అతనితో ఒక్కసారి పడుకున్నందుకు నన్ను వేశ్యలా చూశారు- My Story #10

Written By:
Subscribe to Boldsky

మాది సిరిసిల్లా జిల్లా. గతంలో మాది కరీంనగర్ జిల్లా. అప్పుడు అంతా ఒక్కటే జిల్లాగా ఉండేది. ఇప్పుడు మా జిల్లా విడిపోయి నాలుగు జిల్లాలుగా అయింది. నేను కరీంనగర్ లోనే చదివాను. నేను కాలేజీ రోజుల్లో చాలా బాగుండేదాన్ని. చాలా మంది నా వెంట పడేవారు. ఇక ప్రపోజల్స్ కు లెక్కేలేదు. మా కాలేజీలో చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు. అయినా నేను ఎవ్వరి ప్రేమలో పడలేదు.

అతనంటే చాలా ఇష్టం

అతనంటే చాలా ఇష్టం

మా ఇంటి దగ్గర ఒకతను ఉండేవాడు. అతను అంటే నాకు చాలా ఇష్టం. చాలా రోజులుగా అతన్ని ఒన్ సైడ్ లవ్ చేసేదాన్ని. అతను కనపడ్డప్పుడల్లా ఓర చూపుతో చూసేదాన్ని. నవ్వి నవ్వనట్లుగా ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేదాన్ని. కానీ ఎప్పుడూ ఇద్దరం మాట్లాడుకోలేదు. నేను అతన్ని ఇష్టపడుతున్నాననే విషయం అతనికి అర్థం అయ్యే ఉంటుందనుకునేదాన్ని.

ప్రపోజ్

ప్రపోజ్

ఒక రోజు నేను కాలేజీకి వెళ్తుంటే అతను ఎదురుగా వచ్చాడు. మా వీధి చివరలో ఎవ్వరు లేని సమయంలో నాకు ప్రపోజ్ చేశాడు. నాకు ఒక్క పక్క ఆనందం.. ఇంకో పక్క భయం. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి తప్పించుకుని కాలేజీకి వెళ్లిపోయాను.

కాయిన్ బాక్స్ నుంచి ఫోన్

కాయిన్ బాక్స్ నుంచి ఫోన్

అప్పుడు మొబైల్ ఫోన్స్ మా ఊర్లో ఎవ్వరి దగ్గరి ఉండేవికావు. కానీ అతని దగ్గర ఉండేది. నేను ఎలాగోలా అతని నంబర్ సంపాదించాను. తర్వాత కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేశాను. కొద్దిసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత హలో.. అన్నాను. నా ధ్వని విని గుర్తుపట్టాడు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను.

రోజూ ఫోన్ లోనే..

రోజూ ఫోన్ లోనే..

నేను రోజూ ఫోన్ లోనే మాట్లాడేదాన్ని. ప్రతి రోజూ రూపాయి కాయిన్స్ తీసుకుని కాయిన్ బాక్స్ దగ్గరకు వెళ్లేదాన్ని. గంటల తరబడి అతనితో ఫోన్ లో మాట్లాడేదాన్ని. ఏదో చెప్పాలనుకునేదాన్ని.. ఏమి చెప్పలేకపోయేదాన్ని. జస్ట్ హలో అనడం.. ఏం చేస్తున్నావ్.. ఏం తిన్నావ్.. మీ ఇంట్లో ఏం కూర.. గిసోంటివి అడిగి ఫోన్ పెట్టేసేదాన్ని.

ఎవరూ లేనప్పడు ఇంటికొచ్చాడు

ఎవరూ లేనప్పడు ఇంటికొచ్చాడు

ఒక రోజు అతను డైరెక్ట్ గా మా ఇంటికొచ్చాడు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరూ లేరు. నేను అప్పుడు ఇంట్లో తింటూ కూర్చొన్నాను. అతన్ని చూడడానే షాక్ అయ్యాను. వెంటనే ప్లేట్ ఇంట్లో పెట్టి చేతులు కడుక్కోని అతని దగ్గరకు వెళ్లాను. ఏయ్.. ఏంది గిట్ల డైరెక్ట్ గా ఇంటికొచ్చినవ్ అని అడిగాను. మీ ఇంట్లో ఎవరూ లేరు అని తెలిసి వచ్చానన్నాడు. సరే.. ఏందో చెప్పు అని భయపడుకుంటూ అడిగాను.

