మీ రాశుల ప్రకారం మీరు ఏ రకమైన వివాహాన్ని చేసుకోబోతున్నారో తెలుసుకోవచ్చు !

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

పెళ్లంటే నూరేళ్ల పంట అనేది పెద్దల మాట. అందుకే ఈ వేడుకలో వధూవరుల జాతకాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. జన్మరాశుల బట్టి వారి గుణగణాలు ఆధారపడి ఉంటాయనేది పెద్దల నమ్మకం. అందుకే జన్మ రాశులకు సరిపడే ఇతర రాశులకు చెందిన వారితోనే వివాహాలు జరపడానికి మొగ్గుచూపుతారు.

ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తారు. హిందూ జ్యోతిషం ప్రకారం అమ్మాయి లేదా అబ్బాయి జన్మరాశులకు సరిపోయేవారితో వివాహం జరిగితే అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. కాబట్టి వివాహ సమయంలో అనుకూలమైన జాతకులను ఎంపిక చేసుకుంటారు. మరి ఇప్పుడు మీరు మీ జాతకచక్రాన్ని బట్టి ఎలా పెళ్ళి చేసుకుంటారో తెలుసుకుందాం..

మేషం :

మేషం :

మేషరాశి వారు నిస్సంకోచంగా మరియు సాహసోపేతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు ఎంతో భారీగా ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. దాదాపు మీరు చేసుకోబోయే వివాహం, ఎంతో వైభవంగా చాలా ఖరీదు తో కూడుకొని ఉండే వివాహాన్ని చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంతో తేజోవంతమైన రాశి వారు కావడంతో వివాహం కోసం మరీ అంత ప్రకాశవంతమైన రంగులు కాకుండా తేలికపాటి రంగులు కలిగిన దుస్తులు ఎంచుకుంటారు.

మీ రాశిని బట్టి మీకు పెళ్లి భాజాలు ఎప్పుడో తెలుసుకోండి ?

వృషభం :

వృషభం :

సంప్రదాయం అనేది మీ నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. విలాసవంతంగా వేడుకలు చేసుకోవాలి మరియు ఎంతో ఉన్నతంగా ఉండాలి అని మీరు ఎక్కువగా కోరుకుంటారు. అన్నింటిలో అత్యుత్తమం కావలి అని కోరుకునే మీరు, ఇందులో కూడా విలాసవంతమైన ఖరీదైన హోటళ్లలో మీ పెళ్లి మరియు వేడుకలు జరగాలని కోరుకుంటారు. వారసత్వ కట్టడాలలో మరియు ఎంతో ఖ్యాతి గడించిన అందరికి తెలిసిన ప్రదేశాల్లో మీ పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వధువు ధరించే దుస్తులు ప్రముఖ డిజైనర్ల చేత రూపొందించబడినవి అయి ఉంటాయి. సొగసుకు సారాంశంగా అవి మీకు నిలుస్తాయి.

మిథునం :

మిథునం :

సరదా మరియు వేడుకతో కూడిన వాతావరణంతో మీ పెళ్లి జరుగుతుంది. ఎందుచేతనంటే ఏ రాశి యొక్క వ్యక్తులు సమయాన్ని ఎంతో గొప్పగా గడపటానికి ఇష్టపడతారు. ఆరోజు మొత్తంలో ఒక్క క్షణం కూడా మీరు నిరుత్సాహపడరు. సంగీతం, ఆహారం, బంధుమిత్రులతో ప్రతి క్షణం ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. మీ జీవితం మొత్తంలోకి అత్యంత ప్రకాశవంతమైన, ఉత్తేజవంతమైన రోజుగా అది నిలిచిపోతుంది. మీకే కాకుండా ఆ వేడుకకు వచ్చిన అతిధులకు కూడా అది ఒక మధురానుభూతిని మిగులుస్తుంది.

