For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ గలీజుగాడితో పార్వతి రోజూ పక్క పంచుకుంటోంది.. నన్ను కూడా అలా చేయమంది - My Story #33

పార్వతికి గజల్‌ శ్రీనివాసే పెళ్లి చేయించాడు. దీర్ఘకాలంగా ఆమె అతని వద్దే పనిచేస్తోంది.సార్‌తో బాగా ఉంటే నీవు కూడా బాగుంటావు..నీ జీవితం బాగుంటుందని పార్వతి చెప్పేది. ఆమెను రోజూ అనుభవించేవాడు.

By Bharath
|

ఒకప్పుడు ఆయన తన పాటతో అందరికీ పరిచయం అయ్యారు. ఇప్పుడేమో నాతో మసాజ్ చేయించుకుంటూ పాప్ లర్ అయ్యారు. ఆయనది శ్రీకాకుళం జిల్లా. టెక్కలిలో పుట్టారు. అతని తండ్రి అదే జిల్లాలో పంచాయతీ అధికారిగా పనిచేశారు. శ్రీకాకుళాన్ని ఈయన గిన్నీస్‌బుక్‌ రికార్డులో చూపిస్తానన్నారు. ఇప్పుడేమో ఇలా అందరితో గలీజ్.... అని పిలిపించుకుంటున్నాడు.

ఆడవారితో ఇలా ప్రవర్తిస్తాడా?

ఆడవారితో ఇలా ప్రవర్తిస్తాడా?

అన్నట్లుగానే ఈయన చాలా భాషల్లో పాడి ప్రపంచ గిన్నీసు రికార్డులు కూడా సాధించారు. ఈయన శాంతి గీతాలకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. వేలాది కచేరీలు చేశారు. మరి ఇంత నేపథ్యం ఉన్న ఆయన ఇలా ఆడవారితో ప్రవర్తించడం దారుణం.

నేను విడిగా ఉంటున్నాను

నేను విడిగా ఉంటున్నాను

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈయన గురించి చాలా విషయాలు మీకు తెలియాల్సి ఉంది. నేను ఒక రేడియో జాకీని. నాదికరీంనగర్. నా భర్తకు నేను విడాకులు ఇచ్చాను. ఇప్పుడు నేను విడిగా ఉంటున్నాను. నేను ఆలయ వాణి అనే వెబ్ రేడియో ఛానల్ లో పని చేస్తున్నా. నాకు నెలకు 13000 జీతం వస్తుంది. మా ఆఫీస్ హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ కు దగ్గర్లో ఉంది.

ఈ దుర్మార్గుడు బ్రాండ్ అంబాసిడర్

ఈ దుర్మార్గుడు బ్రాండ్ అంబాసిడర్

ఇతను బ్రాండ్ అంబాసిడర్. ఎంతో పవిత్రంగా ఆలయాల సమాచారం గురించి, భక్తి గురించి వివరించే మా రేడియోకు ఆ గలీజ్ గాడు బ్రాండ్ అంబాసిడర్. అతని అండదండలుంటేనే నాకు అక్కడ జాబ్ ఉంటుంది. నాకే కాదు అందులో పని చేసే ప్రతి మహిళ అతనితో అన్యోన్యంగా ఉంటేనే జాబ్ ఉంటుంది. లేదంటే అంతే.

చాలా సార్లు లైంగికంగా..

చాలా సార్లు లైంగికంగా..

అతని బాగోతం నాకు మొత్తం తెలుసు. తెలిసింది. ఎలాగైనా సరే సమాజం మొత్తం అమాయకంగా ఇంతగా ఆరాధించే ఈ వ్యక్తి అసలు విషయం ఏమిటో బహిరంగంగా చెప్పాలనుకున్నా. అప్పటికే నన్ను అతను చాలా సార్లు లైంగికంగా వేధించాడు. కానీ బయట సమాజానికి మాత్రం ఇతను ఒక మంచి గాయకుడిగా, సమాజ సేవకుడిగా మాత్రమే తెలుసు.

రహస్యంగా కెమెరాలు.. చెప్పినట్లు చేశాను

రహస్యంగా కెమెరాలు.. చెప్పినట్లు చేశాను

నేను పక్కా ప్లాన్ వేశాను. బెడ్‌రూమ్‌లో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశాను. ఆ విషయం అతనికి తెలిస్తే నన్ను చంపుతాడని కూడా నాకు తెలుసు. అయినా ధైర్యం చేశాను. నాలాగా మరో అమ్మాయి బలికాకూడదని నేను భావించాను. అతనితో సన్నిహితంగా ఉన్నట్లు నటించాను. అతను చెప్పే ప్రతి మాట వినింది.

అందుకోసమే బెడ్ రూమ్ లోకి..

అందుకోసమే బెడ్ రూమ్ లోకి..

మొత్తానికి అతన్ని ట్రాప్ చేశాను. బలమైన సాక్ష్యాల కోసమే నేను బెడ్‌రూమ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జీతం తక్కువైనా ఆలయాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరువేస్తున్నామనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని అనుకున్నా.

అతని కోర్కెలు తీర్చితేనే

అతని కోర్కెలు తీర్చితేనే

కానీ రెండు నెలల్లోనే ఈ కలలన్నీ కల్లలయ్యాయి. ఆ దుర్మార్గుడికోర్కెలు తీర్చితేనే నాకు అక్కడ జాబ్ ఉంటుందని తెలిసింది. లేదంటే లేదు. నన్నే కాదు అక్కడ పనిమనిషి పార్వతి కూడా అతను రోజూ అనుభవించేవాడు. అతడి బండారాన్ని బయటపెట్టడానికి నేను రెండు నెలల పాటు శ్రమించాను. ఈస్టింగ్ ఆపరేషన్ చేయడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేశాను.

