నన్ను ఆ విషయంలో మా ఆయన బాగా టార్చర్ చేశాడు

Written By: Bharath
Subscribe to Boldsky

ఆమె పక్క పల్లెటూరి అమ్మాయి. చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పుట్టిపెరిగింది. ప్రకృతి అందాల గురించి మాత్రమే తనకు తెలుసు. వాగులు, వంకల చుట్టూ ఆనందంగా తిరిగిన రోజులు తనకు ఎప్పటికీ చెదరని జ్ఞాపకాలు. అలా ప్రకృతిని చూసి పరవశించిపోయే ఆ పడుచుపిల్ల పెళ్లీడుకు వచ్చింది. ఎప్పటికైనా ఆమెను ఒక ఇంటిదాన్ని చేసి తమ భారాన్ని తగ్గించుకోవాలనుకుంటారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు అదే చేశారు. పెళ్లి తర్వాత ఆమె జీవితం చాలా మలుపులు తిరిగింది. ఆ కథ మొత్తం ఆమె మాటల్లోనే...

నిశ్చితార్థం

నిశ్చితార్థం

నాకు మా అమ్మనాన్న ఒక మంచి సంబంధం చూశారు. అబ్బాయి సిటీ కుర్రాడు. పట్నంలోనే నౌకరీ చేస్తడు. జీతం కూడా మస్తుగొస్తది. కట్నం పెద్దగా అడగలేదు. నాతో పాటు మా వాళ్లందరికీ నచ్చేశాడు. నిశ్చితార్థం పూర్తయింది. ఆయనేమో ఇంగ్లిష్ మస్తుగా మాట్లాడుతాడు. నాకేమో అంతగా రాదు. కానీ నేర్చుకున్నా. ఏదో రెండు మూడు ముక్కలు మాట్లాడతాను. నాది తెలంగాణ. మా ఆయనేదేమో ఆంధ్ర. మనుషులు.. మనసులు కలవడానికి ప్రాంతాలతో సంబంధం ఉండదు కదా. అయినా మనమంతా తెలుగు వాళ్లమే కదా.

పెళ్లి

పెళ్లి

మా పెళ్లిని మంచిగా చేసిండ్రు మావోళ్లు. ఉన్నకాడికి సంబురంగా నా లగ్గం పూర్తయింది. మా ఆయనను మా ఊళ్లో అందరూ కూడా ఓ మస్తుగున్నడు.. పిల్లగాడు అంటూ అందరూ మెచ్చుకుండ్రు. సిటీ పోరగాడు గదా.. మరి గా మాత్రం టీక్ టాక్ ను ఉంటాడులే. నాకు కూడా మస్తుగా నచ్చిండు. కానీ అంత పాష్ గా ఉండేసరికి నేను అడెస్ట్ అవుతానో లేదోనని కాస్త భయమేసేది.

పట్నంలో కాపురం

పట్నంలో కాపురం

మా ఆయన నౌకరీ ఉండేది పట్నంలో. అందుకే మా కాపురం కూడా ఆడనే పెట్టనికే రెడీ అయినం. మా పుట్టింటోళ్లు కొన్ని సామాన్లు వేసిచ్చిండ్రు. మొత్తానికి పట్నంలో అపార్ట్ మెంట్ లో డబుల్ బెడ్ రూమ్ లో దిగినం. ఓ ఏమన్నా ఉందా గా ఇల్లు. మస్తుగుంది. అయితే గెంతైనా మన పల్లెటూరిలాగా మాత్రం ఉండదు గదా పట్నం. గదే జర భయవేసేది. మా ఆయన నౌకరికీ పోతే ఇంట్ల ఒక్కదానిగెట్లుండాలని పరేషాన్ అయ్యేదాన్ని. మెల్లగా గదికూడ్కా అలావాటైపోయింది.

