అతనిపై రోజురోజుకు మోజు పెరుగుతోంది.. ఏం చేయమంటారు? - My Story #18

Written By:
Subscribe to Boldsky

నాకు పెళ్లి అయి చాలా సంవత్సరాలు అయ్యింది. నాకు కూతురు ఉంది. నేను ఒక ఎంఎన్ సీ కంపెనీలో పని చేస్తున్నాను. పెళ్లి అయినప్పటి నుంచి నా భర్తపై నాకు అంతగా ఇష్టం లేదు. నన్ను అతను ఏ విషయంలోనూ సంతృప్తి పరచడం లేదు. నాపై ప్రేమ చూపడు.

లైంగికంగా ఆనందం లేదు

లైంగికంగా ఆనందం లేదు

లైంగికంగా కూడా నన్ను అంతగా ఆనందపరచడు. కానీ మా ఇద్దరికీ పాప ఉండడం వల్ల నేను అతనితో కాపురం చేస్తున్నాను. నాకోసం తను ఇబ్బందిపడకూడదనే కారణంతోనే నాకు అతనితో జీవితం కొనసాగించడం ఇష్టం లేకున్నా అలాగే సంసారం చేస్తున్నా.

ఆఫీసులో ఒకతనిపై ప్రేమ

ఆఫీసులో ఒకతనిపై ప్రేమ

మా ఆఫీసులో నాతో పాటు పని చేసే ఒక వ్యక్తి విషయంలో నేను ఆకర్షణకు లోనవుతున్నాను. అతనికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. అతని భార్య కూడా చాలా బాగుంటుంది. అయితే ఆఫీసులో నేను అతను కలిసి రోజూ పని చేయడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అతను నాతో చాలా బాగా మాట్లాడుతాడు. నాతో చాలా ప్రేమగా మెలుగుతాడు.

హ్యాండ్ సమ్ గా ఉంటాడు

హ్యాండ్ సమ్ గా ఉంటాడు

నన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తాడు. చాలా హ్యాండ్ సమ్ గా ఉంటాడు. నేను ఆఫీసులో వర్క్ పరంగా ఏదైనా తప్పు చేసినా నాకే సపోర్ట్ ఇస్తాడు. అందువల్ల అతను నాకు చాలా బాగా నచ్చుతున్నాడు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నాకు ఎక్కడ దొరకని ప్రేమ అతని వల్ల రోజూ ఆఫీసులో దొరుకుతుంది.

ఇద్దరం కలిసే తింటాం

ఇద్దరం కలిసే తింటాం

రోజూ ఇద్దరం మధ్యాహ్నం కలిసే భోజనం చేస్తాం. నేను అతని కోసమే ప్రత్యేకంగా వంటలు తయారు చేసి తీసుకెళ్తుంటా. కాస్త రుచి చూడమంటూ కొసిరికొసిరి అతనికి వడ్డిస్తా. అతను తిన్న తర్వాత నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు.

మోజు పెరుగుతుంది

మోజు పెరుగుతుంది

రోజురోజుకు అతనిపై నాకు మోజు పెరుగుతుంది. అతనితో ఒక్కసారైనా గడపాలని కోరిక కలుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆలోచనే తప్పని నా మనస్సు నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. తనని చూస్తే మాత్రం నా కోరికను ఆపుకోలేకపోతున్నా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.

తప్పు అని తెలిసినా..

తప్పు అని తెలిసినా..

ఇది తప్పుడే ఆలోచనే అని నాకు తెలుసు. నేను తప్పు చేయకూడదంటే అతని నుంచి దూరం కావాలి. లేదంటే అక్కడ జాబ్ మాసేని ఇంకోచోట జాయినవ్వాలి. కానీ బయట ఎక్కడ కూడా జాబ్ దొరకడం కూడా కష్టమే. నా కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలో కాస్త సలహా ఇవ్వండి.

- ఒక యువతి

యువతి అడిగిన ప్రశ్నకు.. సైకాలజిస్ట్ సమాధానం

యువతి అడిగిన ప్రశ్నకు.. సైకాలజిస్ట్ సమాధానం

ఆఫీస్ లో చాలామంది కోలిగ్స్ ప్రేమలో పడుతుంటారు. అంతేకాకుండా వారితో శృంగారంలో పాల్గొనాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా ఆఫీసుల్లో కోలిగ్స్ మధ్య మంచి వాతావరణం ఉంటుంది. రోజూ ఒకరితో ఒకరు ఆఫీసుకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇది సహజమే

