For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద‌లు కుద‌ర్చిన వివాహం వ‌ద్ద‌నుకున్నాను... ఏళ్ల త‌ర్వాత ఇలా ఉన్నాను...

By Sujeeth Kumar
|

నా త‌ల్లిదండ్రులు నా కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలో అబ్బాయిని, వాళ్ల త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌వ‌మ‌న్న‌ప్పుడు ఇంట్లో దాదాపు ర‌ణ‌రంగ‌మే అయ్యింది. నాకా పెళ్లంటే అస్స‌లు ఇష్టంలేదు. క‌నీసం 5ఏళ్ల వ‌ర‌కు ఆ ఆలోచ‌నే లేదు. ఇన్‌ఫాక్ట్ నేను నా బ్యాచ్‌ల‌ర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.

30 ఏళ్లు నిండేందుకు ఇంకా రెండుళ్లు ఉన్నా పెళ్లి గిళ్లీ అంటే అస్స‌లు ఆస‌క్తి లేదు. అయితే త‌ల్లిదండ్రుల బ‌లవంతం మేర‌కు నేను అబ్బాయిని క‌లిసేందుకు ఒప్పుకున్నాను. ఎంత బాగున్నా స‌రే చేసుకోన‌ని క‌రాఖండిగా చెప్పేశాను. అక్క‌డికీ మా అమ్మానాన్న అన్నారు నేను ఎవ‌రినైనా ప్రేమిస్తే సంతోషంగా వాళ్ల‌కిచ్చి పెళ్లి చేస్తామ‌ని. కానీ నాకే పెళ్లంటే ఆస‌క్తి లేదు.

తొలి సారి క‌లిసిన‌ప్పుడు

తొలి సారి క‌లిసిన‌ప్పుడు

ఒక అప‌రిచితుడిని క‌లిసి బాగా ఉన్న‌ట్టు న‌టించ‌డం నా వ‌ల్ల కాలేదు. నా ఫేవ‌రేట్ కాఫీ షాపులో క‌లిసినా ఎంతో ఇబ్బందిగా ఫీల‌య్యాను. అత‌డి ఆన్‌లైన్ ప్రొఫైల్‌ను చూసి ఎలా ఉంటాడో ఒక అంచ‌నాకు వ‌చ్చాను. తీరా అక్క‌డికి వెళ్లాక చూడ‌డానికి అస్స‌లు అలా లేడు.

నేను అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు

నేను అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు

నాలాగే అత‌డు చాలా న‌ర్వెస్‌గా క‌నిపించాడు. నాతో అన్నాడు ఇప్పుడు మ‌నం పెళ్లి చూపుల‌కు క‌ల‌వ‌లేదు అనుకోండి. కేవ‌లం మ‌న త‌ల్లిదండ్రుల మ‌న ప్రాణాల వెంట పడి పెళ్లి పెళ్లి అని గోల చేస్తున్నార‌ని గాసిప్ మాట్లాడుకుందాం అన్నాడు. దానికి నేను ప‌డీప‌డీ న‌వ్వాను. అదేదో సినిమాలో అరేంజ్ మ్యారేజ్ కోసం హీరో హీరోయిన్‌తో అనే స‌న్నివేశం గుర్తొచ్చింది.

లోలోప‌ల సంతోషం ఉన్నా

లోలోప‌ల సంతోషం ఉన్నా

ఆ సాయంత్రం నేను అనుకున్న‌ట్టుగా జ‌ర‌గ‌లేదు. అత‌డిని క‌లిసినందుకు లోలోప‌ల సంతోషంగా ఉన్నా దాన్ని ఒప్పుకునేందుకు మ‌న‌సు రాలేదు. అంత మాత్రాన అత‌డితో పెళ్లికి సై అని కాదు. మేమిద్ద‌రం ఒక‌రితో ఒక‌రం ట‌చ్‌లో ఉంటామ‌ని చెప్పుకొని వ‌చ్చాం. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఫేస్‌బుక్‌లో స్నేహితుల‌మ‌య్యాం.

రెండేళ్ల త‌ర్వాత‌...

రెండేళ్ల త‌ర్వాత‌...

ఆ త‌ర్వాత రెండేళ్లు అలా గ‌డిచాయి. ఈ కాలంలో ఎన్నో జ‌రిగాయి. అత‌డు ఉద్యోగ‌రీత్యా చికాగో వెళ్లిపోయాడు. నేను నా జాబ్ కు రిజైన్ చేసి సొంతంగా బ్లాగ్ రాయ‌డం మొద‌లుపెట్టాను. అత‌డితో త‌ర‌చూ చాట్ చేస్తుండేదాన్ని. అత‌డు ఇండియా తిరిగొచ్చాక పెళ్లి చేసుకోమ‌ని మా పేరెంట్స్ బ‌ల‌వంత‌పెట్టారు. ఈ సారి కాద‌న‌డానికి నాకు ఎలాంటి కార‌ణం దొర‌క‌లేదు. ఆశ్చ‌ర్య‌క‌రంగా నేను పెళ్లి ఒప్పుకున్నాను.

ప‌దేళ్ల సంబ‌రం

ప‌దేళ్ల సంబ‌రం

మా పెళ్ల‌యి 10ఏళ్ల‌వుతోంది. నేను కోరుకున్న‌దానికంటే ఎక్కువే ల‌భించింది. ఇప్పుడు నేను 7ఏళ్ల పిల్ల‌వాడికి త‌ల్లిని. నా త‌ల్లిదండ్రులు నా కోసం ఉత్త‌మమైన‌దాన్ని ఇచ్చారు. దాన్ని అప్పుడు గుర్తించ‌లేక‌పోయాను. ఇప్పుడు నేను త‌ల్లిగా మారాకే వాళ్ల విలువ తెలిసొచ్చింది. నాకు రైట్ మొగుడిని ఎంపిక చేసి ఇచ్చినందుకు వాళ్ల ప‌ట్ల గ‌ర్వంగా ఉన్నాను.

English summary

my flawed idea of an arranged marriage

When my parents forced me to meet a prospective groom and his family, I almost raged a war against them. But they told me if I had anyone in mind or in love with someone, they will be equally happy to meet him. Unfortunately, I was enjoying my status single and had no plans to settle down, at least for the next 5 years (I was just two years shy of turning 30).