For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రహస్య సంబంధాలు కేవలం ఒకరి అవసరాల కోసమేనా?

|

రహస్య సంబంధాలు అనేక కారణాల వలన సంభవిస్తాయి. కానీ ఇవి కేవలం ఆ సంబంధంలోని ఒకరి ప్రయోజనాల కోసమేనా? కొన్ని సంబంధాలలో, కొందరు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటారు, ఒత్తిడిని, ఆందోళనలను తొలగించే క్రమంలో, సరైన ప్రేమను జీవిత భాగస్వామి నుండి పొందలేని క్రమంలో, లేదా మానసిక పరిపక్వత లేని క్రమంలో, చెడు ఆలోచనల దృష్ట్యా, ఇలా ఎన్నో అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

కానీ ఒత్తిడిని జయిస్తాము అనుకుంటూనే తెలీకుండా రహస్య సంబంధాన్ని కలిగి ఉండే క్రమంలో మరియు దాచే క్రమంలో ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు అన్నది వాస్తవం. రహస్య సంబంధాల పట్ల అధికంగా ఆకర్షితులై, ఉన్న సంబంధాలను చెడగొట్టుకునే స్థితికి దిగజారుతుంటారు కూడా. సగం ఈ క్రమంలో భాగంగానే, విడాకులు, ఆత్మహత్యలు, చివరికి పరువు హత్యలు వంటి వాటికి కూడా కొన్ని సంబంధాలు కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతున్నాయి. అయినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు.

SECRET RELATIONSHIPS WORK IN FAVOUR OF THE ONES INVOLVED; YES OR NO?

రహస్య సంబంధాలు అంత తేలికగా పనిచేయవు. ఒకవేళ విజయవంతం అయితే, అది వారి అదృష్టం కిందే లెక్క.

అసలు ఇన్ని నష్టాలు ఉన్నా కూడా, కొందరు వ్యక్తులు ఎందుకు రహస్య సంబంధాలవైపు సుముఖత చూపుతున్నారు?

1. విడాకులు తీసుకునే క్రమంలో

1. విడాకులు తీసుకునే క్రమంలో

కొన్ని సందర్భాలలో ఇటువంటి రహస్య సంబంధాలు కలిగిన వ్యక్తులు కేవలం అదనపు ఇబ్బందులను నివారించడానికే సంబంధాన్ని రహస్యంగా ఉంచుతారు. ముఖ్యంగా ఒక విడాకుల సమస్యలో పోరాడుతున్నప్పుడు అతను/ఆమె ఆ సంబంధాలను రహస్యంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే వీరు అనుకున్న విధంగా విడాకులు మంజూరవుతాయో, స్వేచ్చావాయువులు వచ్చినంత స్వతంత్రభావాలకు లోనవుతుంటారు. కొందరు కొంతకాలానికి బాహాటంగానే బయటపెట్టే అవకాశాలు ఉన్నా, కొందరు జీవితంలో ఎప్పటికీ బయటపడకుండా జాగ్రత్తపడేలా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇవి వారివారి కట్టుబాట్లను ఉద్దేశించి కూడా ఉంటుంది. కానీ విడాకులు తీసుకుంటున్నారు సరే, మీరు విడాకులు ఇచ్చే వ్యక్తి అసలు అంత తప్పు ఏంచేసింది అన్న సమాధానం కూడా మీకు ఉండాలి. అనివార్య పరిస్థితుల్లో సంబంధాలను ఏర్పరచుకోవడం వేరు, కావాలని ఆకర్షణకులోనై సంబంధాలను నాశనం చేస్కోవడం వేరు. తెలివితక్కువతనంతో జీవితాన్ని చిందరవందర చేస్కోకుండా, సంయమనం వహిస్తూ మంచి సంబంధం వైపుకు మొగ్గుచూపడం మేలు.

2. మీ స్నేహితుని పాత గార్ల్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేస్తున్నారా

2. మీ స్నేహితుని పాత గార్ల్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేస్తున్నారా

మారుతున్న కాలానుగుణంగా కొన్ని వినక తప్పడం లేదు అన్నది వాస్తవం. మీరు మీ స్నేహితుడి మాజీ "గాళ్ ఫ్రెండ్" తో డేటింగ్ చేయడం ప్రారంభించినట్లయితే,. మీ స్నేహితుడికి చెప్పడానికి మీకు ఖచ్చితంగా ధైర్యం చాలదు మరియు మీ ఈ సంబంధాన్ని మీ స్నేహితుడు మరియు ఇతరుల నుండి రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితులు నెలకొంటుంటాయి. ఈ రకమైన సంబందాలు ఎక్కువకాలం నిలబడవు కూడా. మీలో అపరాధం భావం ఎక్కువగా ఉండి, సంబంధంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి, మరియు అనేక జంటలు విషయాలను రహస్యంగా ఉంచడానికే అంగీకరిస్తున్నారు. కాబట్టి మీరు మీ స్నేహితుని మాజీ "గార్ల్ ఫ్రెండ్" తో డేటింగ్ చేస్తూ విషయాన్ని దాచి ఉంచినట్లయితే, మీ స్నేహం దెబ్బతినడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు. ఏదిఏమైనా ఇటువంటి మోసపూరిత సంబంధం ఎక్కువ కాలం పనిచేయదు. కానీ వారి పాత సంబంధం వీగిపోవడంలో మీస్నేహితుని పాత్ర ఎక్కువగా ఉండి, భవిష్యత్తులో మీఇద్దరి మనసుల దృష్ట్యా సంబంధాన్ని కొనసాగించగలము అన్న నమ్మకం ఉంటే మాత్రం బహిరంగంగానే పెళ్ళికి కూడా సిద్దపడవచ్చు. ధైర్యం ఉంటే. ఇలాంటి విషయాల్లో రహస్యం అనేది, జీవితాన్ని కూడా రహస్యంగానే నాశనం చేస్తుంది.

