ఉదయం పూట శృంగారంతో మీరు ఊహించనన్నీ ప్రయోజనాలు

Written By:
Subscribe to Boldsky

పొద్దున్నే లేట్ గా లేవడం.. హడావుడిగా ఆఫీసుకు పరుగులు పెట్టడం అనేది చాలా మంది జీవితంలో ఉండే రోటిన్ షెడ్యూల్. సాయంత్రానికి ఇంటికి రావడం.. తినడం.. భార్యతో ఏదో చేయాలంటే చేద్దాం అన్నట్లుగా శృంగారం చేయడం చాలా మంది చేస్తుంటారు.

చాలామంది రాత్రే పాల్గొంటారు

చాలామంది రాత్రే పాల్గొంటారు

శృంగారం ప్రతి ఒక్కరికీ ఇది ఇష్టమే. శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నా కూడా మంచి సుఖాన్ని పొందవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సమయాల్లో శృంగారంలో పాల్గొనడం వల్ల సుఖంతో పాటు మంచి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు. చాలా మంది రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అయితే రాత్రి శృంగారంలో పాల్గొన్నా కూడా మళ్లీ ఉదయం సెక్స్ లో పాల్గొంటే మీకు చాలా మేలు.

తెల్లవారుజామున అయితే చాలా థ్రిల్

తెల్లవారుజామున అయితే చాలా థ్రిల్

సెక్స్ లో ఒక్కొక్కరు ఒక్కో సమయంలో పాల్గొంటూ ఉంటారు. చాలా మంది రాత్రి వేళల్లోనే సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. అయితే రాత్రి పూట కంటే తెల్లవారుజామున, ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే మంచి థ్రిల్ వస్తుందంట. అందులో బాగా సంతృప్తి చెందవచ్చంట. ప్రపంచంలో చాలా మంది మార్నింగ్ సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంట.

రాత్రికల్లా అలసిపోతారు

రాత్రికల్లా అలసిపోతారు

మీరు రోజంతా బయట ఎక్కడొక్కడో తిరిగి, ఆఫీసులో పని చేసి, ప్రయాణం చేసి, ఇంటి బాధ్యతల గురించి ఆలోచించి రాత్రి ఇంటికి చేరుకుంటారు. దీంతో చాలా అలసిపోయి ఉంటారు. మైండ్ కూడా అంత ఫ్రెష్ గా ఉండదు. ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోవాలని భావిస్తారు. రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోయి, ఉదయం ఉత్సాహంగా మేల్కొంటారు.

మైండ్ ఫ్రెష్

మైండ్ ఫ్రెష్

మార్నింగ్ సెక్స్ అనేది భాగస్వాములిద్దరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ సమయంలో మీ మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే, ఉదయంపూట భావప్రాప్తిని ఇద్దరూ బాగా పొందగలుగుతారు. దీని వల్ల మీరు ఆ రోజంతా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా గడపవచ్చు. ఈ విషయం చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

ఆ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది

ఆ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది

ఉదయంపూట టెస్టోస్టెరోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆ టైమ్ లో మీరు సెక్స్ లో పాల్గొంటే ఆక్సిటాక్సిన్ విడుదలవుతుంది. ఇది మీలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. అలాగే అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ హార్మోన్లు మీ భాగస్వామి రోజంతా సంతోషంగా ఉంచేందుకు దోహదపడతాయి.

అంగస్తంభనలు బాగా ఉంటాయి

అంగస్తంభనలు బాగా ఉంటాయి

మీకు ఉదయం పూట అంగస్తంభనలు బాగా కలుగుతాయి. సాధారణంగా ఉదయం లేవగానే అంగం గట్టిపడిపోతుంది. అందువల్ల మీరు త్వరగా సెక్స్ ను స్టార్ట్ చేయొచ్చు. మీరు మంచి మూడ్ లో ఉంటారు. అలాగే మీ భాగస్వామి కూడా మంచి మూడ్ లో ఉంటుంది. రాత్రి సమయంలో కన్నా ఉదయం అంగస్తంభనలు మెరుగ్గా ఉంటాయి. అంగానికి రక్తం బాగా ప్రసరణ అవుతుంది కాబట్టి మార్నింగ్ సెక్స్ ను మీరు ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది.

రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది

రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది

ఉదయంపూట సెక్స్ లో పాల్గొంటే మీలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మీలో కోర్టిసోల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు. ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

వ్యాయామంలాంటింది

వ్యాయామంలాంటింది

ఉదయంపూట సెక్స్ మీ కండరాలను ఉత్తేజపరుస్తుంది. మీరు వ్యాయామం చేస్తే ఏవిధంగా కేలరీలు ఖర్చు అయి మీ బాడీ స్ట్రాంగ్ గా మారుతుందో అలాగే సెక్స్ వల్ల కూడా మీ బాడీ మంచి శక్తిని పొందుతుంది. సెక్స్ అనేది ఒక రకమైన ఏరోబిక్ వ్యాయామం వంటిది.

దీర్ఘకాల జ్ఞాపకశక్తి

దీర్ఘకాల జ్ఞాపకశక్తి

ఉదయంపూట సెక్స్ మిమ్మల్ని ఉత్సాహంగా మార్చడమేకాకుండా మీలో దీర్ఘకాల జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మతిమరుపు సమస్య అనేది ఉండదు. ప్రతి పనిని మీరు ఆసక్తిగా చేసేందుంకు ఉదయం పూట శృంగారం చాలా బాగా ఉపయోగపడుతుంది.

వారానికి మూడుసార్లు

వారానికి మూడుసార్లు

వారానికి కనీసం మూడుసార్లు ఉదయం పూట శృంగారంలో పాల్గొనడం వల్ల గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఈ విషయం కూడా చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

ఈ సమయంలో ప్లాన్ చేసుకోండి

ఈ సమయంలో ప్లాన్ చేసుకోండి

ఉదయం 5 గంటల నుంచి 8 గంటలలోపు మీరు సెక్స్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకోండి. ఆ సమయంలో మగవారిలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సెక్స్ చేస్తే అత్యంత తృప్తి కలుగుతుంది. మధ్యాహ్నం, రాత్రి వేళలతో పోల్చుకుంటే ఈ సమయమే సెక్స్ కు చాలా అనుకూలం అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

స్నానం చేస్తూ

స్నానం చేస్తూ

మీరు మార్నింగ్ స్నానం చేస్తూ సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు. షవర్ కింద లేదంటే టబ్ లో స్నానం చేస్తూ సెక్స్ లో పాల్గొంటే మీలో ఎక్కడలేని ఉత్తేజం కలుగుతుంది. తర్వాత మీరు రెడీ అయి ఆఫీసుకు వెళ్లవచ్చు.

English summary

HOW TO HAVE GREAT MORNING SEX

HOW TO HAVE GREAT MORNING SEX
Story first published: Wednesday, December 27, 2017, 15:00 [IST]