Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
ఆ పిల్ల హ్యాండ్ ఇచ్చినా నా భర్త తననే తలుచుకుంటూ ఉంటాడు, ఆయనపై అసహ్యం పుడుతుంది #mystory306
నా భర్త తన మాజీ ప్రియురాలినే మనస్సులో తలచుకుంటూనే నాతో రాత్రి పడుకుంటాడు. ముద్దులు పెట్టేది నాకే.. కానీ ఊహించుకునేది తనని. ఆ పని కూడా నాతోనే చేస్తాడు కానీ తన మనస్సులో ఊహించుకునేది మాత్రం తన ప్రియురాలి
మా ఆయన నాతో ప్రతి విషయాన్ని చెబుతాడు. దేన్ని దాచడు. నా భర్తలోని నిజాయితీ నాకు బాగా నచ్చుతుంది. మా ఆయనకు పెళ్లి కాకముందు ఒక ప్రియురాలు ఉండేది. ఆ విషయాన్ని నాకు చెప్పాడు.
పెళ్లికి ముందు తను ప్రేమ పేరుతో కొన్నాళ్లు పిచ్చోడు అయిపోయాడు. ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి కావడంతో తట్టుకోలేకపోయాడు.

ముందే తెలుసు
ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు. ఎందుకంటే నా భర్త స్వయానా మా అమ్మ అన్న కొడుకు. అప్పట్లో మా మామయ్య తన కొడుకు పరిస్థితి చాలా బాధపడ్డాడు.

సొంత బావనే
తనను అలాగే విడిచిపెడితే పిచ్చి వాడైపోతాడనుకున్నాడు. అందుకే వెంటనే మా అమ్మతో అన్ని విషయాలు చెప్పి నాతో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఎంతైనా సొంత బావనే కదాని నేను కూడా పెళ్లికి ఒప్పుకన్నా.

తనలాంటి అందెగత్తె
పెళ్లయ్యాక మా బావతో రోజూ ఇబ్బందిపడుతున్నా. తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఎప్పుడూ నాకు చెబుతూ ఉంటాడు. తనలాంటి అందెగత్తె ఈ విశ్వంలోనే ఇంకెవ్వరూ ఉండరని ఆమెను పొగుడుతూ ఉంటాడు.

తన భర్తతో హ్యాపీగా కాపురం
ఏమండీ అదెక్కడో తన భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటూ ఉంది.. తను నిన్ను పూర్తిగా మరిచిపోయింది. నువ్వెందుకు తన గురించి అంతలా ఆలోచిస్తావంటే వినడు. తనను ఎంత మర్చిపోవాలనుకున్నా నేను మరిచిపోలేను అంటాడు.

ముద్దులు పెట్టేది నాకే.. కానీ
నా భర్త తన మాజీ ప్రియురాలినే మనస్సులో తలచుకుంటూనే నాతో రాత్రి పడుకుంటాడు. ముద్దులు పెట్టేది నాకే.. కానీ ఊహించుకునేది తనని. ఆ పని కూడా నాతోనే చేస్తాడు కానీ తన మనస్సులో ఊహించుకునేది మాత్రం తన ప్రియురాలినే.

మరీ మితిమీరిపోతున్నాయి
నేను మొదట కొన్నాళ్లు భరించాను. కానీ రానురాను ఆయన ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఆయన ఊహాప్రపంచం గురించి నాకు కూడా చెప్పాడు. తన ప్రేయసి తనతో ఎలా ప్రవర్తించేదో అవన్నీ చెప్పి నన్ను కూడా అలా తనతో ప్రవర్తించమంటున్నాడు.

శృంగారం సమయంలో
నాకు మా ఆయన తీరు అస్సలు నచ్చడం లేదు. శృంగారం సమయంలో నా భర్త తన ప్రియురాలిని ఊహించుకుని నాతో పాల్గొనడం నాకు అస్సలు నచ్చడం లేదు.

హ్యాండ్ ఇచ్చి వెళ్లాక
తాను ఎప్పుడూ ఏదో ఒక లోకంలో ఉంటాడు. తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. పెళ్లికి ముందు మా ఆయన ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ పిల్ల హ్యాండ్ ఇచ్చి వెళ్లాక కూడా తననే తలుచుకుంటూ ఉండడం నన్ను బాధిస్తుంది.

సర్వసంగా భావించి
తన ప్రతి సమస్యను అర్థం చేసుకుని, తననే సర్వసంగా భావించి బతికే నన్ను పట్టించుకోకుండా మోసం చేసిన అమ్మాయి గురించే ఆలోచించడం కరెక్టేనా? నా భర్త సొంతం నా బావనే కాబట్టి ఏమనలేకపోతున్నాను.

నా ప్లేస్ లో మీరుంటే
అయితే నా భర్తతో కొన్నాళ్లుగా అసలు శృంగారంలో పాల్గొనడం లేదు. అలా అయినా దారిలోకి వస్తాడని నేను అనుకుంటున్నాను. నా ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి.



Click it and Unblock the Notifications
