`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారు గట్టిగా కౌగిలించుకుంటారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

|

ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు.. వారిని దగ్గరగా చేరదీసి... మనస్ఫూర్తిగా ఆప్యాయతతో కౌగిలించుకుంటే వారి బాధ ఇట్టే మాయమవుతుందట. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో కూడా నిజం చేసి చూపాడు.

ఎవరికైనా ప్రేమగా ఇచ్చే కౌగిలితో ఆరోగ్యం.. ఆయుషు రెండూ పెరుగుతాయని పలు అధ్యయనాలలో కూడా తేలింది. మనకు ఏదైనా సందర్భంలో మూడ్ బాలేకపోతే.. కౌగిలి(Hug) అనేది మన మూడ్ ను మార్చడంలో కీలకంగా పని చేస్తుంది.

అంతేకాదు ఒక అబ్బాయి, అమ్మాయిని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు వారి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో.. వారు ఎలాంటి భావోద్వేగానికి గురవుతారో.. ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశి చక్రాల వారు ఎల్లప్పుడూ తమ భాగస్వామిని గట్టిగా హత్తుకోవడానికి ఆసక్తి చూపుతారంట. దీని వల్ల వారి మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాదు.. వారు రోజంతా చాలా చురుకుగా, హుషారుగా ఉండిపోతారంట.. ఇలాంటి పనులే తమ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని సైతం కలిగిస్తాయంట. ఇంతకీ ఆ రాశి చక్రాలేవో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ రాశిచక్రాలలో మీ రాశిచక్రం కూడా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాను మీరు పూర్తిగా చూడాల్సిందే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు గట్టిగా హత్తుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే వీరు తమ భాగస్వామితో ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటారు. వీరికి తమ పార్ట్ నర్ ను ఎక్కడ.. ఎప్పుడు ఎలా కౌగిలించుకోవాలో బాగా తెలుసు. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో దుప్పట్లను గట్టిగా హత్తుకుంటారు. అదే సమయంలో వారికి ప్రత్యేకమైన అనుభూతి కలిగేలా డిజైనింగ్ లైట్లను కూడా ఏర్పాటు చేసుకుంటారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు రోజంతా ఎక్కువ పని చేసి, అలసిపోయి ఇంటికి చేరుకున్న తర్వాత ప్రశాంతత మరియు విశ్రాంతి కోసం తమ భాగస్వామిని గట్టిగా హత్తుకుంటారు. వీరు నిద్రలోకి జారుకోవడానికి ముందు వీరి చేతులు మరియు కాళ్ల మధ్య ఉంచడాన్ని బాగా ఇష్టపడతారు. కౌగిలింతల సమయంలో వీరు నుదిటిని మెల్లగా ఢీకొట్టడాన్ని బాగా ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల వీరికి అంతులేని ఆనందం.. ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదండోయ్ భాగస్వామితో శారీరక సాన్నహిత్యం పెరిగి.. వీరి బంధం మరింత బలంగా మారుతుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఇతరులను గట్టిగా హగ్ చేసుకోవడాన్ని బాగా ఇష్టపడతారు. వీరు అర్థవంతమైన సంభాషణలలో లేదా ఏదైనా సమావేశాలలో పాల్గొనే సమయంలో కౌగిలించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరు గట్టిగా కౌగిలించుకున్నప్పుడు పార్ట్ నర్ లో ఆటోమేటిక్ గా కోరికలు పెరిగిపోతాయి. ఈ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ఈ సాన్నిహిత్యమే వీరి బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. అందుకే వీరు తమ భాగస్వామికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. వారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు.

ఈ రాశి జంటలు ఒకే రకమైన నమ్మకాలు, విలువలను కలిగి ఉంటారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు వారి భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. వీరు వారి పార్ట్ నర్ తో చాలా ఆప్యాయంగా ఉంటారు. వీరి గురించి ఎవ్వరు ఏమి అనుకుంటున్నారో.. ఏమి ఆలోచిస్తున్నారనే విషయాలను అస్సలు పట్టించుకోరు. వీరు ఏదైనా కావాలనుకుంటే దాన్ని రహస్యంగా కూడా చేసేస్తారు. వీరు కౌగిలింతలు.. ముద్దులు పెట్టడం.. ముక్కుతో భాగస్వామిని రుద్దడం వంటి చిలిపి పనులు ఎక్కువ చేస్తారు. అయితే ఇన్ని చేసినా గట్టిగా హత్తుకునే అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోరు. ఎందుకంటే వాటన్నింటికంటే ఇలాంటివే వీరికి ఎక్కువ అనుభూతిని కలిగిస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు కూడా ఎవ్వరినైనా గట్టిగా హత్తుకోవడానికి బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా చీకటి సమయంలో తమకు నచ్చిన వ్యక్తిని గట్టిగా కౌగిలించుకోవాలని ఎక్కువ కలలు కంటూ ఉంటారు. అంతేకాదండోయ్ రొమాంటిక్ భాగస్వామితో పాటు, తమ స్నేహితులు లేదా పెంపుడు జంతువులతో తక్కువ అనుభూతి చెందినప్పుడల్లా గట్టిగా హత్తుకోవాలని భావిస్తారు. ఎందుకంటే వారికి ఇవి తక్షణ శక్తి మరియు వారిని మూడ్ బూస్టప్ అందిస్తాయి. అందుకే ఇలాంటి చర్యలను వీరు బాగా ఇష్టపడతారు.

English summary

Zodiac signs who love to cuddle

Here we talking about the zodiac signs who love to cuddle. Read on