నన్ను ఏదో చేయబోయాడు

నన్ను ఏదో చేయబోయాడు

తను మీదమీదకు వచ్చిండు. నన్ను ఏదో చేయాలనుకున్నాడు. నాకు అతనిపై అసహ్యం వేసింది. నేను అనుకున్న ప్రేమ వేరు. అతనికి నాపై ఉన్న ప్రేమ వేరని అర్థం అయ్యింది. నాకు ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే గట్టిగా అరిచాను. దానికి అతను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో అప్పటి నుంచి నేను అస్సలు మాట్లాడలేదు.

డిగ్రీలో చాలామంది

డిగ్రీలో చాలామంది

తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి. నా ఇంటర్ పూర్తయ్యింది. తర్వాత డిగ్రీలో జాయినయ్యాను. నాకు కాలేజీలో కొత్తకొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు. కానీ నేను ఎవ్వరికీ ఒకే చెప్పలేదు.

ఒకతను చాలా బాగుండేవాడు

ఒకతను చాలా బాగుండేవాడు

ఒక అబ్బాయి చాలా హ్యాండ్ సమ్ గా ఉంటాడు. అతను నాకు చాలా బాగా నచ్చాడు. ఒక రోజు అతనే వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే అన్నాను. అతను నన్ను చాలా ప్రేమించేవాడు. నాకు ఏవేవో గిఫ్ట్స్ తీసుకొచ్చేవాడు. నాపై చాలా ప్రేమ చూపించేవాడు.

మొబైల్ ఇచ్చాడు

మొబైల్ ఇచ్చాడు

నాకు మొబైల్ ఫోన్ కూడా ఇచ్చాడు. ఇద్దరం రోజూ మాట్లాడుకునేవాళ్లం. ఏవేవో కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఒక రోజు వాళ్ల ఇంటికి రమ్మనాడు. వెళ్లాను. ఇంట్లో ఎవరూ లేరు. నేను వెంటనే తిరిగి ఇంటికొచ్చాను. అయితే దానికి అతను నాతో మాట్లాడలేదు. నాపై గొడవపడ్డాడు.

ముద్దు పెట్టుకున్నాడు

ముద్దు పెట్టుకున్నాడు

మళ్లీ తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ రోజు కూడా ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు. తర్వాత నన్ను ముద్దుపెట్టుకున్నాడు. ఇంకా ఏమేమో చేశాడు.

సెక్స్ లో బాగా ఎంజాయ్ చేశాం

సెక్స్ లో బాగా ఎంజాయ్ చేశాం

ఆ తర్వాత సెక్స్ చేద్దామన్నాడు. నాకు భయం వేసింది. అయితే నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే కదా.. నేను కచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఏవేవో మాటలు చెప్పాడు. బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. నేను అస్సలు వద్దన్నాను. కానీ అతను నాపై చూపించిన ప్రేమకు, అతనిపై నాకున్న నమ్మకానికి చివరకు ఓకే అన్నాను. ఇద్దరం సెక్స్ లో బాగా ఎంజాయ్ చేశాం.

మెసేజ్

మెసేజ్

ఒక రోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. అయితే మధ్యలో నా మొబైల్ కు ఒక మెసేజ్ వచ్చింది. హాయ్.. హౌ ఆర్ యు అని నా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు. వెంటనే అతను మెసేజ్ చెక్ చేశాడు. ఎవరు అని అడిగాడు. నా ఫ్రెండ్ ప్రియ అని అబద్దం చెప్పాను. తర్వాత వెంటనే ఆ నంబర్ కు ఫోన్ చేశాడు.

కొట్టాడు

కొట్టాడు

ఆ నెంబర్ మా క్లాస్ మేట్ ది. ఆ అబ్బాయి నాతో బాగా మాట్లాడేవాడు. కానీ అతను కేవలం ఫ్రెండ్ మాత్రమే. కానీ నా బాయ్ ఫ్రెండ్ అతనికి ఫోన్ చేసి వాళ్ల ఇంటికి వెళ్లి కొట్టి వచ్చాడు.

