ఆర్మీ ఉద్యోగి నాతో సుఖం అనుభవించి... అలా చేయాలనుకున్నాడు - My Story #32

Written By:
Subscribe to Boldsky

ఆర్మీలో పని చేసే అతను అంటే ఎవరికైనా చాలా గౌరవం ఉంటుంది. నాకు కూడా వాళ్లంటే చాలా గౌరవం ఉండేది. నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఆర్మీలో పని చేసే అతను పరిచయం అయ్యాడు. హైట్ వెయిట్ ఫిజికల్ గా బాగున్నాడు.

చాటింగ్

చాటింగ్

నా ఫ్రెండ్ అతని ఫేస్ బుక్ లో ఫ్రెండ్ కావడంతో అతని ఫ్రెండ్స్ లిస్ట్ లో నా ప్రొఫైల్ చేసి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నేను యాక్సెప్ట్ చేశాను. తర్వాత అతనితో చాటింగ్ మొదలైంది. రోజూ అతని డ్యూటీ గురించి డ్యూటీ చేసే ప్రాంతంలో సెల్ఫీలు దిగుతూ ఫొటోలు పంపేవాడు. నేను కూడా అప్పుడప్పుడు సెల్ఫీలు పంపేదాన్ని.

విజయవాడ వస్తా అన్నాడు

విజయవాడ వస్తా అన్నాడు

సెలవుల్లో విజయవాడకు వస్తున్నానని చెప్పాడు. అతనిది విజయవాడే. మాది గుంటూరు. అతను విజయవాడ వచ్చాక నాకు ఫోన్ చేశాడు. ఒకసారి బయట కలిసి మాట్లాడుకుందామని చెప్పాడు. నాకు కూడా అతనితో మాట్లాడాలని ఆసక్తి ఉండడంతో వెంటనే రెడీ అయి విజయవాడకు వెళ్లాను.

అతని నిజాయితీ నచ్చింది

అతని నిజాయితీ నచ్చింది

నాతో అతని విషయాలన్నీ చెప్పాడు. అతను చిన్నప్పటి నుంచి

ఎన్ని ఇబ్బందులుపడ్డాడో వివరించాడు. అలాగే ఉద్యోగం సాధించడానికి అతను పడ్డ కష్టాలను అన్నీ నాకు చెప్పాడు. నాకు అతని నిజాయితీ నచ్చింది. అలాంటి వ్యక్తి నాతో రోజూ మాట్లాడడాన్ని చాలా సంతోషంగా ఫీలయ్యేదాన్ని.

అమ్మవారి ఆలయానికి వెళ్లాం

అమ్మవారి ఆలయానికి వెళ్లాం

తర్వాత మేమిద్దరం బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాం. అయితే నేను అమ్మవారిని ఆ అబ్బాయితో పెళ్లి జరగాలని కోరుకున్నాను. అతనితో జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకున్నా.అయితే అప్పటి వరకు అతని మనస్సులో ఏముందో కూడా నాకు తెలియదు. కానీ అతను నాకు నచ్చడంతో ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను.

డెహ్రడూన్ లో పోస్టింగ్

డెహ్రడూన్ లో పోస్టింగ్

అతను అప్పుడు శిక్షణలో ఉండేవాడు. తర్వాత డెహ్రడూన్ లో అతనికి పోస్టింగ్ వచ్చింది. ఇన్ స్ర్టక్టర్ గా అతను జాబ్ లో జాయినయ్యాడు. నేను కొన్ని యూపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధం అయ్యేదాన్ని. అయితే ఒక పరీక్ష రాయడం కోసం నేను ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది.

అక్కడికి రమ్మన్నాడు

అక్కడికి రమ్మన్నాడు

అప్పుడు అతనికి ఫోన్ చేశాను. అతను నేను వెళ్లాల్సిన సెంటర్ కు సంబంధించి అంతా గైడెన్స్ ఇచ్చాడు. మొత్తానికి పరీక్ష రాశాను. తర్వాత అతను ఫోన్ చేశాడు. డెహ్రడూన్ వచ్చేసెయ్ అన్నాడు. నేను వెళ్లాలా వద్దా అని చాలా సేపు ఆలోచించాను.

అతని కోసం వెళ్లాను

అతని కోసం వెళ్లాను

మొత్తానికి డెహ్రడూన్ వెళ్లాను. అతను ఆ రోజు లీవ్ పెట్టుకుని వచ్చి నన్ను కలిశాడు. అక్కడ ఉన్న చాలా ప్రాంతాలను నాకు చూపించాడు. ఒకచోట మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ నాకు అతను ప్రపోజ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

నైట్ అక్కడే

నైట్ అక్కడే

వ్యక్తిత్వం, సమాజంలో హోదా అన్నీ బాగుండడంతో నేను కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేను ఆ రోజు అక్కడే ఉండేందుకు నాకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. నేను ఆ రోజు నైట్ అక్కడే ఉండి ఉదయమే బయల్దేరి వద్దామనుకున్నాను.