మా ఆయన ఫ్రెండ్స్

మా ఆయన ఫ్రెండ్స్

ఇంత వరకు మంచిగనే ఉంది. నా లైఫ్ లో అసలు కథ ఇప్పుడు మొదలైంది. మా ఆయన ఒకరోజు ఆయన దోస్తులను ఇంటికి తీసుకొచ్చిండు. అందులో ఆడోళ్లు కూడా ఉన్నరు. ఆడోళ్లు మోకాళ్లకాడికి నిక్కర్లు వేసుకుని మా ఇంటికొచ్చిండ్రు. నేను పరేషాన్ అయిన. వీళ్లేంది గిట్లన్నారు అనుకున్నా. వోళ్లు ఆఫీసులకు గూడా గట్లనే పోతారంట.

ఒకరిమీద ఒకరు చేతులేసుకుని మాట్లాడుతారంట. గివన్నీ మా ఆయన చెప్పేసరికి షాక్ అయిన. అయితే వాళ్లు నన్ను చూసి షాక్ అయ్యిండ్రంట. మా ఆయన దాన్ని ఇన్సల్ట్ గా ఫీలయిండు. వోళ్లు చూడు ఎట్లన్నారో. నువ్వేమో పక్కా పల్లెటూరిదానిలాకా ఉన్నావంటూ కోప్పడిండు. నాకు బాధనపించిది.

పార్టీ కల్చర్

పార్టీ కల్చర్

అప్పుడు వీళ్లంతా మా ఇంటికొచ్చిండ్రు కదా. ఇప్పుడు మేముగూడా వాళ్ల ఇంటికి పోవాలా అని మా ఆయన చెప్పిండు. ఇది పార్టీ కల్చర్. ప్రతి సండే ఇట్ల మేము ఒక్కొక్కరి ఇంట్లో పార్టీలు పెట్టుకుంటూ ఉంటాం. అందరూ ఫ్యామిలీలతో అటెండ్ అవుతారన్నారు.

అందమైన వాలు జడ

అందమైన వాలు జడ

నా జడ అంటే నాకెంతో ఇష్టం. నాది అందమైన వాలుజడ. నాకు జడ వేయాలంటే మా అమ్మకు విసుగొచ్చేది. అంద పెద్దగా ఉండేది నా జడ. ఇ స్కూల్ లో ఉన్నప్పుడు దాన్ని చూసి నా ఫ్రెండ్స్ మొత్తం కుళ్లుకునేటోళ్లు.

హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది

హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది

కానీ మా ఆయన ఒక కండీషన్ పెట్టిండు. రేపు మనం పార్టీకి వెళ్తున్నాం. నీవు హెయిర్ కట్ చేయించుకోమన్నాడు. నాకు చాలా బాధ అన్పించింది. నేను చేయించుకోను అన్నాను. ఈ విషయంలో నాపై మస్తు కోప్పడిండు. కొట్టనిక కూడా వచ్చిండు. దాంతో నా అందమైన పొడవు జడను బ్యూటీ పార్లర్ కు పోయి కట్ చేయించుకోవాల్సి వచ్చింది.

మోడల్ డ్రెస్ లు

మోడల్ డ్రెస్ లు

మా ఆయన వాళ్ల దోస్తుల భార్యలు ఎట్ల ఉంటారో నన్ను కూడా అలా మారమన్నాడు. వాళ్లంతా పట్నమోళ్లు. పెద్ద పెద్ద ఆఫీసులలో కొలువు చేసేటోళ్లు. వాళ్ల కల్చర్ వాళ్లకు కరెక్ట్. మరి నేను సిన్నప్పటి నుంచి పల్లెటూర్ల గదా పెరిగింది. నా కల్చర్ నాకు కరెక్ట్ అని మా ఆయనతో వాదించినా.

దానికి ఆయన కోప్పడిండు. నీవు మోడ్రన్ డ్రెస్ లు వేసుకోకుంటే నీ సంగతి ఉంటది అన్నాడు. నేను కూడా వాళ్ల మాదిరిగా ఫ్యాషన్ గా మారాలన్నాడు.

