Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మా ఆయన పొలంలో పంప్ సెట్ దగ్గర ఉండే రూమ్ లో పని అమ్మాయితో ఆ పని చేసేవాడు #mystory361
అక్కడ పంప్ సెట్ దగ్గర ఉండే రూమ్ లో తను మాకు పొలం పనులకు వచ్చే ఆమెతో కులికేవాడని నాకు చాలా మంది చెప్పారు. చాలాసార్లు నేను కళ్లతో చూశాను కూడా.
నన్ను ఇంటర్ లో ఒక అబ్బాయి లవ్ చేసేవాడు. రోజూ నా వెంట పడేవాడు. నేను అతని ప్రేమను ఎంజాయ్ చేసేదాన్ని. అతనంటే ఇష్టమే కానీ నేను అతని ప్రపోజల ను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు.
రోజూ తనను కవ్వించేదాన్ని. ఆ అబ్బాయి నా వెంటపడుతున్నాడనే విషయం మా ఇంట్లో తెలిసింది.
దీంతో నా చదువు మాన్పించేశారు.

పదేళ్లు పెద్ద
నాకు వెంటనే మా మామయ్యతో పెళ్లి చేశారు. అప్పుడు నాకు పద్దెనిమిదేళ్లు. తను నాకంటే పదేళ్లు పెద్దవారు. నాకు బాగా చదవాలని ఉండేది. కానీ మా ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేశారు.

అంత కొత్తగా
పెళ్లయ్యాక నాకు అంత కొత్తగా అనిపించింది. అంత వరకు మా మామయ్య నాతో ఎప్పుడూ ప్రవర్తించనట్లుగా ప్రవర్తించేవాడు కాదు. మా అమ్మమ్మ కూడా చాలా దురుసుగా మాట్లాడేది.

పడకగదిలో మరీ దారుణంగా
మామయ్య పడకగదిలో మరీ దారుణంగా ప్రవర్తించేవాడు. నాకు బాధకలిగినా కూడా ఏమీ అనేదాన్ని కాదు. తనను చూస్తే భయం వేసేది. పెళ్లయిన కొన్ని రోజులకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను.

గర్భిణీని అయ్యాక
గర్భిణీని అయ్యాక నా భర్త నా గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. నీ చావు నువ్వు చావు అన్నట్లుగా ప్రవర్తించేవాడు. ఏ రోజు తను హాస్పిటల్ కు తీసుకెళ్లేవాడు కాదు. పుట్టింటికి వెళ్తానంటే పంపేవాడు కాదు.

చాలా సార్లు కొట్టాడు
మా నాన్న ముందేమో నన్ను బాగా చూసుకుంటున్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. నేను ఏమైనా చెబితే కొడతా అని బెదిరించేవాడు. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా సార్లు కొట్టాడు.

అంతగా తెలిసేవి కావు
నాకు చాలా విషయాలు అంతగా తెలిసేవి కావు. దీంతో నా విషయంలో ఎలా అంటే అలా ప్రవర్తించేవాడు. తను ఏమీ చేసినా ప్రశ్నించకూడదనే వాడు. ఏదైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే కొట్టేవాడు.

తాగి ఇంటికొచ్చేవాడు
నా కష్టాల్ని ఎవరికీ చెప్పుకోలేకపోయేదాన్ని. అమ్మకు చెబితే సర్దుకుపోవాలి అనేది. నాన్నకు చెబితే అస్సలు నమ్మేవాడు కాదు. కానీ నా భర్త రోజూ తాగి ఇంటికొచ్చేవాడు. నేను ఏ వంట చేసినా కొద్దిగా తిని పల్లెం నేలకేసి కొట్టేవాడు.

పొలం పనులకు వచ్చే ఆమెతో..
తను ఉదయమే లేచి బైక్ వేసుకుని పొలం దగ్గరకు వెళ్లేవాడు. అక్కడ పంప్ సెట్ దగ్గర ఉండే రూమ్ లో తను మాకు పొలం పనులకు వచ్చే ఆమెతో కులికేవాడని నాకు చాలా మంది చెప్పారు. చాలాసార్లు నేను కళ్లతో చూశాను కూడా.

ఆడపిల్ల పుట్టిందని
కానీ ఏమీ చెయ్యలేకపోయేదాన్ని. కొన్నాళ్లకు నాకు పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని మా ఆయన నోటికొచ్చినట్లు తిట్టాడు. అందులో నా తప్పు ఏముందో నాకు అర్థం కాలేదు. నేను మగాడు పిల్లాడిని కనాలనుకుంటే కనగలుగుతానా? అది సాధ్యమా అని ప్రశ్నిద్దామనుకున్నాను. కానీ మౌనంగా తన తిట్లను భరించాను. (మిగతా స్టోరీ #mystory362లో ఇక్కడ క్లిక్ చేసి చదవండి)



Click it and Unblock the Notifications
