ఫేస్‌బుక్‌ లో నా ఫొటోను ఎలా అంటే అలా వాడుతున్నారు.. నా పెళ్లి కూడా చెడిపోయింది - My Story #15

Written By:
Subscribe to Boldsky

ఫేస్ బుక్ కొందరి జీవితాలను నాశనం చేస్తుంది. కొందరి జీవితాల్లో వెలుగును తెస్తుంది. కొందరు ఫేస్ బుక్ ద్వారా ఫేమస్ అయిపోతారు. ఇంకొందరు ఫేస్ బుక్ ద్వారా తమ ఫేమ్ పోగొట్టుకుంటారు. ఏది ఏమైనా ఫేస్ బుక్ అనేది చాలా మంది జీవితాలను కుదిపేస్తుంది. అలాగే ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చిందో మీరూ చూడండి.

తను నా బెస్ట్ ఫ్రెండ్

తను నా బెస్ట్ ఫ్రెండ్

నా పేరు రేఖ.. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు రేణుక ఇద్దరమూ స్కూల్ ఫ్రెండ్స్. మా ఇద్దరి అభిరుచులు, అలవాట్లు, చివరకు మేము పుట్టిన జన్మ నక్షత్రాలు, మా రాశులు అన్నీ ఒక్కటే. ఇద్దరిదీ ఒకే ఆలోచన. సేమ్ టు సేమ్ థింక్ చేసేవాళ్లం. అందుకే మేము మా చదువులు పూర్తి చేసి ఇన్నాళ్లైనా ఇంకా కలిసే ఉన్నాం.

సరదాగా ఉండేవాళ్లం

సరదాగా ఉండేవాళ్లం

మేమిద్దరం ఒకే కాలేజీలో చేరాం. కాలేజీలో కూడా మేమిద్దరం ఒకే గ్రూప్ తీసుకున్నాం. మేమిద్దరం పక్కన ఉన్న అమ్మాయిలను ఒక రేంజ్ లో ఆటపట్టించేవాళ్లం. జూనియర్లను ర్యాంగింగ్ అంటూ సరదాగా ఆట పట్టించేవాళ్లం. ఇలా కాలేజీలో మా ఇద్దరి అల్లరి హద్దే ఉండేది కాదు. కానీ అన్నీ సరదాగా మాత్రమే చేసేవాళ్లం. సీరియస్ గా అయ్యే పనులు ఏవీ చేయలేదు.

నకిలీ ఫేస్‌బుక్‌

నకిలీ ఫేస్‌బుక్‌

అలాగే ఒక నకిలి ఫేస్‌బుక్‌ అకౌంట్ మేమిద్దరం కలిసి క్రియేట్ చేశాం.ఒక ఫేక్ ఫొటో పెట్టాం. వెంటనే మా ఫేస్‌బుక్‌ లో రిక్వెస్ట్ ల మోత మోగింది. ఒక్కటే రోజు వేలమంది నుంచి రిక్వెస్ట్ లొచ్చాయి. దాంతో మాకు ఫుల్ ఆనందం కలిగింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరినీ ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకున్నాం.

కామెంట్స్ బాక్స్ లు నిండిపోయేవి

కామెంట్స్ బాక్స్ లు నిండిపోయేవి

మేము ఏ ఫొటో పెట్టినా కామెంట్స్ బాక్స్ దద్దరిల్లిపోయేది. అయితే మేము అన్నీ ఫేక్ ఫొటోలే పెట్టేవాళ్లం. మా వర్జినల్ ఫొటో పెట్టేవాళ్లం కాదు. హీరోయిన్ల ఫొటోలు ఎక్కువగా పెట్టేవాళ్లం.

పవన్ కామెంట్ కేక

పవన్ కామెంట్ కేక

ఒక రోజు మేము పెట్టిన ఫొటోకు రెగ్యులర్ గా వచ్చినట్లే కామెంట్స్ వచ్చాయి. వావ్.. నైస్, ఓసమ్ అంటూ కొన్ని వేల కామెంట్స్ వచ్చాయి. కానీ పవన్ అనే వ్యక్తి మాత్రం మీ ఫొటోలతో పాటు సోషల్ మీడియాను సామాజిక అంశాలకు, మంచి విషయాలకు కూడా ఉపయోగించండి అంటూ కామెంట్ పెట్టాడు.

వందలాది రిప్లై లు

వందలాది రిప్లై లు

ఆ కామెంట్ కు వందలాది రిప్లై లు వచ్చాయి. అవును.. భయ్యా నువ్వు చెప్పింది కరెక్టే. సోషల్ మీడియాను కేవలం ఫొటోల కోసమే ఉపయోగించకూడదు. కొన్ని రకాల మంచి విషయాలకు కూడా ఉపయోగిస్తే అందరికీ మేలు చేసిన వాళ్లం అవుతామని కొన్ని వందల మంది అతని కామెంట్ కు రిప్లై ఇచ్చారు.

పవన్ మాట విన్నాం

పవన్ మాట విన్నాం

మేము కూడా పవన్ కు రిప్లై ఇచ్చాం. ఇక నుంచి మా ఫొటోలతో పాటు ఏదైనా మంచి విషయాలను కూడా షేర్ చేస్తాం అని రిప్లై ఇచ్చాం. తర్వాత రోజు నుంచి మేము కూడా ఫొటోలు కాకుండా అందరికీ ఉపయోగపడే విషయాలను షేర్ చేయడం మొదలుపెట్టాం. నిరుద్యోగులకు ఉపయోగపడే సమాచారంతో పాటు ఇంకా చాలా మంచి విషయాలను షేర్ చేయడం ప్రారంభించాం.

