Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
నాకు పెళ్లయ్యింది బాబు ఉన్నాడు, ఇప్పుడు మళ్లీ తను నా జీవితంలోకి, నాతోనే గడుపు, ఏం చెయ్యమంటారు?
చాలా ఏళ్ల తర్వాత తను నాకు కనపడింది. తనకు కూడా పెళ్లయ్యింది. తనకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమె, భర్తతో పిల్లలతో కలిసి మా ఇంటికి దగ్గర్లోనే రెంట్ కు ఉంటోంది. ఆ మధ్య ఒకసారి తను మార్కెట్లో కలిసింది.
ప్రశ్న : నాకు పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతుంది. ఒక బాబు కూడా ఉన్నాడు. నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భార్య చాలా మంచిది. నేను ఏం చెప్పినా వింటుంది. చాలా అమాయకురాలు. అలాంటి అమ్మాయి నా భార్యగా రావడం నా అద్రుష్టం. పెళ్లయిన కొత్తలో నేను తనతో అస్సలు మాట్లాడేవాణ్ని కాదు. తనని పురుగుని చూసినట్లు చూసేవాణ్ని.

డీప్ గా లవ్ చేశాను
నేను అంతకు ముందు ఒక అమ్మాయిని డీప్ గా లవ్ చేశాను. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలిసింది. తను వేరే కులం అమ్మాయి అని మా పెళ్లికి అంగీకరించలేదు. తర్వాత మా బంధువుల అమ్మాయితో నా పెళ్లి నిశ్చయించారు. నేను మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా చనిపోతామని మా ఇంట్లో వాళ్లు బెదిరించారు.

కరిగిపోయాను
దాంతో తప్పని పరిస్థితుల్లో నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన మొదట్లో కొన్ని రోజులు తనతో సరిగ్గా మెలిగేవాణ్ని కాదు మాకు బాబు పుట్టినప్పటి నుంచి తనపై ఇష్టం పెరిగింది. నేను ఎంత కోప్పడినా కూడా తను నాపై చూపించే ప్రేమతో నేను కరిగిపోయాను. ఇలా ప్రశాంతంగా సాగుతున్న మా కాపురంలోకి మళ్లీ నా మాజీ ప్రియురాలు వచ్చింది.

తనని చూడగానే
చాలా ఏళ్ల తర్వాత తను నాకు కనపడింది. తనకు కూడా పెళ్లయ్యింది. తనకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమె, భర్తతో పిల్లలతో కలిసి మా ఇంటికి దగ్గర్లోనే రెంట్ కు ఉంటోంది. ఆ మధ్య ఒకసారి తను మార్కెట్లో కలిసింది. తనని చూడగానే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి.

తన భర్తకు అనుమానం ఎక్కువని
ఇళ్లు దగ్గరే కావడంతో వీలు దొరికినప్పుడల్లా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. తన కష్టసుఖాలన్నీ నాతో పంచుకుంటుంది. తనతో మాట్లాడుతుంటే నాకు అస్సలు సమయమే తెలియడం లేదు. అయితే తన భర్తకు అనుమానం ఎక్కువని తనను నిత్యం వేధిస్తుంటాడని నా ప్రియురాలు ఏడ్చింది. తను అతనితో కాపురం చెయ్యలేనని నా దగ్గరకు వచ్చేస్తానంది. తనతోనే ఉండమని కోరుతుంది.

నా ప్రియురాలిని కాదనలేకపోతున్నాను
రోజూ తను నాతో అదే విషయం చెబుతోంది. తనపై ఉన్న ప్రేమతో నేను ఏమీ చెప్పలేకపోయాను. కానీ నా భార్య కూడా నన్ను ఎంతో ప్రేమిస్తుంది. అలా అని నా ప్రియురాలిని కాదనలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దయజేసి నాకు సలహా ఇవ్వగలరు.

ప్రేయసిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి
సమాధానం : మీకు పెళ్లి కాక ముందు ప్రేయసి ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేకపోయారు. ఇప్పుడు మీకు భార్య, బాబు ఉన్నారు. మొదట మీ ఫ్యామిలీకే ప్రాముఖ్యత ఇవ్వండి. మీ ప్రేయసిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి అమాయకురాలైనా నీ భార్యను బలి చేయకండి.

అన్యాయం చేయకండి
నిన్ను ఎంతో నమ్ముతున్న నీ భార్య జీవితాన్ని నాశనం చేయకండి. ఆమె భర్తను మార్చే ప్రయత్నం చేయడానికి సూచనలు ఇవ్వండి. అలాగని మీరు పెద్దమనిషిలా మారి డైరెక్ట్ గా మీ ప్రియురాలి జీవితాన్ని మార్చాలని మాత్రం ప్రయత్నించకండి. దానివల్ల అసలుకే మోసం వస్తుంది. మీ ప్రియురాలి కోసం మీ భార్య, బాబుకు అన్యాయం చేయకండి.



Click it and Unblock the Notifications