Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
నా భర్త నేనులేనప్పుడు ఆమెను డైరెక్ట్ గా ఇంటికే తెచ్చుకునేవాడు, మరొకన్ని చూసుకుంటానన్నాను #mystory362
నేను వెళ్లే సమయానికి ఆమె ఇంట్లోనే ఉంది. ఈమె ఎందుకు ఇక్కడుంది అన్నాను. నువ్వు లేవుగా.. పనులుంటాయిగా ఇంట్లో అందుకే రోజూ వస్తూ ఉంటుందన్నాడు. ఏం పనులు అన్నాను.. బట్టలు ఉతకడం.. ఇంట్లో పనులు చేయడంలాంటివి చే
మామయ్య పడకగదిలో మరీ దారుణంగా ప్రవర్తించేవాడు, పొలం పనులకు వచ్చే ఆమెతో సంబంధం (#mystory361 ఇక్కడ క్లిక్ చేసి చదవండి) అనే స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
నా భర్త నేనే డెలివరీకి పుట్టింటికి వెళ్లిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంతకు ముందు పొలం దగ్గర చేసే పని ఆయన ఇంటి దగ్గర చేయడం మొదలుపెట్టాడు.

డైరెక్ట్ గా ఇంటికే
ఆమెను డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చుకుంటున్నాడని నాకు తెలిసింది. ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పి ఏడ్చాను. అమ్మ నాన్నతో చెప్పింది. కానీ నాన్న కూడా మా ఆయన్ని ఆ విషయంపై గట్టిగా నిలదీయలేదు. ఏదో రిక్వెస్ట్ చేసుకున్నట్లు చెప్పాడు.

సొంత తమ్ముడు కాబట్టి
అమ్మ ఏమీ అనలేదు. ఎందుకంటే తను ఆమెకు సొంత తమ్ముడు కాబట్టి. ఇక లాభం లేదనుకుని మా ఆయన్ని నేనే కడిగిపారేయాలనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత పాపతో పాటు నేను మా మెట్టినింటికి వెళ్లాను. కనీసం నన్ను తీసుకెళ్లడానికి కూడా ఆయన మా పుట్టింటికి రాలేదు.

ఆమె ఇంట్లోనే
నేను వెళ్లే సమయానికి ఆమె ఇంట్లోనే ఉంది. ఈమె ఎందుకు ఇక్కడుంది అన్నాను. నువ్వు లేవుగా.. పనులుంటాయిగా ఇంట్లో అందుకే రోజూ వస్తూ ఉంటుందన్నాడు. ఏం పనులు అన్నాను.. బట్టలు ఉతకడం.. ఇంట్లో పనులు చేయడంలాంటివి చేస్తూ ఉంటుందన్నాడు.

ఇంకేమైనా చేస్తుందా
అంతేనా ఇంకేమైనా చేస్తుందా అన్నాను. ఇంకేమీ చేస్తుందిఅంటూ నాపై కోప్పడ్డాడు. నీ రంకుతనం మొత్తం నాకు తెలుసులే అనడంతో తను కొట్టడానికి వచ్చాడు. ఉన్నమాట అంటే ఎందుకంత కోపం అన్నాను.

మరొకన్ని చూసుకుంటాను
"అవును దానితోనే కులుకుతున్నాను. నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తావు" అన్నాడు. " సరే నేను కూడా మరొకన్ని చూసుకుంటాను" అన్నాను. దాంతో ఆయన వెంటనే నా చెంపపై కొట్టాడు. మరి నీకు అంత కోపం వచ్చినప్పుడు నాకు రాకూడదా అన్నాను.

చెంపపై కొట్టాలని ఉంది
నాకు కూడా ఇలాగే నిన్ను చెంపపై కొట్టాలని ఉంది. పెళ్లాం తినిందా అది ఎలాగుందనే విషయాలు పట్టించుకోకుండా మరో అమ్మాయితో కులుకుతుంటావు. నాకు పాప పుట్టిందని దానికి నేనే కారణం అయినట్లు ఫీలవుతున్నావు. నాకు పాప పుట్టిన బాబు పుట్టినా దానికి నువ్వే కారణం అవుతావు. అందులో నా ప్రమేయం ఏమీ ఉండదు. కానీ నువ్వు నన్ను బాధ్యురాల్ని చేస్తున్నావు.

పెళ్లాం పిల్లలపై పెడితే
సొంత మామయ్యవని నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నువ్వేమో రోజూ నాకు నరకం చూపిస్తున్నావు. ఒక్కోసారి ఈ జీవితం ఎందుకనిపిస్తూ ఉంటుంది. నువ్వు బయట వాళ్లపై పెట్టే శ్రద్ధఇంట్లో పెళ్లాం పిల్లలపై పెడితే నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు ఇప్పటికైనా ఇంటిపై కాస్త ధ్యాస పెట్టు అని నా భర్తను వేడుకున్నాను.

పాపను, నన్ను బాగా చూసుకుంటున్నాడు
ఒకట్రెండు రోజులు ఆయన మౌనంగా ఉండిపోయాడు. తర్వాత చెడువ్యసనాలకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పాపను, నన్ను బాగా చూసుకుంటున్నాడు. చెడుదోవలో వెళ్లే భర్తను ప్రేమతో భార్య తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ మార్చలేరు.



Click it and Unblock the Notifications