Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మందుల కోసం అతన్ని కాస్త పక్కకి రమ్మని కళ్లతోనే సైగలు చేశా.. అతను తప్పుగా అనుకున్నాడు...!
ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. పున్నమి వెలుగుల్లో తన మోము చూస్తూ నన్ను నేను మైమరిచిపోయాను. శ్రవణ్.. శ్రావణి పేర్లు కూడా బాగా కలిసిపోయాయి. విశాంత్ పెళ్లి ఇంటికి దగ్గర్లోని కల్యాణమంటపంలో పెట్టుకున్నారు.
విశాంత్ పెళ్లి రోజు దగ్గర పడింది. ఇళ్లంతా బంధువుల సందడే. ఏ పని వద్ద చూసిన నేను శ్రవణ్ కనపడేవాళ్లం. పెళ్లికి వచ్చిన వాళ్లంతా నన్ను శ్రవణ్ భార్య అనుకున్నారు.

శ్రవణ్ వాళ్ల అమ్మనాన్నలు బంధువులందరికీ మా ఇద్దరి గురించి వివరించలేక విసిగిపోయేవారు.

మా కోడలు కాదండీ బాబు
ఆ అమ్మాయి మా కోడలు కాదండీ బాబు.. విశాంత్ ఫ్రెండ్ అంటూ అడిగిన వారందరికీ కాస్త గట్టిగానే చెప్పేవారు శ్రవణ్ తల్లిదండ్రులు. వడ్డించే చోట మా ఇద్దరిదే హడావుడి. శ్రవణ్ నన్ను ఏదో ఒక మాట అనేవాడు. దీంతో నాకు కోపం వచ్చి అతన్ని కొడదామనేలోపే తప్పించుకునేవెళ్లేవాడు.

పడుకుందామంటే..
అతని ప్రతి మాట సరదాగే ఉండేది. నాకొచ్చే కోపం కూడా అసలు కోపం కాదు. చిలిపిగా తనను కొట్టేదాన్ని. పెళ్లికి ముందు రోజు ఇళ్లంతా బంధువులుండిపోయారు. నైట్ పడుకుందామంటే ఎక్కడా చోటు దొరకలేదు. అందుకే మేమిద్దరం దాబాపై పడకేశాం. వేసవిలో ఆ చల్లగాలికి భలే అనిపించింది.

కొంచెం దూరంలోనే పడుకున్నాడు
శ్రవణ్ కూడా నాకు కొంచెం దూరంలోనే పడుకున్నాడు. కొద్దిసేపు దుప్పటి మొత్తం కప్పుకుంటాడు. మళ్లీ తర్వాత దుప్పటి తీసి నావైపు చూస్తాడు. నేను కూడా అలాగే చేశా కొద్దిసేపు. అలాగే చిలిపిగా ఆడుకున్నాం.

ఏవేవో ముచ్చట్లు చెప్పాలని
శ్రవణ్ తో ఏవేవో ముచ్చట్లు చెప్పాలని ఉండేది. కానీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనిపించింది. అంతలోనే శ్రవణ్ అంటూ వాళ్ల అమ్మ గట్టిగా అతన్ని పిలిచింది. ఒరేయ్ కిందకొచ్చి పడుకోరా అని అంది. తనమే నేను రాను నేను ఇక్కడే పడుకుంటా అన్నాడు.

నన్ను నేను మైమరిచిపోయాను
ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. పున్నమి వెలుగుల్లో తన మోము చూస్తూ నన్ను నేను మైమరిచిపోయాను. శ్రవణ్.. శ్రావణి పేర్లు కూడా బాగా కలిసిపోయాయి. విశాంత్ పెళ్లి ఇంటికి దగ్గర్లోని కల్యాణమంటపంలో పెట్టుకున్నారు.

బాగా లేట్ అయ్యింది
అందరూ వెళ్లిపోయారు. నేను రెడీ అవుతూ ఉండేసరికి బాగా లేట్ అయ్యింది. శ్రవణ్ కు ఫోన్ చేశా. తను కల్యాణ మంటపం నుంచి బైక్ పై వచ్చి పికప్ చేసుకుంటానన్నాడు. పెళ్లి కొడుకున్నా అందంగా ముస్తాబయ్యాడు విశాంత్.

శ్రావణి రెడీ అయ్యావా
తనను చూడగానే ఎంత ముద్దుచ్చాడో. శ్రావణి రెడీ అయ్యావా అంటూ గదిలోకి వచ్చాడు. అప్పుడు నేను నా చీర కుచ్చిళ్లనులోపలికి సరి చేసుకుంటూ ఉన్నాను. నన్ను అలా చూసేసరికి సిగ్గు పడిపోయాను. తను కూడా వెంటనే అటు వైపు తిరిగాడు.

కాస్తకు పక్కకి రమ్మని కళ్లతోనే సైగలు చేశా
ఇద్దరం బైక్ పై కల్యాణ మంటపానికి చేరుకున్నాం. విశాంత్ తన మరదలు మెడలో తాళి కట్టే సమయంలో నేను శ్రవణ్ ను తలుచుకున్నాను. తను కూడా నా మెడలో అలా తాళి కట్టే రోజు రావాలని కోరుకున్నాను. పెళ్లి అయిపోయాక తనని కాస్తకు పక్కకి రమ్మని కళ్లతోనే సైగలు చేశాను. ఎందుకంటే నాకు కన్వినెంట్ గా లేదు. నాకు ఏవైనా కాస్త టాబ్లెట్స్ తీసుకురావా అని అడిగాను. అయితే తను మాత్రం తప్పుగా అనుకున్నాడు.



Click it and Unblock the Notifications
