For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pillow Talk: దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే ఇలా చేయాలి

కొందరు భార్యాభర్తలు తీరికలేని పనులు, కుటుంబ బాధ్యతల వల్ల సరిగ్గా మాట్లాడుకోలేరు. దాని వల్ల వారి మధ్య దూరం పెరగడమే కాదు మానసికంగానూ కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారికి చక్కని పరిష్కారమే పిల్లో టాక్.

|

Pillow Talk: సంబంధం అన్న తర్వాత చిన్నపాటి అలకలు, ఘర్షణలు ఉంటాయి. అవి ప్రతి బంధంలోనూ ఉంటాయి. వాగ్వాదాన్ని, అలకలను సరిగ్గా మేనేజ్ చేయకపోతే వాటి వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దంపతులు కొన్ని రోజుల పాటు మాట్లాడుకోవడం మానేయవచ్చు.

What is pillow talk? Know its benefits in relationships in Telugu

ఇలా అది శారీరకంగా, మానసికంగా డిస్‌కనెక్ట్ అయిపోతారు. భాగస్వాములు ఇద్దరి మధ్య తిరిగిన కనెక్షన్‌ని నిర్మించడానికి కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే అందుకు కొంత కృషి కూడా చేయాల్సి వస్తుంది.

కొందరు భార్యాభర్తలు తీరికలేని పనులు, కుటుంబ బాధ్యతల వల్ల సరిగ్గా మాట్లాడుకోలేరు. దాని వల్ల వారి మధ్య దూరం పెరగడమే కాదు మానసికంగానూ కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారికి చక్కని పరిష్కారమే పిల్లో టాక్.

పిల్లో టాక్ అంటే ఏమిటి?

పిల్లో టాక్ అంటే ఏమిటి?

పిల్లో టాక్ అనేది ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సన్నిహిత, ప్రామాణికమైన సంభాషణ. ఈ రకమైన సురక్షితమైన, ప్రేమగల, నిజమైన కనెక్షన్ మరియు కమ్యూనికేషన్ సాధారణంగా బెడ్‌లో లేదా కౌగిలించుకునేటప్పుడు జరుగుతుంది. ఇది భాగస్వామితో సెక్స్‌కు ముందు లేదా తర్వాత కూడా జరగవచ్చు. కానీ సెక్స్ అనేది ప్రతీసారి పిల్లో టాక్ లో భాగం కానవసరం లేదు.

పిల్లో టాక్ లో ఐ కాంటాక్ట్ ఉండదు. పిల్లో టాక్ లో ఆలోచించి పదబంధాలు అల్లడం ఉండదు. ఆచితూచి మాట్లాడటం అస్సలే ఉండదు. అది ఓ ప్రవాహంలో సాగిపోతుంది. అంటే ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి పదాలు వాడుతున్నాం అనే సెన్సార్ షిప్ పిల్లో టాక్ లో ఉండదు. ఇది మనసు లోతుల్లో నుండి వస్తుంది. కొంత మందికి పిల్లో టాక్ చాలా సహజంగా వచ్చేస్తుంది. కానీ కొందరు అలా మాట్లాడటానికి చాలా కష్టపడతారు.

భాగస్వామి గురించి తెలుసుకోవచ్చు

భాగస్వామి గురించి తెలుసుకోవచ్చు

పెళ్లై సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లలూ పుడతారు. కానీ ఇంకా జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోని వారు చాలా మందే ఉంటారు. వారి అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఫ్యాంటసీలు ఇలా ఏవైనా కావొచ్చు. వాటి గురించి చాలా కొద్ది మంది భాగస్వాములు మాత్రమే ఎక్కువగా పట్టించుకుంటారు. అయితే వీటన్నింటి గురించి సాధారణంగా మాట్లాడుకోవడం అంటూ ఉండదు. ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిందే. అయితే రాత్రి పడక గదిలో ఆలూమగలు అన్యోన్యయంగా ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు అయినా నిస్సంకోచంగా బయట పెట్టవచ్చు. ఆ సమయంలో ఉండే సాన్నిహిత్యం వల్ల చాలా విషయాలను చెప్పేస్తుంటారు భాగస్వాములు. అలా వారి ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవచ్చు. వారి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు పిల్లో టాక్ చక్కగా ఉపయోగపడుతుందని చెబుతారు నిపుణులు.

పిల్లో టాక్ vs డర్టీ టాక్

పిల్లో టాక్ vs డర్టీ టాక్

ఫోర్‌ప్లే మరియు సెక్స్ సమయంలో డర్టీగా మాట్లాడటం వలన మీ భాగస్వామితో ఉన్నతమైన అనుభవాన్ని మరియు మరింత సన్నిహిత సమయాన్ని పొందవచ్చు. ఇది పిల్లో టాక్ లాంటిది కాదు. పిల్లో టాక్ మరింత మానసికంగా సన్నిహితంగా మరియు హర్ట్ చేసే విధంగా ఉండొచ్చు.

మీరు మరియు మీ భాగస్వామి రిలాక్స్‌గా మరియు హాయిగా ఉన్నప్పుడు సెక్స్‌కు ముందు లేదా తర్వాత మీరు చాలా తరచుగా పిల్లో టాక్ అనుభవిస్తారు. పిల్లో టాక్ యొక్క దృష్టి భాగస్వాములను మరింత దగ్గర చేసే సానుకూల మరియు ఉత్తేజపరిచే కమ్యూనికేషన్‌ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

భాగస్వాములిద్దరూ మానసికంగా సురక్షితంగా, అర్థం చేసుకున్నారని మరియు కనెక్ట్ అయినప్పుడు, శృంగారం మరింత ప్రేమగా మరియు మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

డర్టీగా మాట్లాడటం అనేది లైంగిక కార్యకలాపాల సమయంలో చాలా మంది ఉపయోగిస్తుంటారు. డర్టీ టాక్ వల్ల లైంగికంగా ఉత్తేజితం కావొచ్చు. అది శృంగారాన్ని మరింత ఆస్వాదించేలా చేస్తుంది. శృంగారం చేస్తున్నప్పుడు డర్టీగా మాట్లాడటం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవంటున్నారు నిపుణులు.

మంచి సమయాన్ని పాడు చేస్తుంటారు

మంచి సమయాన్ని పాడు చేస్తుంటారు

చాలా మంది దంపతులకు వారి గురించి వారు మాట్లాడుకోవడానికి రోజంతా సమయం ఉండదు. పడుకునే ముందు కూడా ఇతర విషయాల ప్రస్తావనే తీసుకువస్తుంటారు. ఆఫీస్ గొడవలు, పిల్లల విషయాలు, ఇతర అంశాల గురించి మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటారు. పడకగదిలో నిద్రించే ముందే దంపతులకు మధ్య ఏకాంత సమయం దొరుకుతుంది. దానిని కూడా ఇతర అంశాల ప్రస్తావన తీసుకువచ్చి వృథా చేస్తుంటారు.

కాబట్టి పడకగదిలో వేరే విషయాలకు బదులు వారి గురించి, వారి బంధం గురించి మాట్లాడుకోవడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. పాత జ్ఞాపకాలు, పెళ్లి జరిగిన కొత్తలో అనుభవించిన మధురానుభూతులు, ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు, సరదా సంఘటనలు ఇలాంటివి మాట్లాడుకోవడం వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

English summary

What is pillow talk? Know its benefits in relationships in Telugu

read on to know What is pillow talk? Know its benefits in relationships in Telugu
Story first published:Saturday, November 26, 2022, 9:43 [IST]
Desktop Bottom Promotion