ఒళ్లంతా కనపడేలా

ఒళ్లంతా కనపడేలా

మా ఆయన మోడ్రన్ డ్రెస్ లు తీసుకొచ్చిండు. అవి వేసుకుని పట్నం పోరిలాగా రెడీ కామన్నాడు. నాకేమో అవి అస్సలు నచ్చదు. మా ఆయన కోసం వేసుకోక తప్ప లేదు. అప్పుడు సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. ఒళ్లంతా కనపడేది. అవి వేసుకుని వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లాలంటే పాణం సచ్చిపోయేది. అయినా వేసుకుని వెళ్లక తప్పలేదు.

మా ఆయన ఫ్రెండ్స్ భార్యలు

మా ఆయన ఫ్రెండ్స్ భార్యలు

మా ఆయన ఫ్రెండ్స్ భార్యలను చూస్తే నాకు చండాలంగా అనిపించేది. అయితే వాళ్లకు వాళ్లు కరెక్ట్ కావొచ్చేమో. వాళ్ల కల్చర్ కూడా డిఫరెంట్ గా ఉండేది. అందరూ కలిసి ఏవేవో తాగేటోళ్లు. ఎట్లనంటే అట్ల మాట్లాడుకునేవారు. అవన్నీ చూస్తే నాకు ఎట్లనో అన్పించేది.

నాకు అస్సలు నచ్చేది కాదు

నాకు అస్సలు నచ్చేది కాదు

నేను అనుకున్న జీవితం ఇది కాదు. పట్నం వచ్చినంత మాత్రానా నా పద్ధతులన్నీ మార్చుకోవాలా? పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుని వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు నాకు చాలా సిగ్గు అన్పించేంది. అయినా మా ఆయన టార్చర్ తట్టుకోలేక అలాగే వెళ్లేదాన్ని. నాలో నేను చాలా బాధపడేదాన్ని. ఏడ్చేదాన్ని.

చీర కట్టులో కుందనపు బొమ్మలా ఉండే నేను ఇలా అయిపోయానేంటి అని బాధపడేదాన్ని. వాలుజడను వయ్యారంగా తిప్పే నేను ఇలా మారిపోయానేంటి అని ఆలోచించేదాన్ని. నాకంటూ వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉండదా? పెళ్లి అయితే భర్త చెప్పినట్లే వినాలా? అని బాధపడేదాన్ని.

మా ఆయన తిట్టాడు

మా ఆయన తిట్టాడు

నేను ఇలా చేయనని మా ఆయనతో చెప్పేశాను. దీంతో ఆయన నన్ను తిట్టాడు. నీవు అలా ఉండకుంటే నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతుందన్నాడు. పల్లెటూరి అమ్మాయిని చేసుకున్నావెంట్రా అని ఎగతాళి చేస్తారన్నారు. పాప్ గా ఉండాలి.. ఫ్యాషన్ బుల్ గా ఉండాలంటూ నాతో ఏవేవో చెప్పాడు. అయితే నాకది అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. నన్ను నానా మాటలన్నాడు.

ఎవరి కోసమో మనం మారాల్సిన అవసరం లేదు

ఎవరి కోసమో మనం మారాల్సిన అవసరం లేదు

నా ప్రపంచం వేరు. నేను పెరిగిన వాతావరణం వేరు. అందరికీ ఆదర్శంగా ఉండే పద్ధతులు నావి. వాటన్నింటినీ మార్చమంటే నేను మార్చను అని మా ఆయనతో చెప్పేశా.

సంప్రదాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు

ఎవరికోసమే నా సంప్రదాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మారాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్లుగానే ఉండాలి. మనకు మనమే తోపులం కదా. ఆడ అయినా మగ అయినా మీకు నచ్చినట్టుగానే ఉండండి. అందులో ఉండే థ్రిల్ కోట్లు ఇచ్చిన కొనలేం.

English summary

my story husband tortured wife wear modern dress

My Story: Husband Tortured Wife To Wear Modern Dress
Story first published: Tuesday, December 12, 2017, 9:30 [IST]