ఇది సహజమే

ఇంటికన్నా ఎక్కువ సేపు ఆఫీసుల్లో ఉండడం వల్ల సహోద్యోగులతో చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఇది సహజమే. ఒకవేళ పెళ్లికాని వారు అయితే ఇద్దరి మధ్య ఉన్న ఏర్పడ్డ ప్రేమ వల్ల పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

జీవితాలు నాశనం

జీవితాలు నాశనం

ఇద్దరు పరస్పరం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం అనేది మంచి విషయమే. కానీ వివాహం అయిన వ్యక్తులు కోలిగ్స్ తో ప్రేమలో పడడమే చాలా ప్రమాదకరం. దీంతో జీవితాలు నాశనం అవుతాయి. ప్రస్తుతం మీరు అదే స్థితిలో ఉన్నారు.

వైవాహిక జీవితం దెబ్బతింటుంది

వైవాహిక జీవితం దెబ్బతింటుంది

ఇక్కడ మీరిద్దరికీ వివాహాలయ్యాయి. అతను ఉద్యోగరీత్యా మీతో సన్నితంగా ఉంటున్నాడు. దాన్ని మీరు అపార్థం చేసుకుని ముందుకెళ్తే మీ వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మీ ప్రేమను అతను కూడా అంగీకరించి మీరిద్దరూ లైంగికంగా కలిస్తే ఇద్దరి వైవాహిక జీవితాలు దెబ్బతింటాయి.

కోరికలను నియంత్రించుకోలేకుంటున్నారా?

కోరికలను నియంత్రించుకోలేకుంటున్నారా?

అతని నమ్ముకున్న అతని భార్య, మిమ్మల్ని నమ్ముకున్న మీ భర్తను మీరు మోసం చేసినట్లవుతుంది. ఈ విషయం మీకు తప్పని తెలిసినా నేను కోరికలను నియంత్రించుకోలేకపోతున్నానని మీరు అంటున్నారు. ఇది ఏమాత్రం సరికాదు. మీరు తప్పు చేయకూడదని మనస్సులో అనుకుంటే మిమ్మల్ని ఎవరూ తప్పు చేయించలేరు.

లైంగిక సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారు

లైంగిక సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారు

కానీ మీరు ఒక్క పక్క అతనితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని మనస్సులో అనుకుంటూనే మరోపక్క ఇది తప్పు కదా అని భావించడం సరికాదు. మీలో ఉన్న ఆలోచనను మీరు పూర్తిగా తొలగించుకోవాలి. మీరు మీ భర్తతో మీ సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

సంతృప్తి లేదని..

సంతృప్తి లేదని..

అతను నీతో ప్రేమగా మెలిగిలా మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి. మీ భర్త మీపై ప్రేమ చూపడం లేదని, నిన్ను లైంగికంగా ఆనందపరచడం లేదని ఇలా పక్క తొక్కులు తొక్కడం మంచిదికాదు.

క్షణకాలమే సంతృప్తి

క్షణకాలమే సంతృప్తి

అలా చేస్తే క్షణకాలం పాటు నీవు సంతృప్తి చెందొచ్చు కానీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీరు సహోద్యోగితో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆ విషయం తర్వాత ఆఫీసు మొత్తం తెలిసి మీ పరువు పోతుంది. మీకు ఆఫీసులో ఉండే గౌరవం కూడా ఉండదు.

సరైన సుఖం లేకపోవడమే

సరైన సుఖం లేకపోవడమే

కోలిగ్స్ పట్ల ఆకర్షణకు గురికావడానికి ప్రధాన కారణం భర్త లేదా భార్యతో సరైన సుఖం పొందకపోవడమే. మీ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే మీరు మీ లిమిట్స్ దాటి ప్రవర్తించకండి. మీరు ఆఫీసులో మీకున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. మీరు మీ కోరికలను నియంత్రించుకుంటే అతనితో బాగా కలిసి మెలిసి మాట్లాడుతూ ఆఫీసులో నీ వర్క్ చేసుకోవొచ్చు.

భర్తతో అనుభవించు

భర్తతో అనుభవించు

కొత్త ఆఫీసులో జాయిన్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. అందువల్ల ముందుగా మీరుభర్త ద్వారా లైంగికంగా సంతృప్తి చెందడానికి ప్రయత్నించండి. ఇతర ఆలోచనలను విడిచిపెట్టి చక్కగా పని చేసుకోండి. భర్తతో మంచి ఆరోగ్యకరమైన శృంగారాన్ని అనుభవించు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకు.

English summary

Mystory How do I end my extra marital affair?

Mystory How do I end my extra marital affair?