Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
రోజూ ఆ వీడియోలు చేసేదాన్ని, చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు, నా పడకగది విషయాలు కూడా #mystory363
అయితే తను వీడియో కాలింగ్స్ మొత్తం రికార్డ్ చేశాడు. తను అలా చేస్తాడని తెలియక నేను చాలా ప్రైవేట్ విషయాలు, నా భర్త గురించి చాలా సీక్రెట్స్, నా పడకగది విషయాలు అన్నీ తనకు చెప్పాను. ఆ వీడియోలన్నింటినీ నా భర
నేను పదో తరగతి వరకే చదువుకున్నా. మాది మజారా గ్రామం. మా ఊరికి ఇప్పటికీ బస్ లేదు. అంత వెనుకపడిన మా ఊరిలో ప్రతి ఒక్కరూ చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ ఉంటుంది. నేను మా ఆయన్ని అడిగి స్మార్ట్ ఫోన్ ఇప్పించుకున్నా.
ఫోన్ అయితే వచ్చిందిగానీ దాన్ని ఎట్ల వాడాలో అర్థమయ్యేది కాదు. మా ఇంటి పక్కనే ఒక కాలేజీ అమ్మాయి ఉంటుంది. తను ఇరవైనాలుగు గంటలు ఫోన్ లోనే లీనమైపోతూ ఉంటుంది.

నా ఫోన్ చూపించాను
తాను ఏం చేస్తదబ్బా అంతగా ఫోన్లో అనుకునేదాన్ని. ఒకరోజు తన దగ్గరకు వెళ్లి నా ఫోన్ చూపించాను. నాకు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది.. దీన్ని ఎలా వాడాలో కాస్త చెప్పవా అని అడిగాను.

ఏవేవో వంకర్లు పెట్టింది
తను నా ఫోన్ చూసి ఏవేవో వంకర్లు పెట్టింది. దీనికి ర్యామ్ సరిగ్గా లేదు.. స్టోరేజీ సరిగ్గా లేదంది. యాప్స్ ఏవీ సరిగ్గా పని చేయవంది. వెంటనే మా ఆయన ఇంటికి రాగానే ఆయనపై కోప్పడాను. ఏమయ్యో ఫోన్ ఇప్పివ్వమంటే ఏదో డబ్బా ఇప్పిస్తావా నాకేమీ వద్దు అని అలిగాను.

అది రాము కాదే ర్యామ్
ఏమైందే అన్నాడు.. నాకు ఆ పేర్లు అన్నీ పలకడానికి రావుగానీ బాగా రాము వచ్చే ఫోన్ ఇప్పివు అన్నా. అది రాము కాదే ర్యామ్ అంటూ మా ఆయన నవ్వాడు. సరే నా ఫోన్ వాడుకో అని ఇచ్చాడు. ఇదైనా బాగా పని చేస్తుందా అన్నాను. పని చేస్తుందే అన్నాడు.

టిక్కుటాక్ గా రెడీ అవుతావు
ఆ ఫోన్ తీసుకెళ్లి ఆ పిల్లకు చూపించాను. తను ఫోన్ చూసుకుంటూ అస్సలు నావంక చూడకపోయేసరికి.. ఏం పిల్లో ఎప్పుడూ ఆ ఫోన్ పట్టుకుని టిక్కుటిక్కుమని మని ఇటూ తిరుగుతుంటావు.. రోజూ వన్నాను. నీకు కూడా తెలుసు దాని గురించి అంది. దేని గురించి అన్నాను.

భలే మాట్లాడినవు కదనే
వెంటనే తన ఫోన్ లో ఉన్న వీడియోలు చూపించింది. ఆ పిల్ల హీరోయిన్ లాగా మాట్లాడిన మాటలు, డ్యాన్స్ లు అన్నీ చూపించింది. భలే మాట్లాడినవు కదనే అన్నాను. నువ్వు కూడా ఇలా డైలాగ్స్ చెప్పొచ్చు అంది. ఒక డైలాగ్ వినిపించింది.. వీడియో రికార్డ్ చేసేటప్పుడు పెదాలు కదిలించు అంది.

పెదాలు కదిలివ్వు
నాకు రాదు కదా అన్నాను. నువ్వు జస్ట్ పెదాలు కదిలివ్వు అంది. సరే ఆ పిల్లతో నాకు పని ఉంది కాబట్టి ఒకే అన్నాను. తను ఏదో సినిమా డైలాగ్ వినిపిస్తూ పెదాలు కదిలించమంది. కదిలించాను. అంతే.. అచ్చం సినిమా హీరోయిన్ చెప్పినట్లుగానే నా డైలాగ్ వచ్చింది.