3. తల్లిదండ్రులకు తెలీకుండా రహస్య సంబంధం కలిగి ఉండటం

3. తల్లిదండ్రులకు తెలీకుండా రహస్య సంబంధం కలిగి ఉండటం

మీరు ఒక సంబంధం కలిగి ఉన్నారని మీ తల్లిదండ్రులు తెలుసుకోవాలని కోరుకోని పక్షంలో సక్రమ సంబంధమైనా రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. మీరు ఎంచుకున్న భాగస్వామి, వారి ప్రమాణాలకు సరిపోకపోతే, తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో అన్న విశాతం మనందరికీ తెలుసు. ఇటువంటి ఒత్తిడులే రహస్య సంబంధాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి.

ఈ రకమైన రహస్య సంబంధాలు తరచూ ప్రేమికులకు అనుకూలంగా పనిచేస్తాయి. కానీ వీరు పెళ్లిదాకా వెళ్ళే సందర్భాలు కాస్త తక్కువగా ఉండడం వలన, జీవితాన్ని నిర్మించుకుంటున్న నిజమైన ప్రేమికులు కూడా మాటలు పడవలసి వస్తుంది.

4. ఈ చిత్రంలో మరొకరు కూడా ఉన్నారు

4. ఈ చిత్రంలో మరొకరు కూడా ఉన్నారు

ఇదివరకే వేరే సంబంధాలలో ఉండి, పరిస్థితుల కారణంగా విషయాన్ని బయట పెట్టలేక, పెళ్ళిళ్ళు చేసుకుని జీవిత భాగస్వామిని కలిగి ఉండి కూడా, పాతసంబంధాలను కొనసాగించే వారిని తరచుగా మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ సంబంధాలు బయటపడుతాయో ఊహించని పరిణామాలు ఎదురవడమే కాకుండా, ఉనికికే నష్టం వాటిల్లే ప్రమాదాలు ఉన్నాయి. కానీ కొందరు భాగస్వాములు ఇటువంటి సంబంధాలను కూడా అంగీకరించి, సంబంధాలకు కొత్త అర్ధాలను తెస్తూ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నారు.

ఇటువంటి సంబంధాలు కలిగి ఉండడం వలన జీవితంలో ఎన్ని ఉన్నా, సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు.

5. మత మరియు కులపరమైన ఒత్తిడి

5. మత మరియు కులపరమైన ఒత్తిడి

జంటలు వారి సంబంధాన్ని రహస్యంగా ఉంచడానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి కులమతాలు. కులమతాల గురించి ప్రజలు తీవ్రమైన భావజాలాలు, పక్షపాతాలు కలిగి ఉన్నారు అన్నది వాస్తవం. వీటికి వ్యతిరేకులుగా ఉన్నవారిని భాహిష్కరించడం, పరువు హత్యలకు తెగబడడం వంటివి అనేకం మనం వార్తలలో చూస్తూనే ఉంటాం. ఇటువంటి అంశాలు తీసుకొచ్చిన భయాల కారణంగా, మూడో కంటికి తెలీకుండా రహస్య సంబంధాలను కొనసాగిస్తున్నారు అనేకులు. బయటపడిన రోజు వీరి ప్రాణాలకు సైతం హాని కలుగక తప్పని పరిస్థితులు కలుగుతుంటాయి. ముఖ్యంగా రెండు వేర్వేరు మతపరమైన ఆచారాలకు చెందిన ప్రతి జంటలో ఈ ఒత్తిడి తీవ్రమైన సమస్యగా ఉంది. వీటిలో ఆమోదయోగ్యాలు కొన్నే అయినా, ఆ కుటుంబాలు అనేక కాలాల పాటు ఏదో ఒకరీతిలో వివక్షను ఎదుర్కుంటూనే ఉండడం కడుశోచనీయం.

ఒక జంట రహస్య సంబంధాన్ని కలిగి ఉండటానికి ఈ 5 ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కానీ ఈ సంబంధాలు కలిగి ఉన్నవారు ఎప్పటికైనా సమస్యలలో చిక్కుకోక తప్పదు.

English summary

SECRET RELATIONSHIPS WORK IN FAVOUR OF THE ONES INVOLVED; YES OR NO?

These are the 5 reasons that make a couple keep a secret relationship. There are lots of reasons to keep a relationship secret, but not all are created equally. If you find yourself in a secret relationship, the first important thing to do is to ask yourself if you are really happy about it or not. Read the article to understand.
Story first published: Friday, July 20, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more