కర్కాటకం :

కర్కాటకం :

ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు వారి హృదయం ఎక్కడైతే ఉంటుందో అదే వారు ఇల్లుగా భావిస్తారు. కుటుంబ సభ్యులు మరియు అత్యంత దగ్గరి స్నేహితుల మధ్య పెళ్లి జరిగిపోతుంది. సరదాలకు మరియు ఉల్లాసవంతమైన వాతావరణానికి అస్సలు కరువు ఉండదు. మీరు ఏ ప్రదేశాన్ని అయితే అత్యంత ఎక్కువగా ఇష్టపడతారో అక్కడే వివాహం చేసుకోవాలని భావిస్తారు. ఊరి పొలిమేరలో ఉండే మీ కుటుంబం యొక్క ఫామ్ హౌస్ లో చేసుకోవడం ఉత్తమమైన ఎంపిక. ఈరోజు మొత్తం కొద్దిగా భావోద్వేగంగా గడుపుతారు. ఎందుకంటే, కర్కాటకం అనేది కొద్దిగా భావోద్వేగమైన రాశి.

సింహం :

సింహం :

సింహరాశి అన్ని రాశులకు రాజు. ఈ రాశి వారు అత్యంత వైభవంగా వివాహం జరుపుకోవడానికి ఇష్టపడతారు. నాటకీయంగా, విలాసవంతంగా మరియు నిస్సంకోచంగా వివాహం చేసుకోవడానికి పరితపిస్తారు. వీరి యొక్క వివాహం రాజుల వివాహం లాగా, రాజరిక పద్దతిలో వివాహానికి ఏమాత్రం తీసిపోని విధంగా జరుగుతుంది. మీరు ఎంచుకోబోయే ప్రదేశం మరియు వేసుకొనే దుస్తులు మీ యొక్క నిగూఢమైన అభిరుచిని తెలియజేస్తాయి. ఎంతో తేజోవంతమైన రంగులు, మీ యొక్క మొత్తం వేడుక పై ఆధిపత్యం ప్రదర్శిస్తాయి. మీ వివాహంలో చోటుచేసుకోబోయే ప్రతి ఒక్క సంఘటన జీవితంలో ఎప్పుడూ ఊహించలేనంత పెద్దగా జరుగుతుంది.

కన్య :

కన్య :

ఖచ్చితత్వంతో కూడుకున్న వ్యక్తులు కన్యారాశి వారు. వీరి యొక్క వివాహ వేడుకలు మనం చాలా జీవనవిధాన పత్రికల్లో చూసే పేజీల్లో ఎలా అయితే వివాహాలు జరుగుతాయో, వాటికి దగ్గరగా వాటిని నిజం చేస్తూ వీరి యొక్క వివాహాలు జరుగుతాయి. మంచి మద్యం మరియు చాలా కోమలమైన పూవ్వులు, చూడముచ్చటైన రంగులతో అలంకరించిన ప్రదేశం మరియు ప్రకాశవంతమైన దుస్తులు ధరించి పెళ్లి చేసుకుంటారు. ప్రతి యొక్క విషయాన్ని ఎంతో ఖచ్చితత్వంతో ప్రణాళికలు రచిస్తారు. వీరు చేసుకోబోయే పెళ్లి గురించి ఆ ఊరిలో అందరూ మాట్లాడుకుంటారు ( అన్ని మంచి విషయాల గురించే మాట్లాడుకుంటారు ).

తుల :

తుల :

అన్ని నెలల్లో కెల్లా అక్టోబర్ మాసంలో ఎందుకు పెళ్లిళ్లు ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడతారో మీకు తెలుసా? ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం పై మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం వేసిందా? ఎందుకంటే తుల రాశి వారు ( సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 22 ) వివాహాన్ని పాలిస్తారు. ఈ రాశి వారు అత్యంత సమతుల్యతతో వ్యవహరిస్తారు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, వారి వివాహాలు మాత్రం ఎప్పుడు సమతుల్యతతో మరియు ఖచ్చితత్వంతో జరగవు. ఎందుచేతనంటే, ఒక సాహసగాథలాగా వారి వివాహం జరుగుతుంది మరియు వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఊహాజనితమైన అలంకరణ, దేశవిదేశాల నుండి తెప్పించబడ్డ పూలు మరియు కొవ్వొత్తుల వెలుగు ఆరోజు పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి.

