భావోద్వేగాలకు ప్రేమకు చక్కటి చిహ్నం. భాగస్వామిని ప్రేమగా హత్తుకోవడం ద్వారా మరింత ఎక్కువగా ప్రేమను పంచుతుంది.

మీరు ఎవరినైనా ప్రేమతో హత్తుకుంటే అది వారికి ప్రత్యేకమైన అనుభూతి కలిగించడంలో కచ్చితంగా సహాయపడుతుంది. అంతే కాదు కౌగిలింత అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి హగ్ చేసుకోవడం వల్ల బ్రెయిన్లో ఆక్సిటోసిన్ విడుదల అయ్యే గుణాన్ని పెంచుతుంది.

ఇది న్యూరోట్రాన్సిస్టర్ గా ఉంటూ వ్యక్తుల మధ్య సంబంధాలను పెంచుతుంది. అంతేకాదు ఒక్క కౌగిలింత మనలోని చాలా ఆందోళనలను, ఒత్తిడిని అధిగమించేందుకు సహాయపడుతుంది. ఈ సందర్భంగా కౌగిలింత యొక్క ప్రత్యేకతలేంటి.. వాటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఫిబ్రవరి 12నే..
బాధలో ఉన్నా.. ఆనందంలో ఉన్నా ఆప్యాయంగా హత్తుకుంటే ఎంతో మందికి చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే ఒక భాగమైపోయింది. అంతేకాదు.. ఈరోజు ఎంతో ప్రాధాన్యతను సైతం పొందింది. అందుకే వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీనే హగ్ డే జరుపుకుంటారు.

ప్రేమ కౌగిలింత..
ఇలా కౌగిలించుకునే కౌగిలింత ప్రేమను ప్రేమగా వ్యక్తం చేస్తుంది. మనకు సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. మనసుకు నచ్చిన వ్యక్తితో షేర్ చేసుకోవడం కంటే అద్భుతమైన మార్గం మరొకటి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమయంలో మనకిష్టమైన వారిని కౌగిలించుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. తమ ప్రేయసి లేదా ప్రియుడిని ఆప్యాయతతో ఒక్కసారి హత్తుకుంటే చాలు వారిలో ప్రేమ బంధం మరింత బలోపేతమవుతుంది. ఇలా వారిద్దరి మధ్య అనుబంధం పెరగడమే కాదు.. ఒకరికి ఒకరు తోడు, నీడగా ఉంటామనే ధీమా, భరోసా ఇచ్చినట్టవుతుంది.

ఆప్యాయమైన కౌగిలి..
సాధారణంగా ప్రతి అబ్బాయి నుండి అమ్మాయిలు రక్షణ కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే వారిని ఓసారి ఆప్యాయంగా హత్తుకోవడం ద్వారా మీ ప్రేయసికి మీరు తోడు ఉన్నారనే భరోసాను ఇచ్చినట్టవుతుంది. అందుకే హగ్ డే కు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. ఒక ప్రియుడి కౌగిలింతలోని హాట్ స్పర్శను.. ప్రియురాలు ఎంతో హాయిగా ఫీలవుతుంది. అందుకే ప్రేమికులు ఈరోజు తమ ప్రేయసికి/ప్రియుడికి మిస్సవ్వకుండా హగ్ ను ఇవ్వండి.

నేరుగా హగ్ చేసుకోవద్దు..
అయితే కౌగిలింత అనగానే చాలా మంది కౌగిలిలో తమ ప్రియురాలిని బంధి చేయాలని ఆరాటపడుతుంటారు. అయితే అలా ఎప్పటికీ చేయకూడదు. ముందుగా తనతో మాటలు కలపాలి. ముందుగా తనను మానసికంగా సిద్ధం చేయాలి. ఆ తర్వాత హ్యాపీ హగ్ డే ప్రాధాన్యాన్ని ఆమెకు వివరించాలి. ఆ తర్వాత ఆమె ఓకే అంటే గాఢమైన హగ్ ఇవ్వొచ్చు.

మీ కౌగిలిలో..
మరి కొందరు కౌగిలి పేరేత్తగానే సినిమాల్లో చూపించనట్టు గాఢంగా హత్తుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు అకస్మాత్తుగా వెనుక నుండి గట్టిగా హత్తుకునేందుకు ట్రై చేస్తారు. అయితే అలా కాకుండా మెల్లగా, సుకుమారంగా, సున్నితంగా హత్తుకోవాలి. మీ కౌగిలింతతో మీ ప్రేయసి ఈ లోకాన్నే మరచిపోయేలా చేయాలి. మీరు ఎంత సేపు కౌగిలించుకున్నా.. ఆమెకు అలానే ఉండిపోవాలి అనిపించేంతలా హగ్ ఇవ్వాలి. అలాంటి అనుభూతి ఎప్పటికీ మరచిపోలేరు.

లవ్ ఫీల్..
మీరు కౌగిలించుకున్నప్పుడు.. మీ లవ్ పీలింగ్ కూడా వ్యక్తపరచొచ్చు. ఎందుకంటే మీరు హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది వారికి చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రియురాలికి తన ప్రియుడు ఎప్పుడూ తనతోనే, తన వెంటే ఉన్న ఫీల్ కలిగిస్తుంది. హగ్ డే అనేది కేవలం ప్రేమికులే కాదు. ఇతరులు కూడా జరుపుకోవచ్చు. భార్యభర్తలు కూడా కౌగిలించుకోవచ్చు. హగ్ ఇవ్వడం ద్వారా మీరు ఎన్నో విషయాలను చెప్పినట్టవుతుంది. మీరు మాటల్లోని చెప్పలేని విషయాలను కౌగిలింత ద్వారా వ్యక్తం చేయొచ్చు.

కూల్ అయ్యేందుకు..
కౌగిలింత అనేది కేవలం సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. కోపంలో ఉన్నప్పుడు కూడా ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరూ కూల్ అయ్యేందుకు హగ్ ఇచ్చుకోవచ్చు. అనంతరం వారిద్దరూ ప్రశాంతంగా ఆలోచించి.. మరింత దగ్గరవుతారు. దీంతో వారి మూడ్ కూడా మారిపోతుంది.
చూశారు కదా.. కౌగిలింత వల్ల ఎన్ని లాభాలో.. ఇంకెందుకు ఆలస్యం హ్యాపీ హగ్ ఇవ్వండి.. వాలెంటైన్స్ వీక్ లో మరో ఆనందకరమైన రోజును హాయిగా గడిపేయండి.
కౌగిలింత అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బాధలో ఉన్నా.. ఆనందంలో ఉన్నా ఆప్యాయంగ్ హత్తుకుంటే ఎంతో మందికి చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే ఒక భాగమైపోయింది. అంతేకాదు.. ఈరోజు ఎంతో ప్రాధాన్యతను సైతం పొందింది. అందుకే వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీనే హగ్ డే జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications