పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్ వెళ్లాలా? నెటిజ‌న్లు చెప్పిన ఆస‌క్తిక‌ర స‌మాధానాలు

By: sujeeth kumar
Subscribe to Boldsky

పెళ్లి త‌ర్వాత కొత్త జంట హ‌నీమూన్ వెళ్ల‌డం చాలా ముఖ్య‌మని చాలా మంది భావిస్తుంటారు. ప్రముఖ ప్ర‌శ్న‌-జ‌వాబుల వెబ్‌సైట్ Quoraలో ఓ వ్య‌క్తి ఈ ప్ర‌శ్న‌ను అడిగాడు. యూజ‌ర్లు ఇచ్చిన వివిధ ర‌కాల స‌మాధానాలు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించాయి. ఇలాంటి స‌మాధానాల్లో ద బెస్ట్ అని భావించిన కొన్నింటిని ఇక్క‌డ పేర్కొంటున్నాం. చ‌దివి ఆనందించండి మ‌రి...

1.రిలాక్స్ అయ్యేందుకు...

1.రిలాక్స్ అయ్యేందుకు...

పెళ్లిళ్లు చాలా ఒత్తిడితో కూడుకొని ఉంటాయి. కొత్త జంట హ‌నీమూన్‌కు వెళ్ల‌డం వ‌ల్ల చాలా రిలాక్స్‌గా అయిపోతారు. పెద్ద‌లు కుద‌ర్చిన వివాహాల్లో కొత్త జంట‌లు ఒక‌రినొక‌రు తెలుసుకునేందుకు హ‌నీమూన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. జీవిత భాగ‌స్వామిని హాలిడే కోసం ఎక్క‌డికైనా తీసుకెళ్ల‌డాన్ని కొన్ని ర‌కాల స‌మాజాల్లో ఓ సామాజిక బాధ్య‌త‌గా చూస్తారు. అని ప్ర‌యాశ్ గిరియా స‌మాధాన‌మిచ్చారు.

2. ఇద్ద‌రికీ గొప్ప అవ‌కాశం

2. ఇద్ద‌రికీ గొప్ప అవ‌కాశం

భార్య భ‌ర్త‌లుగా ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెర‌గ‌డానికి గొప్ప అవ‌కాశంగా హ‌నీమూన్ ఉంటుంది. కొంద‌రు ఆర్థిక ప‌రిస్థితుల మూలంగా హ‌నీమూన్ వెళ్ల‌లేక‌పోవ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల్లో ఒక నెల ఉద్యోగానికి సెల‌వు పెట్టి ఇంటిపట్టునే ఉండ‌టం మంచిది. లేదా ద‌గ్గ‌ర‌లో ఏదైనా ప్ర‌దేశానికి వెళ్లిరావొచ్చు. అలా కుద‌ర‌క‌పోయినా ఒక నెల రోజుల కోసం వేరే ఇంటిని అద్దెకు తీసుకొని రిలాక్స్ కావొచ్చ‌ని హుస్సేన్ అనే నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

3. అంత ముఖ్య‌మేమీ కాదు..

3. అంత ముఖ్య‌మేమీ కాదు..

హ‌నీమూన్‌కు వెళ్ల‌డం అంత ముఖ్య‌మేమీ కాదు. కాక‌పోతే ఎక్క‌డికైనా వెళితేనే ఒక‌రి గురించి ఒక‌రు బాగా తెలుసుకోగ‌లుగుతారు. కొత్త ప్ర‌దేశం, వాతావ‌ర‌ణంలో ఇద్ద‌రికీ ద‌గ్గ‌ర‌య్యేందుకు మంచి అవ‌కాశం ల‌భిస్తుందని మ‌హ్మ‌ద్ హుసేన్ అనే నెటిజ‌న్ స‌మాధానం చెప్పాడు.

4. కొంద‌రు ఏళ్లు ఎదురుచూశారు...