వృశ్చికం :

వృశ్చికం :

ఎంతో గొప్పగా, అద్భుతంగా, ఖరీదుగా విలాసవంతమైన రంగులు, నాటకీయత, శక్తి మరియు ఖచ్చితత్వంతో వీరి యొక్క వివాహం జరుగుతుంది. ఈ రాశి యొక్క వ్యక్తులు ఎక్కువ వైభవంగా పెళ్లి జరుపుకుంటారు. వివాహానికి వచ్చిన అతిధులను మెప్పించడానికి దేశవిదేశాల నుండి నృత్యకారులు వచ్చినా ఆశ్చర్యపోకండి. మీరు పెట్టే ఆహారం మరియు పానీయాలు మీ యొక్క అభిరుచిని తెలియజేస్తాయి. ఈ రాశి వధువు లేదా వరుడు వచ్చినవారిని చూపుతిప్పుకోనివ్వరు. ఎందుచేతనంటే వారి యొక్క శైలి మరియు సొగసుకి చిరునామాగా నిలుస్తారు.

ధనస్సు :

ధనస్సు :

ఈ రాశివారు ఎంతో సాహసోపేతంగా వ్యవహరిస్తారు. వీరు వివాహాలను కొద్దిగా దూరప్రదేశాల్లో జరుపుకుంటారు. రోజు మొత్తం ఎంతో సరదా కార్యక్రమాలతో గడిపేస్తారు. వచ్చినవారిని కూడా ఎంతో ఆనందపరుస్తారు. దూరప్రదేశాల్లో వివాహం చేసుకొనే అవకాశం ఎక్కువ. సౌకర్యవంతంగా గడపటానికి మీరు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. ముఖ్యంగా మీరు ఎంచుకొనే దుస్తుల్లో సౌకర్యవంతంగా ఉన్నవాటికి ప్రాధాన్యతను ఇచ్చి అటువంటి వాటినే ఎంచుకుంటారు.

మకరం :

మకరం :

సంప్రదాయబద్ధంగా వ్యవహరించే మకర రాశివారు ఆ రోజుని ఎంతో గొప్పగా మరియు అందంగా జరుపుకుంటారు. వారసత్వ ప్రదేశాల్లో, మీకు నచ్చిన ప్రదేశాల్లో అందరూ మెచ్చే దగ్గర అత్యంత గొప్పగా అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉండే దగ్గర మీ వివాహం జరుగుతుంది. అమ్మాయిలు కుటుంబ వారసత్వంగా వచ్చే దుస్తులను ధరించడం మంచిది. వారి యొక్క అమ్మమ్మ లేదా నాన్నమ్మ బహుకరించిన బహుమతిని వేసుకోవడం ఉత్తమం. కానీ, వాటిలో ఎటువంటి ఆధునికపోకడలు లేకుండా చూసుకోవడం మంచిది.

కుంభం :

కుంభం :

ఎంతో ఉత్సాహవంతంగా దేనిని పెద్దగా పట్టించుకోని కుంభరాశి వారు పెళ్లి విషయంలో సంప్రదాయాలకు చాలా దూరంగా జరుపుకుంటారు. సనాతన ఆచారాలకు దూరంగా వీళ్ళు వారి పెళ్లిని జరుపుకుంటారు. కావున ఇలాంటి వారి పెళ్ళికి వెళ్లే అతిధులు అనుకోని వాటిని చూడటానికి సిద్దపడి వెళ్ళాలి. ఉదాహరణకు వధువు పెద్దగా అలంకరించుకోకుండానే పెళ్లి పీటల పై కూర్చోవచ్చు, మాములు దుస్తులు ధరించి ఉండవచ్చు.

మీనం :

మీనం :

ఈ రాశివారు ఊహల్లో ఎక్కువగా బ్రతుకుతుంటారు. ఎదో సినిమాల్లో జరిగే వివాహంలా వీరి వివాహం జరగాలని భావిస్తుంటారు. ప్రేమని పెంపొందించే సంగీతం, ఖరీదైన అలంకరణ మరియు అందమైన చెలికత్తెలు ఇలా ఎన్నో ఉహించుకుంటుంటారు. మీ యొక్క ఊహలు నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు నిజానికి చాలా దూరంగా కూడా జరగవచ్చు. మీ యొక్క వివాహం సాహసోపేతమైన కథలకు చాలా దగ్గరా మరియు వాటినే చుస్తున్నామా అనే అనుభూతిని కలిగించే విధంగా కూడా ఉంటాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    This is the kind of wedding you will have as per your zodiac sign

    The bold and adventurous Aries is nothing if not a big planner when it comes to events of any importance. You are most likely to have a big fat Indian wedding where spontaneity will be your signature. Being a fire sign, your choice of colours will incline towards warmer tones while shortlisting your designer attire. (Image: still from the movie Band Baaja Baaraat)
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more