డ్రెస్ మార్చుకుంటుండగా..

డ్రెస్ మార్చుకుంటుండగా..

మా ఇద్దరి కోసం అతను ఒక రూమ్ తీసుకున్నాడు. నైట్ డిన్నర్ చేసి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చొన్నాం. తర్వాత అతనికి ఫోన్ వచ్చింది. నేను రూమ్ లోకి వెళ్లి డ్రెస్ మార్చుకుంటూ ఉన్నాను. సడన్ గా అతను లోపలికి వచ్చాడు.

పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కదా

పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కదా

సరే, ఎలాగో పెళ్లి చేసుకోబేయో వ్యక్తే కదా అని నేను కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత అతను నన్ను ఇంకా ఏదో చేయాలని భావించాడు. అయితే నేను అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు.

వాస్తవానికి అతని మనస్సులో అది ఉంది

వాస్తవానికి అతని మనస్సులో అది ఉంది

నేను ఉదయం లేచిన వెంటనే మళ్లీ నా తిరుగుప్రయాణం ప్రారంభించాను. అయితే అతనికి నేను తిరిగి రావడం అతనికి అంతగా నచ్చలేదు. నేను వెళ్తుంటే కాస్త అప్ సెట్ అయ్యాడు. అతను వాస్తవానికి నాతో శారీరకంగా కలవాలని భావించాడు.కానీ నేను అతని ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అతను బాగా నిరుత్సాహపడ్డాడు.

ఫోన్ చేయలేదు

ఫోన్ చేయలేదు

నేను తిరిగి వచ్చాక నాకు అతను అస్సలు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేయడానికి ప్రయత్నించినా అతని ఫోన్ రింగ్ కాలేదు. నన్ను అతను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. అలాగే అతను నాకు మెసేజ్ లు చేయడం మానేశాడు. వాట్సాఫ్, ఫేస్ బుక్ అన్ని చోట్ల బ్లాక్ చేశాడు.

అతని ఫ్రెండ్ కు ఫోన్ చేశా

అతని ఫ్రెండ్ కు ఫోన్ చేశా

మా ఫ్రెండ్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంట. అయితే నేను డెహ్రడూన్ కు వెళ్లినప్పుడు అతని ఫ్రెండ్ ఒకరు పరిచయం అయ్యారు. అతనికి ఫోన్ చేశాను. అతనిది ఉత్తరప్రదేశ్. అతన్ని అడగ్గా కొన్ని షాకింగ్ న్యూస్ చెప్పాడు.

పెళ్లి అయి ఇద్దరు కూతుర్లంట

పెళ్లి అయి ఇద్దరు కూతుర్లంట

నేను ప్రేమించే ఆర్మీ ఉద్యోగికి అప్పటికే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ఆమెతో పెళ్లి అయ్యిందట. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఆ నిజాలన్నీ చెప్పే సరికి నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇలాంటి అతన్నా నేను నమ్మింది అని బాధపడ్డాను. ఒకవేళ అతనితో ఆరోజు శారీరకంగా కలిసి నా జీవితం ఏమై ఉండేదని అనిపించిది.

నన్ను అనుభవించాలనుకున్నాడు

నన్ను అనుభవించాలనుకున్నాడు

అతను కేవలం నన్ను అనుభవించి మోసం చేయాలనుకున్నాడు. అంతేకాదు అతనిది విజయవాడ కూడా కాదంట చిత్తూరు అంట. ఆ ప్రాంత వారిపైనే నాకు విశ్వాసం ఉండేది. ఈ వ్యక్తిని చూశాక అర్థం అయ్యింది ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి దుర్మార్గులు ఉంటారని. అందువల్ల ఎవరినైనా సరే అంత తేలికగా అంచనా వేయకూడదు.

చాలా మంచిగా నటిస్తారు

చాలా మంచిగా నటిస్తారు

చూడడానికి చాలా మంచి వారిలా నటిస్తుంటారు. కానీ మనస్సులో మాత్రం మామూలుగా కుళ్లు ఉండదు. ఇలాంటి తోడేళ్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలే తప్పా ఎవరూ మనకు సాయం చేయరు.

English summary

Falling In Love With An Army Man Made Me Vulnerable To The Worst Possible Life

Falling In Love With An Army Man Made Me Vulnerable To The Worst Possible Life