శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ వక్షోజాలు ఎందుకంతా పెద్దవిగా మారుతాయి?

Written By:
Subscribe to Boldsky

శృంగారంలో పాల్గొన్నపుడు అమ్మాయి శరీరంలో చాలా మార్పులొస్తాయి. ముఖ్యంగా స్త్రీ వక్షోజాల రూపు రేఖల్లో కొన్ని మార్పులొస్తాయి. స్త్రీ శరీరంలో కామోద్రేక కేంధ్రాల్లో వక్షోజాలు ప్రథమ స్థానంలో ఉంటాయి.

సెక్స్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు కామోద్రేకం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు వక్షోజాలు బాగా పెద్దవిగా కన్పిస్తాయి. కామోద్రేకం తగ్గాక ఎలా అయితే పురుషాంగం మామూలుగా అయిపోతుందో అలాగే వక్షోజాలు వాటి పూర్వ స్థితిలోకి వచ్చేస్తాయి.

నరాలు లెక్క పెట్టొచ్చు

నరాలు లెక్క పెట్టొచ్చు

స్త్రీ సెక్స్ ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నప్పడు అంటే సెక్స్ లో ఉఛ్చస్థానానికి వెళ్లినప్పుడు వక్షోజాలలో ఉన్న నరాలు లెక్కపెట్టవచ్చు. ఒక్కోసారి సెక్స్ లో విపరీతమైన ఆనందం దొరుకుతున్నప్పుడు వక్షోజాలు చెమట కూడా పట్టేస్తాయి.

చెమట మరింత రెచ్చగొడుతుంది

చెమట మరింత రెచ్చగొడుతుంది

వక్షోజాల నుంచి వచ్చే చెమట వాసన పురుషున్ని మరింతగా రెచ్చగొడ్తుంది. సెక్స్ లో ఉన్నప్పుడు వక్షోజాలు రంగు కూడా మారుతాయి.. సెక్స్ లో ఎక్కువ ఆనందంగా ఉన్న సమయంలో వక్షోజాలు పింక్ రంగులోకన్పిస్తాయి.

సెక్స్ తర్వాత చిన్నవిగా మారుతాయి

సెక్స్ తర్వాత చిన్నవిగా మారుతాయి

వక్షోజాలు ఆ సమంయలో పింక్ రంగులో మారడానికి కారణం ఓస్ట్రోజన్. సెక్స్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా అయితే వక్షోజాలు పెరుగుతాయో అదే విధంగా స్తన పరివేశం కూడా పెరుగుతుంది..సెక్స్ తర్వాత చిన్నగా అయిపోతుంది.

నాలుగు దశలు

నాలుగు దశలు

స్త్రీ సెక్స్‌పరంగా ప్రేరణ పొందినప్పుడు జననేంద్రియాలలో ముఖ్యంగా వక్షోజాలలో కలిగే మార్పులను నాలుగు దశలుగా విభజించవచ్చు. మొదటిది ఎక్జైట్‌మెంట్ ఫేజ్, రెండోది ఫ్లాటోపేజ్, మూడు ఆర్గజమిక్ ఫేజ్, నాలుగోది రిజల్యూషన్ ఫేజ్‌గా ఉంటాయి.

రక్తంతో నిండిపోతాయి

రక్తంతో నిండిపోతాయి

లైంగిక ప్రేరణ కలిగినప్పుడు అంచెలంచెలుగా జననేంద్రియాలలో కలిగే పరిణామాలే వక్షోజాలలో కూడా కలుగుతాయి. సెక్స్ స్పందనలు కలుగగానే మొట్టమొదటిగా, ప్రధానంగా కలిగేది రక్తాధిక్యత. జననేంద్రియాలు, వక్షోజాలు అధికంగా రక్తాన్ని నింపుకుంటాయి.

సూపర్ ఫిషియల్

సూపర్ ఫిషియల్

అధికంగా రక్తం చేరడమనేది ఈ అవయవాల దగ్గర ఉండే చర్మంలోనే కాకుండా ఈ అవయవాలకు సంబంధించిన కండలో కూడా జరుగుతుంది. దీనినే సూపర్ ఫిషియల్ అండ్ డీప్ వాసోకంజిషన్ అంటారు.