అందర్ని కొడతానన్నాడు

అందర్ని కొడతానన్నాడు

నాకు ఈ విషయంలో నా బాయ్ ఫ్రెండ్ పై చాలా కోపం వచ్చింది. ఎందుకు అలా చేశావని నా బాయ్ ఫ్రెండ్ ను అడిగాను. వాణ్నే కాదు.. నీతో ఎవడు మాట్లాడినా కొడతానన్నాడు. ఎలా అంటే అలా మాట్లాడాడు.

రోజూ సెక్స్

రోజూ సెక్స్

నన్ను దారుణంగా తిట్టాడు. నీకు సిగ్గుందా అంటూ ఏవేవో మాటలు మాట్లాడాడు. తర్వాత నన్ను రోజు సెక్స్ లో పాల్గొందామా అంటూ టార్చర్ చేసేవాడు. నేను అతనితో ఒక్కసారి అలా గడిపినందుకు నన్ను చాలా అవమానించేవాడు.

బెదిరింపులు

బెదిరింపులు

నన్ను రోజూ వేధించేవాడు. నాకు ఏం చేయాలో అర్థం అయ్యేదికాదు. నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నీకు జీవితం లేకుండా చేస్తానని బెదిరించేవాడు. నాకు అతనిపై ప్రేమ మొత్తం పోయింది.

మా సెక్స్ గురించి చెప్పాడు

మా సెక్స్ గురించి చెప్పాడు

ఒక రోజు మా ఇంటికొచ్చి మా అమ్మ, అన్నకు మా ప్రేమ విషయం గురించి చెప్పాడు. మా సెక్స్ మ్యాటర్ కూడా వాళ్లకు చెప్పాడు. మా అమ్మ మా నాన్నకు అన్నీ చెప్పేసింది. మా నాన్న నన్ను తిట్టని తిట్టు తిట్టకుండా కాలేజీ మాన్పించేశాడు. చంపేస్తానన్నాడు.

రెడ్ లైట్ ఏరియాకు వెళ్లు

రెడ్ లైట్ ఏరియాకు వెళ్లు

ఇంట్లో అందరూ నానా తిట్లు తిట్టారు. ఒకపక్కను నా బాయ్ ఫ్రెండ్ తో రోజూ ఇబ్బందులుపడుతుంటే.. మరోపక్క ఇంట్లో వాళ్ల టార్చర్ భరించలేకపోయేదాన్ని. మా ఇంట్లో ఉండొద్దూ.. నీవు ఎక్కడో రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి అక్కడే బతుకు అంటూ నానారకంగా మాట్లాడారు.

అలాంటి బేవార్స్ గాన్ని ఎవరూ ప్రేమించరు

అలాంటి బేవార్స్ గాన్ని ఎవరూ ప్రేమించరు

ప్రతి అమ్మాయి ఎంతో నమ్మకంతో ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. తనను జీవితాంతం బాగా చూసుకునే వాడితోనే అన్నీ పంచుకోవాలనుకుంటుంది. రోడ్డుపై ఉండే ప్రతి బేవార్స్ గాడ్ని ప్రేమించి.. వాడితో గడిపి పరువును బజార్ పాలు చేసుకోవాలని ఏ అమ్మాయి అనుకోదు. కానీ కొందరివల్ల ఇలా నాలాంటి చాలామంది అమ్మాయిలు అభాసుపాలు కావాల్సి వస్తుంది.

ఇప్పుడు హ్యాపీ

ఇప్పుడు హ్యాపీ

ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా వాళ్లు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు ఒక పాప. కానీ ఆ రోజులు గుర్తొస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. అలాంటి రోజులు నాకే కాదు. ఏ అమ్మాయికి రాకూడదని నేను కోరుకుంటున్నాను.

English summary

My story I Became A Prostitute In Their Eyes For Sleeping With The Man I Love

My story I Became A Prostitute In Their Eyes For Sleeping With The Man I Love