For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలో ఉన్నప్పుడు నా వక్షోజాలపై చెయ్యేశాడు, పక్కనే కూర్చొంటే పక్కకొస్తారా? #mystory262

By
|

తను నా స్నేహితుడు. ఎంతోకాలం ఒకరికొకరం పరిచయం. ఇద్దరం ఒకే కాలేజీలో బీటెక్ చేశాం. బీటెక్ తనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ తర్వాత ఇద్దరం ఎంటెక్ లో ఒక కాలేజీలో చదవడంతో అక్కడ బాగా దగ్గరయ్యాడు. ఎంటెక్ లో నాకు అందరూ కొత్త ఫ్రెండ్స్ ఉండడం, మా కాలేజీ నుంచి తెలిసిన అబ్బాయి అతనే కావడంతో అతనితో ఎక్కువగా మాట్లాడేదాన్ని.

ఇద్దరికీ ఇంటర్న్ షిప్ కూడా ఒకే చోట రావడంతో మరింత దగ్గరయ్యాడు. నేను ప్రతి విషయాన్ని తనతో చెప్పేదాన్ని. ఇద్దరం ఫోన్లలో చాట్ చేసుకునేవాళ్లం. కాలేజీ అయిపోయాక ఇద్దరం వెళ్లి స్నాక్స్ తినేవాళ్లం.

ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం

ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం

వాళ్ల ఊరు కూడా మా ఊరికి దగ్గర్లోనే ఉండడంతో ఎప్పుడైనా ఊరు వెళ్లేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం. అయితే అతన్ని నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ గానే భావించాను. కానీ తను మాత్రం నన్ను మరో రకంగా ఊహించుకున్నాడు.

రాత్రి పదింటికి జర్నీ

రాత్రి పదింటికి జర్నీ

ఒక రోజు మేమిద్దరం బస్ లో వెళ్తున్నాం. రాత్రి పదింటికి జర్నీ స్టార్ట్ అయ్యింది. పన్నెండు గంటలో ఆ ప్రాంతంలో నాకు మెలకువ వచ్చింది. అప్పటికే తను నాపై తన ఆనించి పడుకున్నాడు. ఫ్రెండే కదా అని ఏమీ అనలేదు. నాకు కాస్త చికాగ్గా ఉండడంతో తలను అటుపెట్టుకుని పడుకోమని చెప్పాను.

నా వక్షోజాలను తాకుతూ

నా వక్షోజాలను తాకుతూ

మళ్లీ నిద్రలోకి జారుకున్నాను. నాకు ఏదో అవుతున్నట్లు అనిపించింది. తీరా చూస్తే అతను నా టాప్ లోపల చెయ్యి పెట్టి నా వక్షోజాలను తాకుతూ ఉన్నాడు. నాకు కొద్ది క్షణాల వరకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత చాలా కోపం వచ్చింది. గట్టిగా అరుద్దామనుకున్నాను. కానీ అతను నా ఫ్రెండే అని ఊరుకున్నాను. అతని పరువును అలా తీయడం నాకు ఇష్టం లేదు.

నేను ఎలా సహకరిస్తాననుకున్నాడో

నేను ఎలా సహకరిస్తాననుకున్నాడో

ఎవరో తెలియని వ్యక్తి అలా ప్రవర్తిస్తే చెప్పుతో కొట్టేదాన్ని. కానీ అతను తెలిసిన వాడు కావడంతో అక్కడ ఏమీ అనలేకపోయాను. వెంటనే కండెక్టర్ కు చెప్పి లైట్స్ ఆన్ చేయించాను. బస్ దిగే వరకు నిద్రపోలేదు. తర్వాత నుంచి అతని ముఖం కూడా చూడడం లేదు. తను నా బాయ్ ఫ్రెండ్ కాదు మరేమీ కాదు అలాంటి వాడికి నేను ఎలా సహకరిస్తాననుకున్నాడో నాకు అర్థం కావడం లేదు.

Most Read : అవకాశం ఇప్పిస్తానని చెప్పి నన్ను బాగా వాడుకున్నాడు, రకరకాల భంగిమల్లో ఇబ్బందిపెట్టాడు

తన అవసరాలకు వాడుకోవాలనుకున్నాడు

తన అవసరాలకు వాడుకోవాలనుకున్నాడు

కేవలం తన అవసరాలకు నన్ను వాడుకోవాలనుకున్నాడు. ఏ అమ్మాయైనా ప్రియుడికి ముద్దు ఇవ్వడానికే చాలా ఆలోచిస్తుంది. అలాంటింది అతను నన్ను ఫిజికల్ గా వాడుకోవాలంటే నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. తర్వాత నేను వాడి ముఖం కూడా చూడలేదు.

నీ పక్కన వచ్చి పడుకుంటుంది అనుకోవడం

నీ పక్కన వచ్చి పడుకుంటుంది అనుకోవడం

బస్ లో నీ పక్క సీటులో కూర్చొంటే, థియేటర్ లో పక్కన సీటులో కూర్చొంటే, మెట్రోలో ఎక్కడ స్పేస్ లేక నీ పక్కనే నిలబడితే, ఆఫీస్ లో నీ పక్కనే కూర్చొన్నంత మాత్రానా, హోటల్ లో పక్కనే కూర్చొని తిన్నంత మాత్రానా ఆ అమ్మాయి వచ్చి నీ పక్కన వచ్చి పడుకుంటుంది అనుకోవడం నీ అమాయకత్వం. అలా ఏ అమ్మాయి చేయదు.

టచ్ చేయడానికి కూడా

టచ్ చేయడానికి కూడా

కానీ అలాంటి అమ్మాయిలందరినీ చాలా మంది అబ్బాయిలు ఏదో చేసేయాలనుకుంటారు. ఒక అబ్బాయి సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను.. నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా పెళ్లికి ముందు అతను టచ్ చేయడానికి కూడా అనుమతి ఇవ్వని నాలాంటి అమ్మాయిలు చాలా మందే ఉన్నారు.

Most Read: మా ఆయనకు రోజుకు మూడు సార్లు కావాలి, ఐదేళ్లు నాకు అందులో నరకం చూపించాడు

చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుంది

చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుంది

అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. కొందరు నాలా కూడా ఉంటారు. అందువల్ల అబ్బాయిలు ఛాన్స్ వచ్చింది కదా అని ఎలా అంటే అలా అసభ్యంగా అమ్మాయిలతో ప్రవర్తించకండి. మీ టైమ్ బాగుండి కొన్ని సార్లు తప్పించుకోవొచ్చేమోగానీ ఎప్పుడోసారి మాత్రం చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుంది.

English summary

My best friend misbehave with me and it's hurting me

My best friend misbehave with me and it's hurting me