చనుమొనలు నిక్కబొడుచుకుపోతాయి

చనుమొనలు నిక్కబొడుచుకుపోతాయి

లైంగిక ప్రేరణ కలిగినప్పుడు స్త్రీల వక్షోజాలలో కలిగే మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సెక్స్ స్పందనలకి సంబంధించి ఎక్జైట్‌మెంట్ ఫేజ్‌లో ముందుగా చనుమొనలు నిక్కబొడుచుకుంటాయి. గట్టిగా తయారవుతాయి.

రెండు నిక్కబొడుచుకపోవు

రెండు నిక్కబొడుచుకపోవు

చనుమొనలలో ఉండే పల్చటి కండరాలు ఉద్రేకానికి లోనుకావడంతో ఈ పరిణామం జరుగుతుంది. చనుమొనలు రెండూ ఒకేసారి నిక్కబొడుచుకోవడం ఉండదు. ముందుగా ఒకటి, కాస్త ఆలస్యంగా రెండోది జరుగుతుంది. అందుకని ముందుగా ఒకటి గట్టిగా మరొకటి కాస్త మెత్తగా అనిపిస్తుంది.

అంత మేర పెరుగుతాయి

అంత మేర పెరుగుతాయి

సెక్స్ ప్రేరణతో నిక్కబొడుచుకున్న చనుమొనలు అరసెంటీమీటరు నుంచి సెంటీమీటరు అదనంగా పరిమాణం పెరుగుతాయి. చుట్టుకొలత కూడా పావు సెంటీమీటరు నుంచి అరసెంటీమీటరు అదనంగా పెరుగుతాయి.

చిన్నవిగా ఉంటే బాగా గుర్తు పట్టొచ్చు

చిన్నవిగా ఉంటే బాగా గుర్తు పట్టొచ్చు

సాధారణంగానే పెద్దవిగా ఉండే చనుమొనలు అంతగా పెద్దవి అయినట్లు కనబడవు. చిన్నవిగా ఉండే చనుమొనలు సెక్స్ ప్రేరణతో పరిమాణం పెరిగినట్లు స్పష్టంగా కనబడతాయి. ఎగ్జైట్‌మెంట్ దశలో రక్తాధిక్యత అధికమవుతుంది కనుక వక్షోజాల పరిమాణంలో మార్పు వస్తుంది.

చనుమొనల చుట్టూ ఉండే ప్రాంతం

చనుమొనల చుట్టూ ఉండే ప్రాంతం

చనుమొనలు చుట్టూ రూపాయి మేర ఊదారంగులో ఉండే చర్మం ఉబ్బుగా మారుతుంది. దీంతో అంతకుముందున్న చనుమొనల ఆకృతి తగ్గినట్లుగా కనబడతాయి. ఇక ప్లాటోఫేజ్‌లో కనబడే సెక్స్‌ఫ్లెష్ కేవలం వక్షోజాల మీదే కాకుండా, ఛాతీ మీద, ఇతర చోట్ల, పొట్టపైనా కనబడుతుంది. దీనినే సెక్స్‌ఫ్లెష్ అంటారు.

ఆర్గజం

ఆర్గజం

ఇక లైంగిక ప్రక్రియలో ప్లాటోఫేజ్ నుంచి సుఖప్రాప్తి కలిగే స్థితి ఆర్గజంకు పరుగులు తీస్తాయి. ఈ దశలో వక్షోజాలలో బిగుతు అలాగే నిలబడి ఉంటుంది. చనుమొనలు బాగా నిక్కబొడుచుకుని ఉంటాయి.

పదినిమిషాల తర్వాత మళ్లీ మామూలుగా

పదినిమిషాల తర్వాత మళ్లీ మామూలుగా

క్లైమాక్స్‌కు చేరిన పిదప వక్షోజాలు తిరిగి మామూలు స్థితికి చేరుకోవడం జరుగుతుంది. సుఖప్రాప్తి కలిగిన తర్వాత పది నిమిషాల్లో వక్షోజాలు, చనుమొనలు యధాస్థితికి వచ్చేస్తాయి.

English summary

physical changes to womens body during sex

physical changes to womens body during sex
Story first published: Wednesday, February 28, 2018, 18:00 [IST]