4. కొంద‌రు ఏళ్లు ఎదురుచూశారు...

నాకు తెలిసిన కొంద‌రు హ‌నీమూన్ వెళ్లేందుకు స‌రిప‌డా డ‌బ్బులు లేక కొన్నేళ్ల పాటు ఆగాల్సి వ‌చ్చింద‌ని టామ్ నెక్విస్ట్ అనే వ్య‌క్తి కామెంట్ చేశాడు.

5. మంచి వార్మ‌ప్‌లా...

5. మంచి వార్మ‌ప్‌లా...

అస‌లైన పెళ్లి జీవితానికి హ‌నీమూన్ అనేది వార్మ‌ప్‌లా ఉంటుంది. ఇక్క‌డే పెళ్లి గురించి అస‌లైన భావ‌న‌లు క‌లుగుతుంటాయి. పెళ్లి త‌ర్వాత వాళ్ల‌నుకున్న విధంగా ఉండ‌క‌పోవ‌డంతో కొంద‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతుంటారు. అలాంటి వాళ్ల‌కు హ‌నీమూన్ సంసిద్ధుల‌ను చేస్తుంది. అదీగాక ఎక్క‌డైనా వెళ్లి వ‌స్తే జీవితాంతం ఆ మ‌ధుర జ్ఞాప‌కాలు తొలుస్తూనే ఉంటాయని బెన్ క‌రోనా జ‌వాబిచ్చాడు.

6. ముద్దొచ్చే వ్యాప‌కమ‌ది...

6. ముద్దొచ్చే వ్యాప‌కమ‌ది...

హ‌నీమూన్ అనేది అంత ముఖ్య‌మేమీ కాదు. కాక‌పోతే కొత్త‌గా పెళ్ల‌యిన వారికి క‌లిసి కొంత టైమ్ స్పెండ్ చేసేందుకు బాగుంటుంది. రొటీన్ లైఫ్ నుంచి కాస్త విముక్తి దొరుకుతుంది. ఎంత సేపు ప‌ని, బిల్లులు, ప‌న్నులు, బీమా లాంటి వెన్నో ఉంటాయి జీవితంలో. మ‌న‌కంటూ కాస్త రిలాక్స్‌గా ఒక రొమాంటిక్ హాలిడే ఉండాలి క‌దా అని ఇలినోరా పిట్రోండు అనే వ్య‌క్తి వ్యాఖ్యానించాడు.

7. విరామంలా ఉంటుంది

7. విరామంలా ఉంటుంది

మామూలుగా వెకేష‌న్ తీసుకోవ‌డం చాలా ముఖ్యం. హ‌నీమూన్ కూడా వెకేష‌న్ తీసుకోవ‌డం లాంటిది. కొంద‌రు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఏళ్ల త‌ర‌బ‌డి ప‌నిచేస్తూనే ఉంటారు. ప‌ర్స‌న‌ల్‌గా చెబుతున్నా... కాస్త విరామం తీసుకుంటే మాన‌సిక ఆరోగ్యం బాగా కుదుట‌ప‌డుతుంది. పెళ్లికి ముందు ర‌క‌ర‌కాల ప‌ని ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌త‌మవ‌తుంటారు జ‌నాలు. పెళ్లి త‌ర్వాత ఇలా ఏదైనా ప్ర‌దేశానికి వెళ్తే రోజువారీ బాధ్య‌త‌ల నుంచి కాస్త విరామం దొరికిన‌ట్టు ఉంటుంది.

English summary

Is it really important to go on a honeymoon just after marriage? Here’s what people said ..!

Most of us believe that going on a honeymoon after marriage is one of the most important thing that every newlywed couple needs to do. An user on the popular question-and-answer-site Quora asked the question “How important is it to go for a honeymoon after marriage?” and the answers were pretty interesting. Here are some of the best Quora responses which left us amused:
Story first published: Friday, December 1, 2017, 14:30 [IST]
Subscribe Newsletter