చాలా ధైర్యం చేశాను

చాలా ధైర్యం చేశాను

అతడి బెడ్ రూములో మంచం తప్ప మరేమీ ఉండకపోయినా ధైర్యంగా కెమెరాను రహస్యంగా పెట్టాను. ఒకవేళ ఆఫీసుకు వెళ్లిన నేను ఏ రోజైనా రాకపోతే.. ఆ రోజు ఆలయవాణి ఆఫీసుకు వెళ్లి, ఫలానా చోట కెమెరా పెట్టాను తీసుకోమని నా ఆప్తమిత్రురాలికి కూడా చెప్పాను.

కావాలనే మసాజ్

కావాలనే మసాజ్

తర్వతా కావాలనే అతనికి మసాజ్ చేశాను. ఇదంతా తర్వాత కెమెరాలో రికార్డవుతుందని నాకు తెలుసు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు భయపడ్డా. అయితే కొందరు పోలీసులు ధైర్యం చెప్పడంతో వీడియోలు, బలమైన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాను. నన్ను ఇంకా కొందరు అనుమానిస్తున్నారు. ఇదే పరిస్థితి మీ ఇంట్లోని ఆడపిల్లకు ఎదురైతే ఏం చేస్తారో ఆలోచించండి.

అందులో చాలా అనుభవం

అందులో చాలా అనుభవం

ఆడవాళ్లను లోబరుచుకోవడంలోనూ.. వారిని శారీరకంగా వాడుకోవడంలోనూ అతనికి చాలా అనుభవం ఉంది. నేను చాలా వీడియోలను పోలీసులకు అందించాను. ఇలాంటి కామాంధుడి లీలలను సాహసంగా రికార్డు చేసి పక్కా ఆధారాలతో బయటపెట్టిన నా ధైర్యాన్ని మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను.

ఆ వీడియో చూసి

ఆ వీడియో చూసి

ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు. మంచి అనే ముసుగు వేసుకున్న గ‌జ‌ల్ శ్రీనివాస్ గురించి నేను చెప్పినా ఎవరూ న‌మ్మ‌రు. అందుకే ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. సేవ్ టెంపుల్ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆయన వద్ద పనికిచేరా. నేను ఆఫీస్‌లో జాయిన్ అయిన తొలి రోజుల్లో బాగానే ఉన్నారు. గత రెండు నెలలుగా వేధింపులు ఎక్కువయ్యాయి.

నాతో గడపకపోతే..

నాతో గడపకపోతే..

నేను గవర్నర్‌ని అవుతా నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా అంటూ అనేక ప్రలోభాలు నన్ను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. నేను లొంగక పోయే సరికి నాతో గడపకపోతే నీకు బయట అవకాశాలు లేకుండా చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

పార్వతీ మరి దారుణం

పార్వతీ మరి దారుణం

అలాంటి నీచుడిని వదలకూడదని, కఠినంగా శిక్షించాలి. పార్వతికి గజల్‌ శ్రీనివాసే పెళ్లి చేయించాడు. దీర్ఘకాలంగా ఆమె అతని వద్దే పనిచేస్తోంది.సార్‌తో బాగా ఉంటే నీవు కూడా బాగుంటావు..నీ జీవితం బాగుంటుందని పార్వతి నాతో చెప్పేది. తనకు భర్త ఉన్నా ఇప్పటికీ గజల్ శ్రీనివాస్‌తో పక్క పంచుకుంటానని నిస్సుగ్గుగా చెప్పేది. ఆయన దగ్గరకు వెళ్లాలని పదేపదే నన్ను ఇబ్బంది పెట్టేది.

వాళ్లద్దరూ బలవంతం చేశారు

వాళ్లద్దరూ బలవంతం చేశారు

నేనిచ్చిన వీడియోలో వారిద్దరూ సైగలు చేసుకుని నన్ను లోపలికి తీసుకెళ్లినట్లు ఉంటుంది. గజల్‌ శ్రీనివాస్‌కు నేను మసాజ్‌ చేయలేదు. అతని నిజస్వరూపాన్ని బయట పెట్టడానికే కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది.

చాలామంది బాధితులు

చాలామంది బాధితులు

నాలాగే బాధితులు చాలా మంది ఉన్నారు. పనిమనిషి పార్వతి పరారీలో ఉంది. నా ప్రాణాలను తెగించి ఈ సాహసం చేశాను. అందరి ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలా చేశాను. నేను ఒక్కదాన్నే రక్షించుకోవాలనుకుంటే ఎలాగోలా బయటపడేదాన్ని కానీ అలా చేయలేదు ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఇలా చేశాను.

ఎవరూ అతని మాటలు నమ్మకండి

ఎవరూ అతని మాటలు నమ్మకండి

సమాజంలో చాలా వరకు ఇలా మోస పోతున్నారనే ఆలోచనతో ఈ పని చేసి పోలీసులకు పట్టించాను. ఇక ముందు ఎవరూ గజల్ శ్రీనివాస్ మాటలు నమ్మి భవిష్యత్తు పాడు చేసుకోవద్దనే ఉద్దేశంతోనే నేను ఈ వివరాలన్నీ మీకు చూపించడం జరిగింది.

English summary

Ghazal singer Kesiraju Srinivas held for sexual harassment

Ghazal singer Kesiraju Srinivas held for sexual harassment
Desktop Bottom Promotion