For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరమ్మాయిల్లా ఆ కోరికలుండేవి, నా భర్త నా ఎదుటే వేరే అమ్మాయితో అందులో పాల్గొనేవాడు #mystory224

|

నా పేరు లత. నేను పుట్టగానే మా నాన్న తనకు ఆడపిల్ల పుట్టిందని కాస్త బాధపడ్డాడు. తర్వాత నేను అంధురాలిని అని తెలిసి కుటుంబం మొత్తం బాధపడింది. కాస్త పెద్దగయ్యేసరికి నాకు చూపు లేకున్నా నాలో ఆత్మస్థైర్యం మాత్రం పెరిగింది. మా స్కూల్ లో నేను ఫస్ట్ ఉండేదాన్ని. చూపు లేకున్నా కూడా నేను చాలా అంశాల్లో రాటుదేలిపోయాను.

స్కూల్ డేస్ లోనే నేను చదువులో, ఆటల్లో రాణించాను. అప్పుడు మా ఇంట్లో వాళ్లు నన్ను చూసి గర్వపడ్డారు. నేను యూనివర్సిటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాను. యూనిర్సిటీలో నాకు లవకుమార్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది.

నా రూపం చూసుకోలేను

నా రూపం చూసుకోలేను

నిజంగా నా రూపం నేను ఎప్పుడూ చూసుకోలేను కాబట్టి నా రూపుతీరు గురించి ఎవరైనా చెబితే వినాలని ఉండేది. నా పాతికేళ్ల జీవితంలో నా అందం గురించి ఎవరూ చెప్పలేదు. మొట్టమొదటి సారి లవకుమార్ నా అందం గురించి పొడిగాడు. నీలాంటి అమ్మాయి భార్యగా వస్తే చాలు అన్నాడు.

బైక్ పై తీసుకొచ్చేవాడు

బైక్ పై తీసుకొచ్చేవాడు

తను రోజూ తన బైక్ పై వర్సిటీకీ తీసుకొచ్చేవాడు. తనతో ఉంటే నాకు అస్సలు టైమ్ తెలిసేది కాదు. తను చాలా టాక్టివ్ పర్సన్. ఎప్పుడూ సరదాగా ఏవో విషయాలు చెప్పేవాడు. కొన్నాళ్ల మా మధ్య ప్రేమ పుట్టింది. నా పుట్టిన రోజున లవకుమార్ నాకు ప్రపోజ్ చేశాడు.

అన్ని కోరికలుండేవి

అన్ని కోరికలుండేవి

తను నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు. నేను అనారోగ్యంతో బాధపడితే తల్లిడిల్లిపోయేవాడు. నేను ఒక్క క్షణం తన పక్కన లేకుంటే పదేపదే తలుచుకునేవాడు. అందరమ్మాయిల మాదిరిగానే నాకూ అన్ని కోరికలుండేవి. అంధులైనంత మాత్రానా కోరికలు మాత్రం చావవు కదా.

ఆరాటపడేదాన్ని

ఆరాటపడేదాన్ని

బయట ప్రపంచంలో అమ్మాయిలు ఎలా అయితే అందంగా తయ్యారవ్వాలి.. ఫ్యాషన్ బుల్ గా కనిపించాలని కోరుకుంటారో నేను కూడా అలాగే ఆరాటపడేదాన్ని. మా ఇంట్లో వాళ్లు నీకెందుకు అవన్నీ నువ్వు గుడ్డిదానివంటూ నన్ను గేలి చేసి మాట్లాడేవారు. నాకు చాలా కోపం వచ్చేది.

కోరికలు ఉండకూడదా?

కోరికలు ఉండకూడదా?

ఏం.. కళ్లు కనపడకుంటే అందంగా తయార్వకూడదా? మీలాగే మాకు కోరికలు ఉండకూడదా? అని నాకు అనిపించేది. నేను లవకుమార్ తో బైక్ పై వెళ్తున్నప్పుడు యూనివర్సిటీలోని నా ఫ్రెండ్స్ అందరూ నానా రకాలుగా మాట్లాడుకునేవారు. ఆమెకు కళ్లు కనపడకున్నా కూడా ఇంతలా ఎంజాయ్ చేస్తుందంటే మరి కనపడితే ఎలా ఉండేదో అంటూ చెవులు కొరుక్కునేవాళ్లు.