ఫ్రెండ్స్ అయ్యాం

ఫ్రెండ్స్ అయ్యాం

పవన్ కు మేము మెసెంజర్ లో మెసేజ్ చేశాం. కొద్ది కాలంలోనే పవన్, మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నా ఫ్రెండ్ రేణుక అతని గురించి అంతగా పట్టించుకునేది కాదు. నేను మాత్రం అతనితో ఎక్కువగా చాట్ చేసేదాన్ని. అతనికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాడు. నేను కూడా అన్ని రకాల విషయాలను చెప్పాను.

ఫేక్ ఐడీ

ఫేక్ ఐడీ

ఒక రోజు అతనికి నేను అన్ని విషయాలు చెప్పాను. ఒక రోజు ఫేస్ బుక్ ఐడీ గురించి కూడా చెప్పాను. నా పేరు రేఖ.. నా ఫ్రెండ్ పేరు రేణుక..

మేమిద్దరం కలిసి క్రియేట్ చేసిన ఫేక్ ఫేస్ బుక్ ఐడీ ఇది అని నేను చెప్పాను. అతను దానికి ఆశ్యర్యపోయాడు. ఎందుకిలా చేశారు అని అడిగాడు. ఏదో టైమ్ పాస్ కోసం అలా చేశాం అని చెప్పాను.

ఫొటోలు పంపాను

ఫొటోలు పంపాను

తర్వాత అతని రీసెంట్ ఫొటోలు మాకు పంపాడు. నేను కూడా నేను, రేఖ దిగిన ఫొటోలను పంపాను. మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. మీ ఒరిజనల్ ఫొటోలతో ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవొచ్చుగా.. మీ ఫొటోలను పెట్టుకోవొచ్చు కదా.. ఎందుకు హీరోయిన్ల ఫొటోలను పెడుతున్నారని అడిగాడు.

పెళ్లి కుదిరింది

పెళ్లి కుదిరింది

ఎందుకో మాకు అలా చేయాలని అనిపించలేదు. అందుకే ఇలా ఫేక్ ఐడీ క్రియేట్ చేసుకున్నాం అని చెప్పాను. తర్వాత కొన్ని రోజులకు రేణుకకు పెళ్లి కుదిరింది. రేణుక తనకు కాబోయే భర్తతో ఫోన్ లో మాట్లాడాలనుకుంది. కానీ మాట్లాడలేకపోతుంది.

మా ఫొటోలు షేర్ చేశాను

మా ఫొటోలు షేర్ చేశాను

తర్వాత నేనే అతని కి ఫోన్ చేసి నేను రేణుక చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. తను నీతో మాట్లాడడానికి భయపడుతుందని చెప్పాను. అతను నాతో బాగానే మాట్లాడాడు. తర్వాత నేను రేణుక కలిసి దిగిన ఫొటోలను అతనికి పంపాను. తర్వాత అతని నుంచి వచ్చిన మెసేజ్ లకు నేను షాక్ అయ్యాను.

ఫేస్ బుక్ గ్రూపులలో నా ఫొటో

ఫేస్ బుక్ గ్రూపులలో నా ఫొటో

రేణుక పక్కన ఉన్న నా ఫొటోను ఎవరో క్రాప్ చేసి కొన్ని ఫేస్ బుక్ గ్రూప్ లలో పెట్టారని చెప్పాడు. నేను ఇంతకు ముందు నీ ఫొటోను చాలా ఫేస్ బుక్ గ్రూప్స్ లలో చూశానన్నాడు. కొందరు నీ ఫొటో పెట్టి పైన గుడ్ మార్నింగ్ డార్లింగ్స్ అనే క్యాప్షన్ పెట్టి గ్రూప్స్ లలో పోస్ట్ చేస్తున్నారని చెప్పాడు. దానికి చాలా రకాల అసభ్య కామెంట్స్ కూడా వస్తున్నాయన్నాడు. నాకు ఏమి అర్థం కాలేదు.

పవన్ కు మాత్రమే పంపించాను

పవన్ కు మాత్రమే పంపించాను

తర్వాత ఆలోచిస్తే ఆ ఫోటో నేను పవన్ కు మాత్రమే పంపించాను. అది గుర్తొచ్చి అతనికి ఫోన్ చేస్తే నేను ఒక్క గ్రూప్ లో మాత్రమే నీ ఫొటో పెట్టాను అని చెప్పాడు.

వందలాది గ్రూపులలో నా ఫొటో

వందలాది గ్రూపులలో నా ఫొటో

కానీ నా ఫోటో ఇప్పుడు వందలాది ఫేస్ బుక్ గ్రూప్స్ లో , వాట్సాప్ గ్రూప్ లో స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఎలా అంటే అలా వాడుకుంటున్నారు. ఒక్క వ్యక్తికి నేను ఫొటో పంపడం వల్ల అది ఇప్పుడ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుంది.

పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్

పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్

నాకు తెలిసిన వారంతా నా ఫోటోను అలా చూసి నాపై జాలిపడుతున్నారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగింది. నాకు కుదిరిన ఒక పెళ్లి సంబంధం కూడా కేవలం ఫేస్ బుక్ లో ఫొటో గురించి తెలియడంతోనే రద్దు అయ్యింది. ఇప్పుడు తెలిసిందేందంటే సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే జీవితం నాశనం అవుతుందనే విషయం నాకు తెలిసింది.

English summary

My story We Created a Fake Facebook ID for Fun, It Killed Marriage Life!

My story We Created a Fake Facebook ID for Fun, It Killed Marriage Life!
Story first published: Friday, December 22, 2017, 17:00 [IST]