ఇరగదీశావు ఆంటీ
మరుసటి రోజు మళ్లీ ఆ పిల్ల ఇంటికి వెళ్లాను. నా వీడియో చూపించి.. నిన్ను వేలమంది మెచ్చుకుంటున్నారు.. అసలు ఏమైనా చేశావా ఇరగదీశావు ఆంటీ అంది. వాళ్లు చేసిన కామెంట్స్ చదివింది. అందరూ సూపర్ ఆంటీ అని కామెంట్ చేశారు.

రోజూ వీడియోలు పెట్టేదాన్ని
ఇక వెంటనే నా ఫోన్లో అట్ల వీడియోలు తీసేది వేయించుకున్నా. అబ్బో ఆ వీడియోలు చూస్తుంటే నాకు టైమ్ అస్సలు సరిపోయేది. నేను కూడా రోజూ వీడియోలు పెట్టేదాన్ని. వారం రోజులు తర్వాత ఆ పిల్ల మా ఇంటికొచ్చింది.

మా ఆయనకు నా వీడియోలు చూపించి
ఆంటీ.. నువ్వు సూపర్బ్. నీకు.. నాకంటే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు న్యాచురల్ గా సూపర్బ్ ఫర్ ఫామెన్స్ చేస్తున్నావు అంది. అప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. మా ఆయనకు నా వీడియోలు చూపించి ముచ్చటపడేదాన్ని. ఆయన కూడా ఏమీ అనేవాడు కాదు.

ఒక అబ్బాయి కామెంట్స్ పెట్టేవాడు
నేను ఏ వీడియో అప్ లోడ్ చేసినా వెంటనే ఒక అబ్బాయి తెలుగులో కామెంట్స్ పెట్టేవాడు. నన్ను పొగడ్తలతో ముంచెత్తావాడు. తను నాకు చాలాసార్లు మెసేజ్ లు కూడా పంపాడు. నా ఫోన్ నంబర్ అడిగాడు. సరే పాపం ఇద్దామని ఇచ్చాను.

మళ్లీ ఆ కాలేజీ పిల్ల దగ్గరకు వెళ్లి
ఫోన్ చేశాడు. చాలా సేపు మాట్లాడాడు. నన్ను చాలా పొగిడాడు. వాట్సాప్ ఉందా అన్నాడు. లేదు అన్నాను. డౌన్ లోడ్ చేసుకో అన్నాడు. మళ్లీ ఆ కాలేజీ పిల్ల దగ్గరకు వెళ్లి అది నా ఫోన్ లో వేయించుకున్నాను. దాన్ని ఎట్ల వాడాలో కూడా తెలుసుకున్నా.

చాలా సార్లు వీడియో కాలింగ్స్ లో
తర్వాత ఆ అబ్బాయి నాకు ఏవేవో వీడియోలు పంపేవాడు. వీడియో కాలింగ్ చేసేవాడు. నన్ను బాగా పొగిడేవాడు. ఇద్దరం చాలా సార్లు వీడియో కాలింగ్స్ లో మాట్లాడుకున్నాం. నీ వీడియోలు చాలా న్యాచురల్ గా ఉంటాయి... నీకు నాలాంటి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు...నీ రేంజే వేరు అనేవాడు.

నైటీలోనే తనతో
క్రమంగా అతనికి నా పర్సనల్ విషయాలు మొత్తం చెప్పడం మొదలుపెట్టాను. తనని నా మనిషి అని నమ్మాను. కొన్నిసార్లు నేను ఇంట్లో పని చేస్తూనే తనతో మాట్లాడేదాన్ని. నైటీలోనే తనతో వీడియో కాలింగ్ లో మాట్లాడేదాన్ని. తనతో బాగా చనువు ఏర్పడడంతో చాలా విషయాలు తనకు చెప్పేదాన్ని.

నా పడకగది విషయాలు చెప్పాను
అయితే తను వీడియో కాలింగ్స్ మొత్తం రికార్డ్ చేశాడు. తను అలా చేస్తాడని తెలియక నేను చాలా ప్రైవేట్ విషయాలు, నా భర్త గురించి చాలా సీక్రెట్స్, నా పడకగది విషయాలు అన్నీ తనకు చెప్పాను. ఆ వీడియోలన్నింటినీ నా భర్తకు పంపిస్తానని తను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మిగతా స్టోరీ #mystory363లో (ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి.



Click it and Unblock the Notifications