అతని ప్రవర్తనను గమనించాను

అతని ప్రవర్తనను గమనించాను

లవకుమార్ ఎప్పుడూ నా చేయి పట్టుకుని నేను కోరిన ప్రతి చోటుకి తీసుకెళ్లేవాడు. రానురాను అతనిపై నాకు నమ్మకం పెరిగింది. అతను నాతో పాటు జీవితాంతం ఉంటానని నాకు భరోసా కూడా ఇచ్చాడు. యూనివర్సిటీలో ఎప్పుడూ నాకు తోడుగా ఉండేవాడు. చాలా రోజుల పాటు నేను అతని ప్రవర్తనను గమనించాను. ఎప్పుడూ కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు.

రూమ్ తీసుకుని ఉందామన్నాడు

రూమ్ తీసుకుని ఉందామన్నాడు

కొన్ని రోజుల తర్వాత.. అతను మనమిద్దరం ఒకే రూమ్ తీసుకుని ఉందామన్నాడు. నేను కాస్త ఆలోచించి ఒకే అన్నాను. తర్వాత ఒకే చెప్పాను. యూనివర్సిటీలో చదువు పూర్తికాగానే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆదర్శ వివాహం అని అందరూ మా పెళ్లిని పొడిగారు. పెళ్లయిన కొన్ని రోజుల వరకు మా సంసారం బాగానే ఉంది.

అసలు మనిషి బయటకొచ్చాడు

అసలు మనిషి బయటకొచ్చాడు

లవకుమార్ లోని అసలు మనిషి కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చాడు. నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదని తెలిసింది. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. నన్ను చేసుకుంటే ఆస్తి మొత్తం తనకే వస్తుందని ఒక ప్లాన్. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉండడంతో ఎప్పటికైనా నేను జాబ్ చేస్తే కూర్చొని తినాలని మరో ప్లాన్.

మరో అమ్మాయితో ఎంజాయ్

మరో అమ్మాయితో ఎంజాయ్

పేరుకు మాత్రమే నన్ను పెళ్లి చేసుకుని తనకు నచ్చిన మరో అమ్మాయితో ఎంజాయ్ చేయాలని మరో ప్లాన్. ఇవన్నీ పక్కాగా ఆలోచించే లవకుమార్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ నాకు పెళ్లి అయిన కొన్ని రోజులకే తెలిశాయి. ఒక రోజు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్లాను. ఆ రోజు నన్ను ఎగ్జామ్ సెంటర్ వద్దకు బైక్ పై తీసుకొచ్చిన లవకుమార్ నన్ను అక్కడ దింపి మరో అమ్మాయిని బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడని నా ఫ్రెండ్స్ చెప్పారు.

ఆ అమ్మాయితో సెక్స్ చేశాడు

ఆ అమ్మాయితో సెక్స్ చేశాడు

నేను వెంటనే ఇంటికి వెళ్లాను. ఇంటి బయట నుంచే వారి మాటలు విన్నాను. లవకుమార్ ప్లాన్స్ మొత్తం తెలిశాయి. అంతేకాదు నేను ఇంట్లో ఉండగానే తనతో మా ఆయన చాలా సార్లు ఆ అమ్మాయితో సెక్స్ చేశాడు. నా కళ్లు కనపడవు కాబట్టి ఆయన ఇంట్లో నా ఎదురుగానే అలాంటి దారుణాలు చేస్తున్న కూడా నేను పసిగట్టలేకపోయాను.

ఇంటికే తీసుకొచ్చుకుని సెక్స్ లో పాల్గొనేవాడు

ఇంటికే తీసుకొచ్చుకుని సెక్స్ లో పాల్గొనేవాడు

తనకు వీలు దొరికనప్పుడల్లా ఆ అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చుకుని సెక్స్ లో పాల్గొనేవాడు. ఈ విషయాలన్నీ తెలిసి నా ప్రాణం సగం చచ్చిపోయింది. ఎంతో నమ్మిన వ్యక్తే ఇలా నమ్మకంద్రోహం చేశాడని తెలిసి బాధతో కుంగిపోయాను. కొన్నాళ్ల వరకు నేను కోలుకోలేదు. కానీ అతడి మోసం పెళ్లయిన కొన్ని రోజలకే బయటపడడం నాకు కాస్త మంచి చేసింది. ఇప్పుడు అందరికీ దూరంగా ఒంటిరిగా బతుకుతున్నా.

English summary

I am The Blind Lady my husband has cheated on me several times

I am The Blind Lady my husband has cheated on me several times
Story first published: Monday, September 3, 2018, 9:00 [IST]